Bahishkarana Trailer: అంజలిని ఇలా ఇంతకు ముందు చూసి ఉండరు.. అరుపులే..

ABN , Publish Date - Jul 11 , 2024 | 09:48 PM

యాభైకి పైగా చిత్రాల్లో హీరోయిన్‌గా, విలక్షణ పాత్రల్లో నటించి మెప్పించిన బ్యూటీ అంజలి. తాజాగా ఆమె ప్రధాన పాత్రలో ZEE 5, పిక్సల్ పిక్చర్స్ ఇండియా బ్యానర్స్‌పై రూపొందుతోన్న వెబ్ సిరీస్ ‘బహిష్కరణ’. ముఖేష్ ప్రజాపతి ఈ సిరీస్‌ను తెరకెక్కిస్తున్నారు. జూలై 19 నుంచి జీ5లో స్ట్రీమింగ్‌కు రానున్న ఈ వెబ్ సిరీస్ ట్రైలర్‌ను తాజాగా కింగ్ నాగార్జున ఆవిష్కరించి యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

Anjali in Bahishkarana Web Series

యాభైకి పైగా చిత్రాల్లో హీరోయిన్‌గా, విలక్షణ పాత్రల్లో నటించి మెప్పించిన బ్యూటీ అంజలి (Anjali). తాజాగా ఆమె ప్రధాన పాత్రలో ZEE 5, పిక్సల్ పిక్చర్స్ ఇండియా బ్యానర్స్‌పై రూపొందుతోన్న వెబ్ సిరీస్ ‘బహిష్కరణ’ (Bahishkarana). ముఖేష్ ప్రజాపతి ఈ సిరీస్‌ను తెరకెక్కిస్తున్నారు. విలేజ్ రివేంజ్ డ్రామా జోనర్‌లో రూపొందుతోన్న ఈ సిరీస్‌లో 6 ఎపిసోడ్స్ ఉండనున్నాయి. ఈ వెబ్ సిరీస్ జూలై 19 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానుంది. తాజాగా ఈ సిరీస్ ట్రైల‌ర్‌ను టాలీవుడ్ కింగ్ నాగార్జున (King Nagarjuna) విడుద‌ల చేసి.. యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ ట్రైల‌ర్‌ను గమనిస్తే.. తెలుగు నటి అంజలి ఇంతకు ముందు ఎప్పుడూ చూడని అవతార్‌లో, బోల్డ్ సీన్స్‌లోనూ ఇందులో రెచ్చిపోయినట్లుగా తెలుస్తోంది. మంచోడు చేసే త‌ప్పేంటో తెలుసా.. చెడ్డోడి చ‌రిత్ర గురించి తెలుసుకోవ‌టం అనే డైలాగ్‌తో ప్రారంభ‌మైన ఈ ట్రైలర్.. ఓ వైపు ప‌చ్చ‌టి ప‌ల్లెటూరు, అక్క‌డ అంజ‌లి, శ్రీతేజ్‌, అన‌న్య నాగ‌ళ్ల పాత్రల మ‌ధ్య స‌న్నివేశాల‌ను అందంగా చూపిస్తూనే.. ప‌ల్లెటూరులో ఊరి పెద్ద‌, అత‌ని మ‌నుషులు చేసే దురాగ‌తాల‌ను చూపించారు. అలాంటి ప‌ల్లెటూర్లోకి పుష్ప(అంజలి) అనే అమ్మాయి వ‌స్తుంది. ఆమె వ‌చ్చిన త‌ర్వాత అక్క‌డి పరిస్థితులు మారుతాయి. ఇంత‌కీ పుష్ప అక్క‌డికెందుకు వ‌చ్చింది. ఊరి పెద్ద‌తో ఆమెకున్న రిలేష‌న్ ఏంటి? అమ్మాయిల‌ను ఆట‌వ‌స్తువులుగా చూసింది ఎవ‌రు? ఇలాంటి ఎన్నెన్నో ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానమే బ‌హిష్క‌ర‌ణ సీరీస్‌. (Bahishkarana Web Series)


Anjali-Web-Series.jpg

అంజ‌లి పాత్ర‌ను గ‌మనిస్తే.. ఓ వైపు ప్రేమ కురిపిస్తూనే మ‌రో వైపు ఆగ్ర‌హావేశంతో ఊగిపోయే ఆమె పాత్ర‌ను చూస్తుంటే ఆమె పోషించిన పాత్ర‌లోని భావోద్వేగాలు ఎంత లోతుల్లో ఉన్నాయో అర్థ‌మ‌వుతుంది. మరీ ముఖ్యంగా ఈ సిరీస్ తర్వాత అంజలిని చూసే కోణమే మారిపోవచ్చు కూడా. శ్రీతేజ్‌, అన‌న్య నాగ‌ళ్ల పాత్ర‌ల‌తో పాటు ఊరి పెద్ద పాత్ర‌లో ర‌వీంద్ర‌న్ విజ‌య్‌ను చూడొచ్చు. ప్ర‌శాంతంగా ఉండే ఆ ప‌ల్లెటూరుకి అమ్మాయి ఎందుకు వ‌చ్చింది.. ఆమెకు అక్క‌డ ఎదురైన ప‌రిస్థితులేంటి? ఆమె ఎవ‌రిపై ప్ర‌తీకారం తీర్చుకోవాల‌నుకుంది.. ఎందుకు? అనే విష‌యాలు తెలియాలంటే మాత్రం జూలై 19న ZEE 5లో స్ట్రీమింగ్ కానున్న‌ ‘బహిష్కరణ’ సిరీస్ చూడాల్సిందే. ఈ ట్రైల‌ర్‌లో ప్ర‌తి విజువ‌ల్‌, ప్ర‌తి మాటా సిరీస్ గురించి లోతుగా ఏదో చెప్పబోతున్నారనేలా హింట్ అయితే ఇస్తోంది. ప్రస్తుతం ఈ ట్రైలర్‌ టాప్‌లో ట్రెండ్ అవుతోంది.

Updated Date - Jul 11 , 2024 | 11:39 PM