Siva@35: నాగ్‌ చైన్‌ పట్టిన రోజు.. 

ABN , Publish Date - Oct 05 , 2024 | 06:03 PM

తెలుగు సినిమా చరిత్రలో 'శివ’ చిత్రం ఓ సంచలనం. అక్టోబర్‌ 5, 1989లో విడుదలైన ఈ చిత్రం 35 వసంతాలు పూర్తి చేసుకుంది.


తెలుగు సినిమా చరిత్రలో 'శివ’ (Siva Movie) చిత్రం ఓ సంచలనం. అక్టోబర్‌ 5, 1989లో విడుదలైన ఈ చిత్రం 35 వసంతాలు పూర్తి చేసుకుంది. ట్రెండ్‌ గురించి టాపిక్‌ వచ్చిన ప్రతిసారీ  శివ చిత్రానికి ముందు శివ చిత్రం తర్వాత అన్నట్టుగా  చెబుతుంటారు. సినీ రహదారికి టర్నింగ్‌ మైల్‌ స్టోన్‌గా నిలిచి న్యూ ట్రెండ్‌ సెట్‌ చేసింది ఈ చిత్రం. అక్కినేని నాగార్జున (Nagarjuna) టైటిల్‌ రోల్‌ పోషించిన ఈ చిత్రానికి రామ్‌గోపాల్‌ వర్మ (Ram gopal Varma) దర్శకత్వం వహించారు.

Shiva.jpeg

దర్శకుడిగా మొదటి చిత్రంతోనే సెన్సేషన్‌ క్రియేట్‌ చేశారు వర్మ. అక్కినేని నాగార్జున, అక్కినేని వెంకట్‌, యార్లగడ్డ సురేంద్ర అన్నపూర్ణ స్టూడియోస్‌, ఎస్‌ ఎస్‌ క్రియేషన్స్‌ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. అమల కథానాయికగా, రఘువరన్‌ ప్రధాన విలన్‌గా నటించారు. తనికెళ్ళ భరణి నటించి, డైలాగ్స్‌ కూడా అందించారు. ఇళయరాజా సంగీతం అందించారు. మాఫియా నేపథ్యంలో కాలేజీ కుర్రాళ్ళ మధ్య జరిగే రాజకీయాలపై చిత్రీకరించబడ్డ సినిమా ఇది.  

Shiva 2.jpeg

తమిళంలో ఉదయంగా అనువదించబడగా, హిందీలో అక్కినేని నాగార్జున హీరోగా శివ టైటిల్‌తో 1990లో పునర్నిర్మించారు. 35వ వార్షికోత్సవం జరుపుకుంటున్న సందర్భంలో ఈ సినిమాకు పని చేసిన నటీనటులకు టెక్నీషియన్స్‌ కు శుభాకాంక్షలు తెలిపార్‌ ఆర్‌జీవీ. 

Updated Date - Oct 05 , 2024 | 06:03 PM