Bigg Boss S8 Grand Finale: ప్రైజ్ మనీ ఎంతో చెప్పిన నాగ్..

ABN , Publish Date - Dec 15 , 2024 | 06:32 PM

దాదాపు వంద రోజులుగా బిగ్ బాస్ సీజన్ 8 టీవీ ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది. ఈ సీజన్ ఆదివారం జరిగే గ్రాండ్ ఫినాలేతో ముగియనుంది. ఈ సీజన్ విన్నర్, రన్నర్, మనీ సూట్ కేస్ దక్కించుకునే మూడో కంటెస్టెంట్ ఎవరు? అలాగే ఇంత దూరం వచ్చి 4, 5 స్థానాలకే పరిమితం అయిన కంటెస్టెంట్ ఎవరనేది? ఈ లైవ్ అప్డేట్స్‌లో

Bigg Boss Telugu 8 Grand Finale

రాత్రి 8.30 గంటలకు: హౌస్‌లో ఉన్న 5గురులో విన్నర్ అయిన వారు ఎలా రియాక్ట్ అవుతారో.. కంటెస్టెంట్స్‌ని చెప్పమనగా.. వాళ్లు ఒక్కొక్కరు మిగతా వాళ్లని ఇమిటేట్ చేస్తున్నారు. అవినాష్ అందరినీ దించేస్తున్నారు. పుట్టూ అంటూ అవినాష్ చేసిన ఇమిటేషన్‌కు ప్రేరణ భర్త 10కి పది మార్కులు వేశారు. మణికంఠ విన్ అయితే అఖిల బ్రహ్మాండ కోటి పాడేవాడు అని అవినాష్ అంటే.. ‘బయటకు రా చూసుకుందాం’ అని మణికంఠ కౌంటర్ వేశాడు. నబీల్ విన్నర్ అయితే ఏం చేస్తాడో చూపించమని గౌతమ్‌ని నాగ్ అడగగా.. నబీల్ అయితే మాటల కంటే అరుపులు ఎక్కువ ఉంటాయని చేసి చూపించాడు. పృథ్వీని కూడా ఇమిటేట్ చేశాడు. అయితే, మధ్యలో విష్ణు, గడ్డం బావుందా అంటూ విష్ణు ప్రియను లైన్‌లోకి తెచ్చాడు. గౌతమ్, సోనియా విన్నర్స్ అయితే పరిస్థితి ఏంటి? అని నాగ్ అడిగితే.. కెమెరాను వదిలేసి గౌతమ్ ఎక్కడ ఎక్కడో చూస్తాడని ప్రేరణ చేసి చూపించింది. సోనియాను ఇమిటేట్ చేసినప్పుడు ‘పెద్దోడు - చిన్నోడు’ అని అనగానే.. ‘యాక్టింగ్ చేస్తున్నావా? చెప్పాలి కదరా’ అంటూ రోహిణి సెటైర్ వేసింది.

ఇలా ఈ ఇమిటేషన్ ఎపిసోడ్ ముగిశాక అందరి చేతిలో హార్ట్ సింబల్స్ పెట్టారు. ఇంటిలో ఎవరెవరికి ఏది ఇష్టమో చెప్పాలని నాగ్ అడిగారు. డ్రాగన్ ఫ్లై రూమ్ బెడ్ తనకి ఎంతో ఇష్టమని చెప్పింది ప్రేరణ. వీకెండ్ ఎపిసోడ్ కోసం కూర్చునే ప్లేస్ ఇష్టమని అవినాష్, గార్డెన్ ఏరియా అండ్ బెడ్ అంటే ఇష్టమని నిఖిల్ చెప్పాడు. అనంతరం బిగ్ బాస్ సీజన్ 8 ట్రోఫీని నాగార్జున రివీల్ చేశారు. ఆ ట్రోఫీ విన్ అయ్యేది ఎవరో కాసేపట్లో తెలుస్తుందని కంటెస్టెంట్స్‌లో నాగార్జున టెన్షన్ పెంచారు.


Bigg-Boss-Finale.jpg

రాత్రి 8 గంటలకు: ఐదుగురు కంటెస్టెంట్స్‌తో గేమ్ ఆడించిన నాగార్జున.. ప్రైజ్ మనీ ఎంతో ప్రకటించారు. ఈ సీజన్ విన్నర్‌కు రూ. 55 లక్షలతో పాటు, మారుతి సుజుకీ కారుని ఇవ్వబోతున్నట్లుగా చెప్పారు. శ్రీకృష్ణ, గీతామాధురి పాటలతో కంటెస్టెంట్‌ని టెన్షన్ వదిలి కూల్ అవ్వమని చెప్పి బ్రేక్ చెప్పారు నాగార్జున. శ్రీకృష్ణ, గీతామాధురి సింగింగ్ షో నడుస్తోంది.

రాత్రి 7.30 గంటలకు: హౌస్‌లో ఉన్న ఐదుగురు కంటెస్టెంట్స్ స్పెషల్ పెర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. డ్యాన్స్‌తో రఫ్ఫాడిస్తున్నారు. విడివిడిగా ఒక్కొక్కరు డ్యాన్స్ చేసిన అనంతరం ‘వేట్టయ్యాన్’ పాటకి అందరూ కలిసి డ్యాన్స్ చేస్తున్నారు. ఆ ఐదుగురితో నాగార్జున ముచ్చటిస్తున్నారు. కంటెస్టెంట్స్ పేరేంట్స్‌తో నాగ్ మాట్లాడుతూ.. మాట్లాడిస్తున్నారు. అనంతరం కంటెస్టెంట్స్ అందరికీ నాగ్ సీజన్ 8 హౌస్‌ని చూపిస్తూ.. ఫ్లాష్ బ్యాక్‌కి తీసుకెళ్లారు.

రాత్రి 7 గంటలకు: నాగ్ గ్రాండ్ ఎంట్రీ అనంతరం ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్‌తో నాగార్జున ముచ్చటిస్తున్నారు. రోహిణి, టేస్టీ తేజ కామెడీ చేస్తున్నారు. టేస్టీ తేజ గౌతమ్ గెలవాలని కోరుకుంటున్నానని, మైండ్ మాత్రం నిఖిల్ అని చెబుతున్నట్లుగా తెలిపారు.


తెలుగు బిగ్‌బాస్ సీజన్ 8 (Bigg Boss Telugu సీజన్ 8) కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. ఇంకొన్ని గంటల్లో బిగ్ బాస్ తెలుగు 8 విజేత ఎవరనేది (Bigg Boss Telugu 8 Winner) తెలిసిపోనుంది. ఇప్పటికే విన్నర్ ఎవరో తెలుపుతూ.. కొన్ని లీక్స్ వచ్చినప్పటికీ.. అధికారికంగా నాగార్జున ఎవరికి పట్టం కట్టబోతున్నారనేది లైవ్ అప్డేట్స్‌లో తెలుసుకుందా. ప్రస్తుతం ఈ పోటీలో ఫైనల్‌కు ఐదుగురు కంటెస్టెంట్స్ చేరుకున్నారు. గౌతమ్, నిఖిల్, నబిల్, ప్రేరణ, అవినాష్‌లలో బిగ్ బాస్ సీజన్ 8 అవార్డ్ ఎవరిని వరించనుందో? విన్నర్ ఎవరో? రన్నర్ ఎవరో? మనీతో నిండిన సూట్ కేస్ దక్కేది ఎవరికో? 4, 5 స్థానాలను ఎవరిని వరించనున్నాయో? ఈ గ్రాండ్ ఫినాలేని బిగ్ బాస్ ఎలా ప్లాన్ చేశాడో.. అనే వివరాలు మొత్తం కాసేపట్లో..

ప్రస్తుతం బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే జరుగుతున్న వేదిక బయట పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేసి.. జనం గుమిగూడకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు.


ఎలిమినేట్ అయిన ఆ ముగ్గురు కంటెస్టెంట్స్ డుమ్మా..

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 8 ముగింపు దశకు చేరుకుంది. ఇవాళ జరిగే ఫినాలేతో విన్నర్ ఎవరో తేలిపోనుంది. సాధారణంగా ఫినాలే అనగానే ఉండే హడావుడి, సందడి గురించి స్పెషల్‌గా చెప్పనక్కర్లేదు. గెస్ట్‌లతో పాటు ఎక్స్ హౌస్‌మేట్స్, సెలబ్రిటీల పెర్ఫార్మెన్ దాకా ప్రతిదీ నెక్స్ట్ లెవల్‌లో ఉంటుంది. ప్రతి ఫైనల్స్‌కు సీజన్‌లో పార్టిసిపేట్ చేసిన హౌస్‌మేట్స్ కూడా వచ్చి హల్‌చల్ చేస్తుంటారు. మరీ అత్యవసరమైతే తప్ప వాళ్లు మిస్ అవ్వరు. అయితే ఈసారి హౌస్‌లో సందడి తగ్గనుంది. ఏకంగా ముగ్గురు ‌హౌస్‌మేట్స్ ఫినాలేకు డుమ్మా కొట్టేశారని తెలుస్తోంది. విష్ణుప్రియ సహా మరో ఇద్దరు కంటెస్టెంట్స్ ఫినాలే మిస్ అయ్యారని సమాచారం. బిగ్‌బాస్ గ్రాండ్ ఫినాలేకి సంబంధించిన ప్రోమో ఇప్పటికే వచ్చేసింది. అయితే ఇందులో కొందరు హౌస్‌మేట్స్ కనిపించడం లేదు. విష్ణుప్రియతో పాటు హరితేజ, నయని పావని ప్రోమోలో మిస్ అయ్యారు. దీంతో వీళ్లు నిజంగానే డుమ్మా కొట్టారా? లేదా హైడ్ చేస్తున్నారా? అనే డిస్కషన్స్ మొదలయ్యాయి.

Also Read-Chiru - Bunny: మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో అల్లు అర్జున్.. పిక్ వైరల్.. ఇక ఫుల్‌స్టాప్ పెట్టినట్టేనా!

Also Read-Bunny-Balayya: బన్నీకి బాలయ్య ఫోన్..

Also Read-రేలంగి వివాహ ఆహ్వాన పత్రిక: 91 సంవత్సరాల క్రితపు శుభలేఖను చూశారా..

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Dec 15 , 2024 | 09:11 PM