BigBoss Telugu 8: బిగ్‌బాస్ హౌస్‌లో బూతులు.. స్నేహితుల మధ్య పెరిగిన వైరం

ABN , Publish Date - Oct 11 , 2024 | 08:52 AM

హౌస్‌లో చోటు చేసుకున్న కొని పరిణామాలు మణికంఠని సైలెంట్ అయ్యేలా చేశాయి. ఇద్దరి బెస్ట్ ఫ్రెండ్స్ మద్యలోని స్నేహం బూతులు తిట్టుకునే స్థాయికి దిగజారింది. ఇంతకీ ఏమైందంటే..

Nikhil & Manikanta

బిగ్‌బాస్ హౌస్‌లో వైల్డ్ కార్డ్ ఎంట్రీలతో కళకళలాడుతోంది. ఈ నేపథ్యంలోనే ఆడియెన్స్ ఫెవరెట్ కంటెస్టెంట్ మణికంఠ మూడ్‌లో కూడా బాగా జోష్ పెరిగింది. మరోవైపు ఈ వీక్‌ నామినేషన్స్‌లో కూడా లేకపోవడంతో ఫుల్ హుషారు మీదున్నాడు. అయితే హౌస్‌లో చోటు చేసుకున్న కొని పరిణామాలు మణికంఠని సైలెంట్ అయ్యేలా చేశాయి. ఇద్దరి బెస్ట్ ఫ్రెండ్స్ మద్యలోని స్నేహం బూతులు తిట్టుకునే స్థాయికి దిగజారింది. ఇంతకీ ఏమైందంటే..


బిగ్‌బాస్ హౌస్‌లో ఎమోషనల్‌గా చాలా వీక్‌గా కనిపించిన మణికంఠకి మొదటి నుండి అండగా నిలిచినా కంటెస్టెంట్ నిఖిల్. విగ్గు ఎపిసోడ్ నుండి మొదలుకొని మణికంఠ ఎప్పుడు ఎమోషనల్‌గా వీకైన నిఖిల్ మొదటగా ఓదార్చి దైర్యం చెప్పేవాడు. అనంతరం హౌస్‌లో ఏర్పడిన గ్రూప్ ఫ్రెండ్షిప్స్‌తో మణికంఠ.. నిఖిల్‌కి దూరమయ్యాడు. తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో నిఖిల్ ఏకంగా మణికంఠపై బూతులు మాట్లాడటం చర్చినీయాంశమైంది. లేటెస్ట్‌గా జరిగిన ఎపిసోడ్‌లో ఫిజికల్ టాస్క్స్ నిర్వహించారు. ఓజీ క్లాన్‌లో నిఖిల్, మణికంఠ ఇద్దరూ చెలరేగి ఆడారు. కానీ చివరి రౌండ్‌లో నిఖిల్ పోటీకి మణికంఠ తట్టుకోలేకపోయాడు. దీంతో పరాజయం పొందాడు. అయితే నిఖిల్ ఓ స్టార్ పాయింట్ సంపాదించాడు. గొప్ప ప్రదర్శన కనిపించిన మణికంఠకి కూడా రాయల్ క్లాన్ స్టార్ ఇచ్చింది. దీంతో నిఖిల్ పాటు ఓజీ క్లాన్ కంటెస్టెంట్స్ కాస్త అసహనం వ్యక్తం చేశారు.


కాసేపటి తర్వాత మణికంఠ కిచెన్‌లో ఉన్న సీత దగ్గరికెళ్లి కామెడీ చేశాడు. హే సీత.. వాట్సాప్ అంటూ పలకరించాడు. అలాగే పక్కనున్న నిఖిల్‌ని పరోక్షంగా.. మాడిపోయిన పెసరట్టు ముఖం అన్నాడు. దీంతో ఆయన మా హెడ్ చెఫ్ అంటూ సీత కాస్త హవా చేసింది. అవునా.. హెడ్ లెని చెఫ్ వాడు హెడ్ చీఫ్ ఏంటి అంటూ మణికంఠ కామెడీ చేశాడు. దీంతో నిఖిల్ ఆగ్రహంతో రేయ్.. "అంటే మరి ఫీలవకు.. మిం** బయటికి" అంటూ ఫైర్ అయ్యాడు. దీంతో మణికంఠ సైలెంట్‌గా అక్కడి నుండి జారుకున్నాడు.

ఈ సంభాషణలు స్నేహపూర్వకంగా జరిగితే ఏం జరిగిగేది కాదు. ఏకంగా బూతులు ప్రయోగించటంతో బిగ్‌బాస్ ఏలా రెస్పాండ్ అవుతాడో అని అంత వేచి చూస్తున్నారు. ఒకప్పుడు మణికంఠ- నిఖిల్ స్నేహం సోనియా, పృథ్వీ, నిఖిల్ గ్రూప్ కట్టడంతో విడిపోయింది. తర్వాత సోనియా ఎలిమినేట్ అయ్యింది. దీంతో అందరు మళ్ళీ కలుస్తారు అనుకున్నారు. కానీ.. యష్మీ ఎంట్రీతో మరింతా దూరం పెరిగింది.

Also Read- Prabhas: ప్రభాస్ పెళ్లిపై క్లారిటీ.. ఎప్పుడంటే

Also Read- Bigg Boss 8 Telugu: బిగ్‌బాస్ హౌజ్‌లో స్మోక్‌ చేస్తూ దొరికిన విష్ణుప్రియ‌.. వైర‌ల్‌

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Oct 11 , 2024 | 08:55 AM