Bahishkarana: అంజలి, అన‌న్య నాగ‌ళ్ల‌ వెబ్ సిరీస్ ‘బహిష్కరణ’.. మోషన్ పోస్టర్ రిలీజ్

ABN , Publish Date - Jun 16 , 2024 | 04:09 PM

అచ్చ తెలుగు నాయిక‌లు అంజలి, అన‌న్య నాగ‌ళ్ల ప్ర‌ధాన పాత్ర‌ల్లో నూత‌నంగా రూపొందుతోన్న వెబ్ సిరీస్ ‘బహిష్కరణ’. ఆదివారం అంజలి పుట్టినరోజు ఈ సందర్భంగా ‘బహిష్కరణ’ మోషన్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు.

Bahishkarana: అంజలి, అన‌న్య నాగ‌ళ్ల‌ వెబ్ సిరీస్ ‘బహిష్కరణ’.. మోషన్ పోస్టర్ రిలీజ్
anjali

యాబైకి పైగా చిత్రాల్లో హీరోయిన్‌గా, ప్రధాన పాత్రల్లో మెప్పించిన అచ్చ తెలుగు నటి అంజలి (Anjali). తాజాగా ఆమె ప్రధాన పాత్రలో ZEE 5, ఫిక్సల్ పిక్చర్స్ ఇండియా బ్యానర్స్‌పై రూపొందుతోన్న వెబ్ సిరీస్ ‘బహిష్కరణ’ (Bahishkarana).

FyucPwcXwAIekIT.jpeg

ముఖేష్ ప్రజాపతి (Mukesh Prajapathi) ఈ సిరీస్‌ను తెరకెక్కిస్తున్నారు. విలేజ్ రివేంజ్ డ్రామా జోనర్‌లో రూపొందుతోన్న ఈ సిరీస్‌లో 6 ఎపిసోడ్స్ ఉంటాయి. ఆదివారం అంజలి పుట్టినరోజు. ఈ సందర్భంగా ‘బహిష్కరణ’ (Bahishkarana) మోషన్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు.

F2bOcsYa4AATxh6.jpeg

మోషన్ పోస్టర్‌ను గమనిస్తే.. అంజలి (Anjali) చేతిలో వేట కొడవలి పట్టుకుని కోపంగా కూర్చుని ఉండ‌డం.. ఆమె పక్కన్న ఓ చెక్క కుర్చీ మంటల్లో కాలిపోవ‌డం చూస్తుంటే మరోసారి అంజలి మరో విలక్షణమైన పాత్రలో ఇన్‌టెన్స్ క్యారెక్టర్‌తో ‘బహిష్కరణ’ (Bahishkarana) వెబ్ సిరీస్‌లో మెప్పించనుందని తెలుస్తోంది.

bahiskarana.jpg

అంజలి ప్రధాన పాత్రలో నటిస్తోన్నఈ సిరీస్‌లో రవీంద్ర విజయ్ (Ravindra Vijay), శ్రీతేజ్ (Shri Tej), అనన్య నాగళ్ల (Ananya Nagalla), షణ్ముక్, చైతన్య సాగిరాజు, మహ్మద్ బాషా, బేబీ చైత్ర ఇతర పాత్రల్లో మెప్పించనున్నారు.


F4IdW9hWcAAjz8G.jpeg

ఫిక్సల్ పిక్చర్స్ (Pixel Pictures) బ్యానర్‌పై ప్రశాంతి మలిశెట్టి (Prashanti Malisetti) నిర్మిస్తోన్న ‘బహిష్కరణ’ (Bahishkarana) సిరీస్ త్వరలోనే ZEE 5 ద్వారా ప్రేక్షకులను మెప్పించనుంది. ఈ సిరీస్‌కు ప్రసన్నకుమార్ (Prasanna s kumar) సినిమాటోగ్రఫీ అందిస్తుండగా సిద్ధార్థ్ సదాశివుని (Sidharth Sadasivuni) సంగీతాన్ని సమకూరుస్తున్నారు. రవితేజ గిరిజాల ఎడిటర్‌గా బాధ్యతలను నిర్వహిస్తున్నారు.

Updated Date - Jun 16 , 2024 | 04:09 PM