Bezawada Bebakka: నేను ఎలిమినేట్ కావడానికి కారణం ఏమిటంటే..

ABN , Publish Date - Sep 10 , 2024 | 06:46 PM

బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌-8 మొదటివారం పూర్తి చేసుకుంది. తొలివారి ఎలిమినేషన్‌ కూడా జరిగిపోయింది. ఈ సీజన్‌లో హౌస్‌లోకి మొదటిగా ఎంట్రీ ఇచ్చింది యష్మి అయితే.. ఫస్ట్ ఎలిమేషన్‌లో హౌస్ నుంచి బయటికి వచ్చేసింది బెజవాడ బేబక్క. హౌస్ నుంచి బయటికి వచ్చిన అనంతరం బేజవాడ బేబక్క ఇంటర్వ్యూలతో హల్‌చల్ చేస్తోంది. అసలు తను ఎందుకు ఎలిమినేట్ అయిందో తాజాగా బేబక్క ఏబీఎన్‌కు తెలిపింది.

Bezawada Bebakka Bigg Boss 8 Fame

బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌-8 (Biggboss -8) మొదటివారం పూర్తి చేసుకుంది. తొలివారి ఎలిమినేషన్‌ కూడా జరిగిపోయింది. ఈ సీజన్‌లో హౌస్‌లోకి మొదటిగా ఎంట్రీ ఇచ్చింది యష్మి అయితే.. ఫస్ట్ ఎలిమేషన్‌లో హౌస్ నుంచి బయటికి వచ్చేసింది బెజవాడ బేబక్క. పంచ్‌ డైలాగ్‌లు, ప్రాసలతో అలరించిన బెజవాడ బేబక్క (Bezawada bebakka) హౌస్‌ నుంచి ఎలిమినేట్‌ అయినట్లు నాగార్జున ప్రకటించారు. ఈ వారం విష్ణు ప్రియ, బేబక్క, సోనియా, పృథ్వీరాజ్‌, శేఖర్‌ బాషా, నాగ మణికంఠ నామినేట్‌ అవ్వగా.. చివరకు బేబక్క, మణికంఠ ఎలిమేషన్ లిస్ట్‌లో ఉన్నారు. వారిద్దరిలో ఆడియన్స్‌ నుంచి బేబక్కకు తక్కువ ఓట్లు వచ్చినట్లుగా ప్రకటించి నాగార్జున ఆమె ఎలిమినేట్ అయినట్లుగా ప్రకటించారు. ఇక ఎలిమినేట్ అయ్యి.. హౌస్ బయటకు వచ్చిన బేబక్క.. ఇంటర్వ్యూలతో మీడియాలో హడావుడి చేస్తోంది. తాజాగా ఆమె ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో ముచ్చటించింది.

Also Read- Devara: ‘దేవర’ ట్రైలర్ ఎలా ఉందంటే..



Bebakka.jpg

ఆమె మాట్లాడుతూ.. ఇంత త్వరగా బిగ్‌బాస్‌ సీజన్‌-8 నుంచి బయటకు వచ్చేస్తానని అనుకోలేదు అని ఆమె అన్నారు. మరో అవకాశం కల్పిస్తే బాగా ఆడి తనని తాను నిరూపించుకుంటానని చెప్పారు. ఎలిమినేట్‌ అయినందుకు చాలా బాధగా ఉందని విచారం వ్యక్తం చేశారు. హౌస్‌లో వారం రోజులు ప్రయాణమే అయినా చాలా బాగుందని, ఈ జీవిత అనుభవాన్ని మర్చిపోలేనని తెలిపింది. ఇంకా తను ఈ హౌస్ నుంచి ఎలిమినేట్ అవడానికి కారణం ఏమిటో కూడా ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో షేర్ చేసుకున్నారు. ఈ విషయమై ఆమె ఏం చెప్పిందో.. పై వీడియోలో చూడవచ్చు.

Read Latest Cinema News

Updated Date - Sep 10 , 2024 | 06:46 PM