Bigg Boss 8: గంగవ్వ అవుట్.. బీబీ ఇంటికి దారేది
ABN , Publish Date - Oct 31 , 2024 | 11:09 AM
లేటెస్ట్ బిగ్‌బాస్ ఎపిసోడ్‌లో బీబీ ఇంటికి దారేది అంటూ కొత్త రచ్చ జరిగింది. ఇంతకీ ఏమైందంటే
లేటెస్ట్ బిగ్‌బాస్ ఎపిసోడ్‌లో కంటెస్టెంట్స్‌కి సరికొత్త టాస్క్‌లు ఇచ్చాడు బిగ్‌బాస్. ఈ టాస్క్‌లు ఆడటం కోసం హౌస్ మేట్స్‌ని మూడు టీములుగా విడగొట్టారు. రెడ్, గ్రీన్, యెల్లో. ప్రతి టాస్క్ కంప్లీట్ అయినా తర్వాత గెలిచినా టీమ్‌కి బిగ్‌బాస్ ఒక యెల్లో కార్డు ఇస్తారు. ఆ యెల్లో కార్డుని తమకి నచ్చని టీమ్‌కి ఇవ్వొచ్చు. దీని ద్వారా ఆ టీమ్ నుండి ఒకరు మెగా చీఫ్ కంటెండర్ నుండి తప్పుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో నిర్వహించిన మూడు టాస్క్ లలో మూడు టీములు ఒక్కొక యెల్లో కార్డుని సంపాదించాయి. ఇప్పుడే బిగ్ బాస్ అసలు ట్విస్ట్ ఇచ్చాడు నాలుగో టాస్క్ గెలిచినా టీమ్ రెండు యెల్లో కార్డ్స్ లభిస్తాయని తెలిపాడు. దీని తర్వాత ఎం రచ్చ జరిగిందంటే..
బీబీ ఇంటికి దారేది ఛాలెంజ్‌లో నాలుగో టాస్క్.. పాయిజన్ యాపిల్. ఈ టాస్క్ లో గార్డెన్ ఏరియాలో ఒక చెట్టు ఏర్పాటు చేశారు. ప్రతి టీమ్ కి సంబంధించిన ఒక సభ్యుడు చెట్టుపై ఉన్న రెడ్, గ్రీన్, యెల్లో, బ్లూ కలర్స్‌లో ఏర్పాటు చేసిన యాపిల్స్ ని కాపాడుకోవాలి. బజర్ మోగిన ప్రతిసారి ఇతర టీముల సభ్యులు యాపిల్స్ ని కోయడానికి ట్రై చేస్తారు. ఇక ఈ టాస్క్ కి పృథ్వీ సంచలకుడిగా వ్యవహరిస్తాడు. కాగా, టాస్క్ పూర్తయేసరికి పృథ్వీ యెల్లో టీమ్ ఓడిపోయింది. దీంతో గేమ్ రెడ్, గ్రీన్ టీమ్‌ల మధ్య టై అయ్యింది. దీంతో మూడు టీమ్స్ మరో రౌండ్ గేమ్ ఆడాలని ఆదేశించాడు.
పృథ్వీ ఎం చేశావ్..
ఇక రెండో రౌండ్ స్టార్ట్ కాగానే బ్లూ, గ్రీన్ టీమ్స్‌కు సంబంధించిన యాపిల్స్‌ను తెంపేశారు. ఈ క్రమంలోనే రెడ్ టీమ్‌కి సంబంధించిన యాపిల్ కింద పడింది. ఆ యాపిల్‌ని ఎవరు తీసుకోవద్దని యష్మీ జాగ్రత్తగా సంచాలకుడు పృథ్వీ దగ్గరికి తీసుకెళ్లింది. దీంతో బ్లూ టీమ్ విన్నర్ కావాలి. కానీ.. తన టీమ్ యాపిల్ దాచిపెట్టుకున్న యష్మీ టీమ్ నే విన్నర్ గా ప్రకటించాడు పృథ్వీ. దీంతో యష్మీ టీమే షాక్ అయ్యింది. దీంతో యెల్లో కార్డ్స్ సంపాదించినా యష్మీ టీమ్.. బ్లూ టీమ్ కి ఇచ్చింది.
బ్లూ టీమ్‌కు రెండు యెల్లో కార్డ్స్ రావడంతో.. ఒకరు మెగా చీఫ్ కంటెండర్ రేసు నుండి తప్పించుకోవాల్సి ఉంది. అయితే హరితేజ, అవినాష్, నిఖిల్ డ్రాప్ కావడానికి సిద్ధంగా లేకపోవడంతో గంగవ్వని డ్రాప్ చేసేశారు. ఇక గెలిచినా రెడ్ టీంలో వారికి డైస్ రోల్ లో ఎవరెవరికి ఏ నంబర్స్ వచ్చాయో చూడటానికి ఎవరు ఆసక్తి చూపలేదు. ఎందుకంటే పృథ్వీ సంచాలకుడిగా ఫెయిల్ ఆవడంతోనే రెడ్ టీమ్ గెలిచిందని అంత భావిస్తున్నారు.