Mamitha Baiju: ఓటీటీలోకి తెలుగులో.. ‘ప్రేమ‌లు’ హీరోయిన్ న‌టించిన ఎమోష‌న‌ల్ ల‌వ్‌స్టోరి

ABN , Publish Date - Apr 29 , 2024 | 06:54 PM

తెలుగు ఓటీటీ ప్రేక్ష‌కుల ముందుకు మ‌రో మ‌ళ‌యాల సినిమా వ‌స్తోంది. అయితే త‌రుచూ వ‌చ్చే చిత్రాలు కాకుండా పూర్తి భిన్న‌మైన సింపుల్ ల‌వ్ స్టోరి డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు వ‌చ్చేస్తోంది.

Mamitha Baiju: ఓటీటీలోకి తెలుగులో.. ‘ప్రేమ‌లు’ హీరోయిన్ న‌టించిన ఎమోష‌న‌ల్ ల‌వ్‌స్టోరి
parinaya vilasam

తెలుగు ఓటీటీ ప్రేక్ష‌కుల ముందుకు మ‌రో మ‌ళ‌యాల సినిమా వ‌స్తోంది. అయితే త‌రుచూ అక్క‌డి నుంచి వ‌చ్చే క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, ఇన్వెస్టిగేష‌న్ థ్రిల్ల‌ర్ జాన‌ర్ చిత్రాలు కాకుండా వాటికి పూర్తి భిన్న‌మైన సింపుల్ ల‌వ్ స్టోరి ‘ప్ర‌ణ‌య విలాసం’ (Pranaya Vilasam) డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు వ‌చ్చేస్తోంది. ఇటీవ‌ల ప్రేమ‌లు (premalu)సినిమాతో సౌత్ ఇండియా క్రేజీ న‌టిగా మారిన మ‌మితా బైజు(Mamitha Baiju)తో పాటు నేరు అనే సినిమాతో ఆక‌ట్టుకున్న మ‌రో మ‌ళ‌యాల సంచ‌ల‌నం అన‌శ్వ‌ర రాజ‌న్ (Anaswara Rajan) ప్ర‌ధాన పాత్ర‌లు పోషించ‌గా అర్జున్ అశోక‌న్ (Arjun Ashokan) హీరోగా న‌టించాడు.

pranaya vilasam.jpeg

2023 ఫిభ్ర‌వ‌రిలో మ‌ళ‌యాలంలో విడుద‌లైన ఈ ‘ప్ర‌ణ‌య విలాసం’ (Pranaya Vilasam) అక్క‌డ మంచి విజ‌యాన్ని ద‌క్కించుకుంది. ఇక క‌థ విష‌యానికి వ‌స్తే.. సూర‌జ్‌కు గోపిక అనే అమ్మాయితో రిలేష‌న్ షిప్‌లో ఉంటాడు, అత‌నికి మ్యైజిక్ అంటే ప్రాణం. అయితే అది అత‌ని నాన్న రాజీవ‌న్‌కు న‌చ్చ‌క‌ త‌రుచూ శ‌త్రువుల లాగా గొడ‌వ ప‌డుతూ ఉంటారు..ఈ క్ర‌మంలో సూర‌జ్‌కు గోపిక‌తో బ్రేక‌ప్ అవుతుంది. త‌ర్వాత త‌ల్లి అనుశ్రీ మ‌ర‌ణించ‌డంతో వారి జీవితంలో నైరాశ్యం ఏర్ప‌డుతుంది.


mamitha.jpeg

అయితే.. గోపిక మ‌ళ్లీ సూర‌జ్‌కు స‌పోర్ట్‌గా నిలుస్తుంది.. త‌ర్వాత రాజీవ‌న్‌కు ఇంట్లో చ‌నిపోయిన త‌న భార్య అనుశ్రీ డైరీ కంట‌ప‌డుతుంది. అందులో అనుశ్రీ త‌న మొద‌టి ప్రేమ గురించి ఉండ‌డంతో రాజీవ‌న్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తాడు. ఆ డైరీని చ‌దివిన కమారుడు సూర‌జ్ ఆ డైరీలో రాసిన విధంగా త‌న త‌ల్లి చివ‌రి కొరిక‌ను తీర్చ‌డానికి సిద్ధ‌మ‌వుతాడు. మొద‌ట్లో తండ్రి నిరాక‌రించినా త‌ర్వాత అత‌ను కూడా కొడుకుతో క‌లిసి ఆ వ్య‌క్తిని క‌నిపెట్టేందుకు రంగంలోకి దిగుతారు. చివ‌ర‌కు వారు అత‌న్ని క‌లిశారా, అనుశ్రీ చివ‌రి కోరిక‌ను నెర‌వేర్చారా అనే ఎమోష‌న‌ల్ అంశాల చుట్టూ సినిమా సాగుతుంది. ఈ సినిమా మే 2 గురువారం నుంచి ఈ టీవీ విన్ (ETV Win) ఓటీటీలో స్ట్రీమింగ్ అవ‌నుంది.

Updated Date - Apr 29 , 2024 | 06:54 PM