కొర్రపాటి, పురాణపండ కృషి అమోఘం, అద్భుతం అని ఎవరన్నారంటే?

ABN , Publish Date - Jul 16 , 2024 | 12:01 AM

ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ అద్భుత గ్రంధాలను తమ సంస్థ నిర్వహించిన తెలుగు భాషా శిక్షణా తరగతుల విద్యార్థులకోసం అందజేసిన వారాహి చలన చిత్రం అధినేత సాయి కొర్రపాటికి, రచయిత పురాణపండ శ్రీనివాస్‌కి ప్రపంచ తెలుగు సమాఖ్య అధ్యక్ష కార్యదర్సులు శ్రీమతి డాక్టర్ వి.ఎల్. ఇందిరాదత్, శ్రీమతి కె. శ్రీలక్ష్మి మోహనరావులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఒక్కొక్క అక్షరంలో ఒక్కొక్క మహాస్వరూపం సాక్షాత్కరించేలా దర్శనమిస్తున్న నాలుగు అమోఘ గ్రంధాలను అపూర్వరీతిలో రచించి సంకలనం చేసిన ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ అద్భుత గ్రంధాలను తమ సంస్థ నిర్వహించిన తెలుగు భాషా శిక్షణా తరగతుల విద్యార్థులకోసం ఎన్నో గ్రంధాలను అందజేసిన వారాహి చలన చిత్రం అధినేత సాయి కొర్రపాటికి, ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్‌కి ప్రపంచ తెలుగు సమాఖ్య అధ్యక్ష కార్యదర్సులు శ్రీమతి డాక్టర్ వి.ఎల్. ఇందిరాదత్, శ్రీమతి కె. శ్రీలక్ష్మి మోహనరావులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Srimalika.jpg

చెన్నై త్యాగరాయ నగర్ డబ్ల్యూ టీ ఎఫ్ కార్యాలయంలో జరిగిన తెలుగు భాషా శిక్షణా తరగతుల కార్యక్రమంలో ‘ఉగ్రం .. వీరం’, ‘శ్రీమాలిక’, ‘స్మరామి ... స్మరామి’, ‘శంకర ... శంకర’.. నాలుగు ధార్మిక గ్రంధాలను చెన్నై తెలుగు సాంస్కృతిక, సాహిత్య, ఆధ్యాత్మిక ప్రపంచంకోసం లాంఛనప్రాయంగా శ్రీమతి ఇందిరాదత్ ఆవిష్కరించి తొలిప్రతిని డబ్ల్యూ టీ ఎఫ్ కోఆర్డినేటర్ డాక్టర్ ఏ.వి. శివకుమారికి అందజేశారు.

Sankara-Sankara.jpg

ఈ సందర్భంగా శ్రీమతి ఇందిరాదత్ మాట్లాడుతూ.. కష్ట కాలాలను తరిమి ఉరిమే ఎన్నో దివ్య ప్రభల మంత్రశక్తులు ఈ మంగళ గ్రంధాల నిండా ఉన్నాయని పేర్కొంటూ ఒక్కొక్క గ్రంధాన్ని ఒక్కొక్క తేజస్సులా రూపుదిద్దిన పురాణపండ శ్రీనివాస్ అద్వితీయ ప్రతిభను ప్రశంసించారు.

Smaraami-Smaraami.jpg

ప్రపంచ తెలుగు మహాసమాఖ్య త్వరలో నిర్వహించే అపురూప కార్యక్రమాలకు మరిన్ని ఉత్తమ గ్రంధాలను అందిస్తామని వారాహి చలన చిత్రం అధినేత సాయి కొర్రపాటి చెప్పారు.

Lalitha-Vishnu-KSR.jpg

sai-korrapati.jpg

Updated Date - Jul 16 , 2024 | 09:45 AM