Super Star Krishna: ప్రభాకర్ రెడ్డి తో వున్నది కృష్ణ తమ్ముడు మోహన కృష్ణ, అతనెవరో తెలుసా?
ABN , Publish Date - Jun 01 , 2024 | 04:02 PM
క్రింది ఫోటోలో ప్రభాకర్ రెడ్డి తో పాటు వున్న నటుడు పేరు మోహన కృష్ణ, సూపర్ స్టార్ కృష్ణ సోదరుడు అని అప్పట్లో ప్రతి పత్రికలో వేశారు. కృష్ణ సోదరులు హనుమంత రావు, ఆదిశేషగిరి రావులు కదా, మరి ఈ మోహన కృష్ణ ఎవరు? తెలుసుకోవాలంటే చదవండి
తెలుగు సినిమా చరిత్రలో డాషింగ్, డేరింగ్ నటుడు ఎవరైనా వున్నారు అంటే అది ఒక్క కృష్ణ అని మాత్రమే చెప్పాలి. 1965లో వచ్చిన 'తేనే మనసులు' సినిమాతో పరిశ్రమలోకి కథానాయకుడిగా అరంగేట్రం చేసి, సుమారు 350కి పైగా సినిమాల్లో కథానాయకుడిగా నటించి చరిత్ర సృష్టించిన నటుడు కృష్ణ. ఒక్క తెలుగులోనే కాదు, తన పద్మాలయ సంస్థ నుండి హిందీలో కూడా ఎన్నో విజయవంతమైన చిత్రాలు నిర్మించారు కృష్ణ. శ్రీదేవిని హిందీకి పరిచయం చేసింది కృష్ణ. తెలుగులో తను నటించిన, విజయవంతమైన 'ఊరుకిమొనగాడు' సినిమాని హిందీలో 'హిమ్మత్ వాలా' అనే రీమేక్ సినిమా ద్వారా శ్రీదేవిని హిందీ చిత్ర రంగానికి పరిచయం చేసింది కృష్ణ. ఆమె తరువాత అక్కడ అగ్రశ్రేణి నటిగా ఎన్నో ఏళ్ళు చలామణి అయిన సంగతి తెలిసిందే.
అయితే పై ఫోటోలో ప్రభాకర్ రెడ్డి తో పాటు 'అగ్ని పరీక్ష' అనే సినిమాలో నటించింది మోహన కృష్ణ, కృష్ణ సోదరుడు అని అప్పట్లో చాలా పత్రికల్లో వచ్చింది. అయితే కృష్ణ గారికి సోదరులు హనుమంతరావు, ఆదిశేషగిరి రావు కదా మరి ఈ మోహన కృష్ణ ఎవరు అని అందరికీ సందేహం వచ్చే ఉంటుంది కదా. (Mohana Krishna is the screen name of Krishna's brother Hanumantha Rao)
ఇంతకీ ఈ మోహన కృష్ణ అంటే ఎవరో కాదు. అతను హనుమంతరావు గారే. అప్పట్లో హనుమంత రావు గారు ప్రభుత్వ ఉద్యోగి అందుకని అతని అసలు పేరు పెట్టకూడదు, అందుకని అతను మోహన కృష్ణ అని స్క్రీన్ నేమ్ పెట్టుకున్నారు. హనుమంతరావు కేవలం రెండు సినిమాల్లో మాత్రమే నటించారు. ఒకటి 'అగ్ని పరీక్ష' అయితే రెండోది 'మోసగాళ్లకు మోసగాడు'. తరువాత అతను ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి సినిమాలపై దృష్టి పెట్టారు. (Hanumantha Rao acted only in two films and later settled as Producer) అతని పేరు మొదటిసారిగా వేసింది 'పండంటి కాపురం' సినిమాకి. "నిర్మాతగా మొదటిసారి హనుమంతరావు పేరు వచ్చింది 'పండంటి కాపురం' సినిమా నుంచి', అని చెప్పారు ఆదిశేషగిరి రావు. కేవలం రెండు సినిమాల్లో మాత్రమే నటించారు అని కూడా చెప్పారు. అదీ సంగతి, మోహన కృష్ణ అంటే హనుమంతరావు.