Bharateeyudu 2 OTT streaming: భారతీయుడు 2 ఓటిటి లో ఎప్పుడు, ఎక్కడ అంటే...

ABN , Publish Date - Jul 12 , 2024 | 02:32 PM

శంకర్, కమల్ హాసన్ కాంబినేషన్ లో 'భారతీయుడు 2' సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ప్రేక్షకులు, విమర్శకులు ఆశించినంతగా ఈ సినిమా లేదని తెలుస్తోంది. ఈ సినిమా ఓటిటి లో కూడా తొందరగానే ప్రసారం అయ్యేట్టు కనపడతోంది. ఓటిటి స్ట్రీమింగ్ ఎక్కడ, ఎప్పుడు అంటే...

Kamal Haasan from Bharateeyudu 2

దర్శకుడు శంకర్, కమల్ హాసన్ కాంబినేషన్ లో 'భారతీయుడు' సినిమాకి సీక్వల్ గా వచ్చిన 'భారతీయుడు 2' ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాపై చాలా అంచనాలు వున్నాయి, కానీ దర్శకుడు ఆ అంచనాలకి తగ్గట్టుగా ఈ 'భారతీయుడు 2' లేదని అటు విమర్శకులు, ఇటు ప్రేక్షకులు అంటున్నారు. అంతే కాకుండా ఈ సినిమాకి ఇంకో సీక్వల్ 'భారతీయుడు 3' కూడా వుంది. అందులో కథ ఎలా ఉంటుందో ఈ 'భారతీయుడు 2' చివర్లో చూపించారు. (Kamal Haasan, Siddharth starrer Bharateeyudu 2 is streaming on Netflix on August 15)

అయితే ఇప్పుడు 'భారతీయుడు 2' ఓటిటి లో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది, ఎప్పుడు అవుతుంది అని చాలామంది ప్రేక్షకులు వెతుకుతున్నారు. ఈ సినిమా ఓటిటి స్ట్రీమింగ్ హక్కులు ప్రముఖ సంస్థ నెట్ ఫ్లిక్స్ కొనుక్కుంది. అలాగే నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమా ఆగస్టు 15వ తేదీన స్ట్రీమింగ్ అవుతుందని తెలుస్తోంది. (Shankar and Kamal Haasan combination Bharateeyudu 2 is streamong on August 15, on Netflix)

Siddharth.jpg

ఎందుకంటే ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులు కొనుక్కున్నప్పుడే ఈ సినిమాని ఎప్పుడు స్ట్రీమింగ్ చెయ్యాలనే విషయం కూడా నిర్ధారణ చేసుకున్నారు అని ఒక వార్త నడుస్తోంది. అందుకే ముందుగానే స్ట్రీమింగ్ తేదీ కూడా ఆగస్టు 15 అని చెప్పినట్టుగా వార్త నడుస్తోంది. ఈ సినిమా జులై 12న విడుదలైంది అంటే సుమారు ఒక నెల తరువాత స్ట్రీమింగ్ అయిపోతుంది. అయితే ఇప్పుడు థియేటర్స్ లో వచ్చిన రెస్పాన్స్ బట్టి ఈ సినిమా తొందరగానే స్ట్రీమింగ్ అయిపోవచ్చు అని ఒక చర్చ కూడా నడుస్తోంది. (Netflix bought the OTT streaming rights of Bharateeyudu 2)

ఈ సినిమాలో కమల్ హాసన్ సేనాపతి పాత్రలో లంచం తీసుకున్నవారిపై యుద్ధం ప్రకటిస్తాడు. అతనికి తోడుగా సిద్ధార్థ్, ప్రియా భవానీ శంకర్, రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఈ సినిమాలో వున్నారు. బాబీ సింహ సిబిఐ అధికారిగా కనపడతారు. సముద్రఖని, జాకీర్ హుస్సేన్, పీయూష్ ఘోష్ ఇలా చాలామంది నటీనటులు ఇందులో వున్నారు. లైకా సంస్థ ఈ సినిమా నిర్మాణం చేపట్టింది. వివిధ కారణాల వలన ఈ సినిమా చిత్రీకరణ సుమారు నాలుగైదు సంవత్సరాలు పట్టింది, ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. (Netflix is streaming Bharateeyudu 2 on August 15)

Updated Date - Jul 12 , 2024 | 02:32 PM