Vijayawada Floods: బాలయ్యతో కలిసి సీఎం రిలీఫ్ ఫండ్‌కు చెక్కులిచ్చేందుకు వచ్చిన యంగ్ హీరోలు

ABN , Publish Date - Sep 12 , 2024 | 02:04 PM

వరద బాధితుల సహాయార్దం తాము ప్రకటించిన విరాళాన్ని సీఎం రిలీఫ్ ఫండ్‌కు అందజేసేందుకు హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు బాలకృష్ణ‌తో కలిసి యంగ్ హీరోలు సిద్దు జొన్నలగడ్డ, మాస్ కా దాస్ విశ్వక్సేన్ హైదరాబాద్ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. వారు నేరుగా సీఎంని కలిసి వారు ప్రకటించిన విరాళాలను అందజేయనున్నారు.

Balayya at Gannavaram Airport

వరద బాధితుల సహాయార్దం తాము ప్రకటించిన విరాళాన్ని సీఎం రిలీఫ్ ఫండ్‌కు అందజేసేందుకు హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు బాలకృష్ణ‌ (Nandamuri Balakrishna)తో కలిసి యంగ్ హీరోలు సిద్దు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda), మాస్ కా దాస్ విశ్వక్సేన్ (Vishwak Sen) హైదరాబాద్ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. వారు నేరుగా సీఎం చంద్రబాబు నాయుడుని కలిసి వారు ప్రకటించిన విరాళాలను (CM Relief Fund) అందజేయనున్నారు. కష్టకాలంలో ప్రభుత్వానికి అండగా నిలబడిన ప్రతి ఒక్కరికీ ఈ సందర్భంగా బాలయ్య ధన్యవాదాలు తెలిపారు.

Also Read- Devara: డబ్బులిచ్చి ‘జై’ కొట్టించుకున్నారా..


Balakrishna.jpg

నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ.. ‘‘కనివిని ఎరుగని వర్షం ప్రభావంతో వచ్చిన వరదల కారణంగా చాలా ఊర్లు జలమయం అయ్యాయి. ప్రాంతాలు వేరైనప్పటికీ మనందరిదీ తెలుగు భాష. ఒక ప్రాంతానికి ఆపద వస్తే మరో ప్రాంతం నుంచి సాయం చేసే విధంగా ఒక కుటుంబంలాగా అంతా పనిచేశారు. అందరినీ ప్రభావితం చేసి వాళ్ళని ఆదుకునే విధంగా అప్పట్లో జోలు పట్టి ఎన్టీఆర్ ప్రాంతాలన్నీ తిరిగేవాళ్లు. వరద ముప్పుకు అందరూ స్పందించారు. షూటింగ్‌లో బిజీగా ఉన్నా సరే రాష్ట్రం కోసం తమ వంతు సాయం చేశారు. సీఎం రిలీఫ్ ఫండ్‌కి చెక్కులు ఇవ్వడానికి విజయవాడ వచ్చాం. సీఎం రిలీఫ్ ఫండ్ అనౌన్స్ చేసి చాలా రోజులు అవుతుంది. కొంతమంది పేర్లు ఎత్తడం కూడా నాకు ఇష్టం లేదు. ఈ వరదని ప్రభుత్వం సృష్టించింది అని కొందరు వ్యక్తులు ఆరోపణ చేస్తున్నారు. వరద బాధితుల కోసం సాయం చేసిన వాళ్లందరికీ నా ధన్యవాదములు. విపత్తుల సమయంలో కేంద్ర ప్రభుత్వం బాగా స్పందించింది..’’ అని చెప్పుకొచ్చారు.

కాగా నందమూరి బాలకృష్ణ ఏపీకి రూ. 50 లక్షలు, తెలంగాణకు రూ. 50 లక్షలు విరాళం ప్రకటించగా.. సిద్ధు జొన్నలగడ్డ ఏపీకి రూ. 15 లక్షలు, తెలంగాణకు రూ. 15 లక్షలు.. విశ్వక్‌ సేన్‌ ఏపీకి రూ. 5 లక్షలు, తెలంగాణకు రూ. 5 లక్షలను విరాళంగా ప్రకటించారు.

Also Read- Bangalore Rave Party: బెంగుళూరు రేవ్ పార్టీ కేస్‌లో కీలక పరిణామం.. హేమకు షాక్

Also Read-Malaika Arora Father: ఆత్మహత్య చేసుకున్న మలైకా తండ్రి అనిల్ అరోరా..

Read Latest Cinema News

Updated Date - Sep 12 , 2024 | 02:50 PM