Naveen Chandra: కుటుంబ సమేతంగా చూసే వెబ్ సిరీస్.. ‘స్నేక్స్ అండ్ ల్యాడర్స్’

ABN , Publish Date - Oct 18 , 2024 | 05:07 PM

నవీన్ చంద్ర, నందా కీలక పాత్రల్లో న‌టించిన కొత్త వెబ్ సిరీస్ ‘స్నేక్స్ అండ్ ల్యాడర్స్’. ఈ రోజు (అక్టోబర్ 18) నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ క్రమంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో.. న‌వీన్ చంద్ర‌, నంద ఈ సిరీస్‌ గురించి మాట్గాడుతూ..

naveen

స్టోన్ బెంచ్ (stonebenchers), అమెజాన్ ప్రైమ్ ( PrimeVideo) సంయుక్తంగా నిర్మించిన వెబ్ సిరీస్ ‘స్నేక్స్ అండ్ ల్యాడర్స్’ (Snakes and Ladders) కు అశోక్ వీరప్పన్, భరత్ మురళీధరన్, కమల ఆల్కెమిస్ ముగ్గురు దర్శకత్వం వహించారు. ఈ వెబ్ సిరీస్‌ను కార్తీక్ సుబ్బరాజు, కల్యాణ్ సుబ్రమణియన్ నిర్మించారు. ఈ సిరీస్‌లో నవీన్ చంద్ర (Naveen Chandra), నందా (Nandaa), మనోజ్ భారతిరాజా, ముత్తుకుమార్, స్రింద, శ్రీజిత్ రవి, సమ్రిత్, సూర్య రాఘవేశ్వర్, సూర్యకుమార్, తరుణ్, సాషా భరేన్ కీలక పాత్రలు పోషించారు. అక్టోబర్ 18 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ క్రమంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో..

WhatsApp Image 2024-10-18 at 4.36.33 PM.jpeg

నవీన్ చంద్ర (Naveen Chandra) మాట్లాడుతూ.. ‘ఇప్పటి వరకు నేను చేసిన సినిమాలు, వెబ్ సిరీస్‌లను ఆడియెన్స్, మీడియా ఆదరిస్తూనే ఉన్నారు. ఇప్పుడు స్నేక్స్ అండ్ ల్యాడర్స్ అంటూ వచ్చాను. ఓ నలుగురు టీనేజ్ పిల్లలు, వారి జీవితంలో వచ్చిన ఓ అనూహ్య ఘటన, దాని నుంచి బయటకు రావడం అనేది ఈ కథ అని అన్నారు. కార్తిక్ సుబ్బరాజ్ టీం నుంచి ఈ కథ వచ్చిందని, అమెజాన్ ప్రైమ్‌తో ఇది నా మూడో ప్రాజెక్ట్ అని అన్నారు.నాకు ఇంత మంచి ఆఫర్లు ఇస్తున్న అమెజాన్ టీంకు థాంక్స్.

GZu5gF0agAAVx0O.jpeg

ఇందులో కనిపించే నలుగురు పిల్లలు కొత్త వాళ్లు. వారంతా కూడా అద్భుతంగా నటించారన్నారు. ముగ్గురు దర్శకులు ఈ సిరీస్‌ను అద్భుతంగా మలిచారని, మూడు షిఫ్టుల్లో పని చేశారన్నారు. అక్టోబర్ 18 నుంచి ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. ఆల్రెడీ బాగుందనే మెసెజ్‌లు వస్తున్నాయి. ఆరు భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. అందరూ చూడండి. అందరికీ నచ్చుతుంది. ఆడియెన్స్ సపోర్ట్‌తోనే ఇంత వరకు వచ్చాను. ఫ్యామిలీతో సహా ఈ వీకెండ్‌ను ఎంజాయ్ చేసేలా ఉంటుంది’ అని అన్నారు.


రైటర్ అండ్ డైరెక్టర్ కమల మాట్లాడుతూ.. ‘నవీన్ చంద్ర వంటి అద్భుతమైన నటుడితో పని చేయడం ఆనందంగా ఉంది. పిల్లలు బాగా నటించారు. ఈ సిరీస్‌ను ముగ్గురం కలిసి తెరకెక్కించాం. అశోక్, భరత్‌లతో కలిసి పని చేయడం ఆనందంగా ఉంది. మా సిరీస్ అమెజాన్ ప్రైమ్‌లోకి వచ్చింది. అందరూ చూడండి’ అని అన్నారు. నటుడు నంద మాట్లాడుతూ.. ‘స్టోన్ బెంచ్, అమెజాన్‌లతో కలిసి పని చేయడం ఆనందంగా ఉంది. ఇది యూనివర్సల్ కంటెంట్. ఇది క్రైమ్ థ్రిల్లర్ అయినా డార్క్ హ్యూమర్ ఉంటుంది. ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా ఉంటుంది. కమర్షియల్ అంశాలన్నీ కూడా ఉంటాయి. 9 ఎపిసోడ్స్ థ్రిల్లింగ్‌గా ఉంటాయి. అందరూ మా సిరీస్‌ను చూడండి’ అని అన్నారు.

Updated Date - Oct 18 , 2024 | 05:08 PM