Ott: ఓటీటీకి తెలుగులో.. దృశ్యం ద‌ర్శ‌కుడి కామెడీ థ్రిల్ల‌ర్‌! ఎందులో.. ఎప్ప‌టినుంచంటే

ABN , Publish Date - Sep 09 , 2024 | 07:03 PM

ఈ వారం డిజిట‌ల్ ప్రేక్ష‌క్ష‌కుల‌ను అల‌రించేందుకు ఓ వినోదాత్మ‌క మ‌ల‌యాళ థ్రిల్ల‌ర్ చిత్రం వ‌చ్చేస్తుంది. బసిల్ జోసెఫ్ హీరోగా న‌టించ‌గా దృశ్యం, నేరు వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రాలతో హిస్ట‌రీ క్రియేట్ చేసిన జీతూ జోసెఫ్ ద‌ర్శకత్వం వ‌హించాడు.

nunakkuzhi

ఈ వారం డిజిట‌ల్ ప్రేక్ష‌క్ష‌కుల‌ను అల‌రించేందుకు ఓ వినోదాత్మ‌క మ‌ల‌యాళ థ్రిల్ల‌ర్ చిత్రం వ‌చ్చేస్తుంది. న‌టుడు బసిల్ జోసెఫ్ (Basil Joseph) సినిమాలకు ఉండే క్రేజ్ మాములుగా ఉండ‌దు. మ‌ల‌యాళంలో త‌ప్పితే వేరే భాష‌లో ఇప్ప‌టివ‌ర‌కు సినిమాలు చేయ‌ని ఈ హీరో కేవ‌లం ఓటీటీ ద్వారా సౌత్ ఇండియా వ్యాప్తంగా త‌న‌కంటూ ప్ర‌త్యేక‌ గుర్తింపును తెచ్చుకోగా, దృశ్యం, నేరు వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రాలతో హిస్ట‌రీ క్రియేట్ చేసిన ద‌ర్శకుడు జీతూ జోసెఫ్ (Jeethu Joseph)ల‌ నుంచి సినిమాలు వ‌స్తున్నాయంటే ఇంటిల్లిపాది హాయిగా క‌లిసి చూడొచ్చే అనే పేరు తెచ్చుకున్నారు. ఈ క్ర‌మంలో వీరిద్ద‌రి క‌ల‌యిక‌లో ఇటీవ‌ల వచ్చిన ‘నూనక్కళి’ (Nunakkuzhi) సినిమాకు థియేటర్లో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీ స్ట్రీమింగ్‌కు రెడీ అయింది.

nunakkuzhi

క‌థ విష‌యానికి వ‌స్తే.. ఎబీ త‌న తండ్రి మ‌ర‌ణానంత‌రం కంపెనీ బాధ్య‌త‌లను కొత్త‌గా తీసుకుంటాడు. అయితే ఎబీ ఓ రోజు త‌న భార్య‌తో క‌లిసి కంపెనీ వ్య‌వ‌హారాల్లో అనుకోకుండా ఓ మిస్టేక్ చేస్తాడు. అ త‌ప్పు జ‌రిగిన తెల్లారే కంపెనీపై ఐటీ రైడ్స్ జ‌రిగి ఎబీ ప‌ర్స‌న‌ల్ ల్యాప్‌టాప్‌ను తీసుకెళ‌తారు. దీంతో ఎబీ త‌న ల్యాప్‌టాప్‌ను తిరిగి తెచ్చుకునే క్ర‌మంలో జ‌రిగిన ప‌రిణామాల నేప‌థ్యంలో సినిమా అనేక ర‌కాల మ‌లుపులు తిరుగుంది. ఆపై ఓ సినిమా అసిస్టెంట్ ద‌ర్శ‌కుడు, పోలీసాఫీస‌ర్‌, ఇన్‌కంట్యాక్స్ ఆఫీస‌ర్‌, సూసైడ్ చేసుకోబోయిన ర‌ష్మిత అనే యువ‌తి ఎబీ జీవితంలోకి వ‌స్తారు. సినిమా ముగింపుకు వ‌చ్చేస‌రికి అప్పటివ‌ర‌కు ఉన్న పాత్ర‌లు మ‌రో తీరుగా మారుతుంటాయి.


nunakkuzhi

ఈ పరిస్థితుల్లో హీరో త‌న ల్యాప్‌టాప్‌ను ద‌క్కించుకోగ‌లిగాడా, త‌ను త‌రుచూ అబ‌ద్దాలు చెప్ప‌డంతో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడ‌నే పాయింట్స్‌తో సినిమా చివ‌రి వ‌ర‌కు మంచి కామెడీని పంచుతూ కాస్త థ్రిల్‌ను కూడా ఇస్తుంది. చివ‌ర‌లో వ‌చ్చే ట్విస్టు కూడా ఆక‌ట్టుకుంటుంది. మ‌నిషి జీవితంలో ఎదురయ్యే అనూహ్య మలుపులను కామెడీతో అందంగా మల్చిన ఈ సినిమా సెప్టెంబర్ 13నుంచి జీ5 (ZEE 5) ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. మలయాళంతో పాటు తెలుగు, కన్నడ భాషల్లో ఈ చిత్రం అందుబాటులో ఉండనుంది. ఈ ‘నూనక్కళి’ (Nunakkuzhi) సినిమాలో ఎలాంటి అస‌భ్య స‌న్నివేశాలు కూడా లేనందున కుటుంబ‌మంతా క‌లిసి సినిమాను హాయిగా చూసేయ‌వ‌చ్చు.

nunakkuzhi

Updated Date - Sep 09 , 2024 | 07:03 PM