Fahadh Faasil film on OTT: అమెజాన్ రిజెక్ట్ చేసిన ఫహద్ ఫాజిల్ ఫ్లాప్ సినిమా ఆహాలో ప్రసారం

ABN , Publish Date - Jul 05 , 2024 | 12:13 PM

ఫహద్ ఫాజిల్ సినిమా అనగానే ప్రేక్షకులు ఆసక్తికాగా ఎదురు చూస్తూ వుంటారు, అటువంటిది గత సంవత్సరం విడుదలైన సినిమా 'ధూమం' ఫ్లాప్ అయింది, సుమారు సంవత్సరం తరువాత ఓటిటి లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇంతకీ ఏమి జరిగింది అంటే...

FInally Dhoomam is relesing on a OTT platform

ఈమధ్య తెలుగు ప్రేక్షకులు మలయాళం సినిమాలని, థియేటర్స్ లో, ఓటిటిలో బాగా ఆదరిస్తున్నారు. ఈ కోవలోనే మలయాళం నటుడు ఫహద్ ఫాజిల్ ఇప్పుడు సూపర్ స్టార్ అయిపోయాడు. ఒక్క మలయాళం సినిమాలలోనే కాకుండా, తెలుగు, తమిళ సినిమాల్లో కూడా రెగ్యులర్ గా కనపడుతూ అందరినీ అలరిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కుని, ప్రేక్షకులని పెంచుకున్నాడు ఫహద్. అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న 'పుష్ప 2: ది రూల్' సినిమాలో ఫహద్ ఒక ప్రధాన పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే.

అలాగే ఇంకో రెండు తెలుగు సినిమాలు, తమిళ సినిమాలతో బిజీగా వున్న ఫహద్ తన సొంత భాష అయిన మలయాళంలో కూడా సినిమాలు బాగానే చేస్తున్నాడు, నిర్మాతగా కూడా మారాడు. ఫహద్ నటించిన మలయాళ సినిమాలు తెలుగులో కూడా విడుదలవుతూ ఉంటాయి, ఓటిటి లో కూడా వస్తూ ఉంటాయి. అయితే గత సంవత్సరం ఫహాద్ నటించిన మలయాళ థ్రిల్లర్ సినిమా 'ధూమం' మాత్రం అంత తొందరగా ఓటీటీలో స్ట్రీమింగ్ అవలేదు. ఈమధ్య నెలరోజుల్లోనే చాలా సినిమాలు వచ్చేస్తున్నాయి, కానీ ఈ సినిమా సుమారు సంవత్సరం అయింది కానీ, ఇంకా రాలేదు, ఈ నెలలో స్ట్రీమింగ్ అవుతోంది.

ఇప్పుడు ఈ సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోంది అంటే, ఆహా ఓటీటీలో జూలై 11 న ప్రసారం కానుంది. అయితే ఆలస్యానికి కారణం ఈ సినిమా థియేటర్స్ లో నడవకపోవటమే, ప్రేక్షక ఆదరణ లేకపోవటమే అని తెలుస్తోంది. ఈ సినిమాని 'కెజిఎఫ్', 'సాలార్' లాంటి పెద్ద బడ్జెట్ చిత్రాలు నిర్మించిన హోంబలే ఫిలిమ్స్ నిర్మించింది. ఈ 'ధూమం' సినిమా ఆ సంస్థకి నిర్మాణంలో మొదటి మలయాళ సినిమా. విజయ్ కిరగందూర్ నిర్మాత, పవన్ కుమార్ దర్శకుడు.

dhoomamstill.jpg

ఈ సినిమాని ముందుగా అమెజాన్ ప్రైమ్ స్ట్రీమింగ్ హక్కులు కొనుక్కొంది. ఆగస్టు 4, 2023 న తమ ఓటిటి లో ప్రసారం చెయ్యాల్సి వుంది, కానీ ఈ సినిమాని ప్రేక్షకులు రిజెక్ట్ చెయ్యడంతో అమెజాన్ వాళ్ళు ప్రసారాన్ని డిలే చేశారు. అయితే కొన్ని రోజుల తరువాత అమెజాన్ వాళ్ళు సినిమా నిర్మాతకి డబ్బులు తిరిగి ఇచ్చేసి ప్రసారం చేయలేమని చేప్పేశారు. కారణం ఈ సినిమాపై ప్రేక్షకులకి అంతగా ఆసక్తి లేకపోవటమే అని చెప్పారు. నవంబర్ 29, 2023 రోజు ఈ సినిమాని ఒక రెండు డిజిటల్ అప్లికేషన్ పై విడుదల చేశారు. అలాగే మే 31, 2024 'వరల్డ్ నో టొబాకో డే' సందర్భంగా హోంబలే ఫిలిమ్స్ తమ యూట్యూబ్ లో ఫ్రీ గా చూసుకోవటానికి అనువుగా అప్లోడ్ చేసింది.

ఇలా ఈ సినిమా కొన్ని ప్లాటుఫార్మ్స్ పై స్ట్రీమింగ్ అయింది, కానీ ఎవరూ ఈ సినిమాని పట్టించుకోలేదు. ఇప్పుడు ఆహా ఓటిటి ఈ ఫ్లాపు సినిమాని తమ ఓటిటి లో జులై 11న ప్రసారం చేస్తోంది. ఇలా అమెజాన్ రిజెక్ట్ చేసిన ఈ సినిమాని ఎట్టకేలకి ఆహా ఓటిటి ప్రసారం చేస్తోంది. అయితే మరి ప్రసార హక్కులు కొన్నారా, లేక షేరింగ్ పద్ధతుల్లో స్ట్రీమింగ్ చేస్తున్నారా అనే విషయం తెలియాల్సి వుంది.

Updated Date - Jul 05 , 2024 | 12:13 PM