Swathi Muthyam: శివయ్య ‘స్వాతిముత్యం’గా మారి 38 సంవత్సరాలు
ABN , Publish Date - Mar 13 , 2024 | 11:13 AM
యూనివర్సల్ హీరో కమల్ హాసన్ (Kamal Haasan), రాధిక (Radhika) జంటగా నటించిన దృశ్యకావ్యం ‘స్వాతిముత్యం’కు ఈ మార్చి 13తో 38 వసంతాలు. వెండితెరపై ఎన్నో జనరంజక చిత్రాలను రూపొందించిన దివంగత దర్శకుడు, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత కె. విశ్వనాథ్ (K Viswanath) ఈ చిత్రానికి దర్శకుడు.
యూనివర్సల్ హీరో కమల్ హాసన్ (Kamal Haasan), రాధిక (Radhika) జంటగా నటించిన దృశ్యకావ్యం ‘స్వాతిముత్యం’కు ఈ మార్చి 13తో 38 వసంతాలు. వెండితెరపై ఎన్నో జనరంజక చిత్రాలను రూపొందించిన దివంగత దర్శకుడు, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత కె. విశ్వనాథ్ (K Viswanath) ఈ చిత్రానికి దర్శకుడు. సినిమా నిర్మాణం పట్ల ఎంతో ప్యాషన్ ఉన్న నిర్మాత ఏడిద నాగేశ్వరరావు ఈ చిత్రాన్ని తన పూర్ణోదయ పతాకంపై ఈ సినిమాను నిర్మించారు. అప్పట్లో ఈ సినిమా ఒక ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది.
ఈ సినిమా కథ విషయానికి వస్తే.. శివయ్య (కమల్ హాసన్) బొత్తిగా లోకజ్ఞానం తెలియని అమాయకుడు. వయసు పెరిగినా, మనసు ఎదగని వెర్రిబాగులవాడు. ఒక ఉన్నత కుటుంబానికి చెందిన అబ్బాయిని ప్రేమించి, పెళ్ళి చేసుకుని, ఓ బిడ్డ (మాస్టర్ కార్తీక్)కు జన్మనిచ్చిన లలిత (రాధిక) జీవితంలో అనుకోని సంఘటన చోటుచేసుకుంటుంది. తన భర్త చనిపోవడంతో అన్నావదినలే దిక్కవుతారు. విధవరాలైన లలిత మెడలో.. గుళ్ళో సీతారామ కల్యాణ జరుగుతున్న వేళ.. తన తెలియనితనంలోనే తాళికట్టేస్తాడు శివయ్య. ఆ తర్వాత ఆ వెర్రిబాగులవాడిని లలిత ఎలా ప్రయోజకుడిని చేసింది. వారి జీవితంలో ఎలాంటి పరిణామాలు ఎదురయ్యాయి అనేదే ‘స్వాతిముత్యం’ కథ. వాస్తవానికి ఇదేం పెద్ద కమర్షియల్ కథ కాదు. కానీ కె. విశ్వనాథ్ చేతుల్లో ఈ సినిమా ఒక దృశ్యకావ్యంగా చెక్కబడింది. ఇప్పటికీ ఇందులోని పాటలు అక్కడక్కడ మారుమోగుతూనే ఉంటాయి. అన్ని రకాల ఎమోషన్స్‌తో కె. విశ్వనాథ్ ఈ సినిమాను తెరకెక్కించి, తెలుగు సినిమా స్థాయిని పెంచారు. (Swathi Muthyam Completes 38 Years)
ఇళయరాజా సంగీతం, రీరికార్డింగ్ ఈ చిత్రానికి మరో ప్రాణం. ‘చిన్నారి పొన్నారి కిట్టయ్య’, ‘సువ్వీ సువ్వీ సువ్వాలమ్మా’, ‘రామా కనవేమిరా’, ‘ధర్మం శరణం గచ్ఛామి’, ‘మనసు పలికే మౌన గీతం’ పాటలు ఆల్‌టైమ్ హిట్స్‌గా నిలిచాయి. ఈ సినిమా ఎన్నో అవార్డులను, రివార్డులను సొంతం చేసుకుంది. తెలుగులో ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా కేంద్ర ప్రభుత్వ రజత కమలం, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉత్తమ చిత్రంగా బంగారు నంది అవార్డులతో పాటు ఉత్తమ దర్శకుడిగా విశ్వనాథ్‌కు, ఉత్తమ నటుడిగా కమల్ హాసన్‌కు అవార్డులను తెచ్చిపెట్టింది.
ఇవి కూడా చదవండి:
====================
*Mahesh Babu: చాలా రోజుల తర్వాత హాయిగా నవ్వాను
***************************
*Manchu Manoj: కవల పిల్లలపై క్లారిటీ ఇచ్చిన మంచు మనోజ్.. ట్విస్ట్ ఏమిటంటే?
**************************
*Trisha: చిరు ఇచ్చిన గిఫ్ట్‌తో మురిసిపోతోన్న త్రిష.. ఇంతకీ చిరు ఏమిచ్చారంటే..
**************************