Buchi Babu Sana: ద‌ర్శ‌కుడు బుచ్చిబాబు ఇంట తీవ్ర విషాదం

ABN , Publish Date - Jun 01 , 2024 | 08:32 AM

ద‌ర్శ‌కుడు బుచ్చిబాబు ఇంట తీవ్ర విషాదం నెల‌కొంది. ఆయ‌న తండ్రి వెంక‌ట‌రావు (60) శుక్ర‌వారం క‌న్నుముశారు.

Buchi Babu Sana: ద‌ర్శ‌కుడు బుచ్చిబాబు ఇంట తీవ్ర విషాదం
Buchi Babu Sana

ద‌ర్శ‌కుడు బుచ్చిబాబు (Buchi Babu Sana) ఇంట తీవ్ర విషాదం నెల‌కొంది. ఆయ‌న తండ్రి వెంక‌ట‌రావు (60) శుక్ర‌వారం క‌న్నుముశారు. గ‌త కొంత‌కాలంగా అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధ ప‌డుతుండ‌గా బుచ్చిబాబు రెండు మూడు రోజులుగా అక్క‌డే ఉంటున్నారు. విష‌యం తెలుసుకున్న ద‌ర్శ‌కుడు సుకుమార్ (Sukumar) బుచ్చిబాబు (Buchi Babu Sana) స్వ‌గ్రామానికి వెళ్లి ప‌రామ‌ర్శించి అంత్య‌క్రియ‌లు పూర్త‌య్యేంత వ‌ర‌కు అక్క‌డే ఉన్నారు.


కాకినాడ జిల్లా యు.కొత్త‌ప‌ల్లి గ్రామానికి చెందిన బుచ్చిబాబు (Buchi Babu Sana) సుకుమార్ శిశ్యుడిగా ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చిన విష‌యం అంద‌రికీ తెలిసిందే. ఉప్పెన సినిమాతో మంచి విజ‌యం సాధించి ఆగ్ర ద‌ర్శ‌కుల జాబితాలో చేరిన ఆయ‌న ప్ర‌స్తుతం రామ్‌చ‌ర‌ణ్‌, జాన్వీ క‌పూర్, రెహ‌మాన్‌ల క‌ల‌యిక‌లో ఓ భారీ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు.

Updated Date - Jun 01 , 2024 | 08:32 AM