OTT: నో లాజిక్.. జస్ట్ ఎంజాయ్! ఓటీటీకి.. తెలుగులోను వచ్చేసిన బాలీవుడ్ భారీ యాక్షన్ థ్రిల్లర్
ABN , Publish Date - Jun 07 , 2024 | 12:56 PM
తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు ఓ బాలీవుడ్ డబ్బింగ్ యాక్షన్ చిత్రం బడేమియా చోటే మియా ఓటీటీ కి వచ్చేసింది. అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ హీరోలుగా ఫృథ్వీరాజ్ సుకుమారన్ ప్రతినాయకుడిగా వచ్చిన ఈ చిత్రం ఏప్రిల్ లో విడుదలై భారీ డిజాస్టర్‌గా నిలిచింది.
తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు ఓ బాలీవుడ్ డబ్బింగ్ యాక్షన్ చిత్రం బడేమియా చోటే మియా (Bade Miyan Chote Miyan) ఓటీటీ కి వచ్చేసింది. అక్షయ్ కుమార్ (Akshay Kumar), టైగర్ ష్రాఫ్ (Tiger Shroff) హీరోలుగా మలయాళ స్టార్ ఫృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) ప్రతినాయకుడిగా వచ్చిన ఈ చిత్రం ఏప్రిల్ 11న ప్రపంచవ్యాప్తంగా విడుదలై భారీ డిజాస్టర్‌గా నిలిచింది.
సుమారు రూ.350 కోట్లకు పైగా బడ్జెట్‌తో నిర్మితమైన ఈ చిత్రం రూ. 100 కోట్ల లోపే కలెక్షన్లు సాధించి భారీ పరాజయాన్ని మూటగట్టుకుంది. బాటీవుడ్ లేటెస్ట్ సెన్షేషన్స్ మానుషి చిల్లర్, అలయా కథానాయికలుగా నటించారు.
కథ విషయానికి వస్తే.. ఇండియన్ ఆర్మీ డిజైన్ చేసిన ఓ పవర్‌పుల్ అయుధాన్ని మాస్టర్ మైండ్ అయిన విలన్ దొంగలిస్తాడు. అ అయుధంతో దేశాన్ని నాశనం చేసే అవకాశం ఉండడంతో హీరోలు అక్షయ్ కుమార్ (Akshay Kumar), టైగర్ ష్రాఫ్ (Tiger Shroff) రంగంలోకి దిగుతారు. ఈ క్రమంలో వారు అ యుధాన్ని తిరిగి దక్కించుకున్నారా లేదా ఆ విలన్ ఎవరు ఆయన స్టోరీ ఏంటనే నేపథ్యంలో సినిమా సాగుతూ ఆకట్టుకుంటుంది.
ముఖ్యంగా ఇంటర్వెల్ బ్యాంగ్‌తో పాటు, ఒకదాని తర్వాత ఒకటి వచ్చే యాక్షన్ సన్నివేశాలు చూసే వాళ్లకు మంచి ఐ పీస్ట్ లాగా ఉంటుంది. అయితే ఈ సినిమా చూస్తున్నంత సేపు సూపర్, బాగుంది కదా అని అనిపిస్తూనే అయిపోయాక ఇదేం సినిమారా బై అనుకోవడమైతే పక్కా.
ముఖ్యంగా ఈ సినిమాలో హీరోల కన్నా విలన్‌ను ఓ రేంజ్‌లో చూయించడంతో పాటు ఆయన క్యారెక్టర్‌కు భారీ ఎలివేషన్స్ ఇస్తూ డిఫరెంట్‌గా ప్రజెంట్ చేయడం విశేషం. సల్మాన్ ఖాన్‌తో టైగర్ జిందా హై, సుల్తాన్, భారత్ వంటి చిత్రాలను డైరెక్ట్ చేసిన అలీ అబ్బాస్ జాఫర్ (Ali Abbas Zafar) ఈ మూవీకి దర్శకత్వం వహించారు.
ఈ సినిమా థియేటర్లలో విడుదలైన 55 రోజులు తర్వాత తాజాగా ఓటీటీలోకి వచ్చేసింది. ప్రస్తుతం ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్ (Netflix)లో హిందీతో పాటు తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో ఫైటింగ్‌లు, ఛేజింగ్ సీన్ల విషయంలో మనం ఎలాంటి లాజిక్కులు, లెక్కలు వెతుక్కోకుండా అయితే ఈ సినిమాను ఒక్కసారి చూసి ఎంజాయ్ చేయవచ్చు. నో ప్రాబ్లమ్