Allu Arjun Jail Life: కొత్త రగ్గు, దుప్పటి.. రాత్రంతా నేలమీదే

ABN , Publish Date - Dec 14 , 2024 | 11:13 AM

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ అనంతరం బెయిల్ విషయంలో నాటకీయత చోటు చేసుకుంది. మధ్యంతర బెయిల్ ఇస్తూ హైకోర్టు వెంటనే విడుదల చేయాలని కోరినా.. బెయిల్‌ పత్రాలు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ కావడం లేటవడంతో.. శుక్రవారం రాత్రంగా బన్నీ జైలులోనే ఉండాల్సి వచ్చింది. అల్లు అర్జున్ లైఫ్‌లో జరిగిన ఈ ఒక్క రాత్రి జైలు జీవితం ఎలా గడించిందంటే..

Allu Arjun

ఐకాన్ స్టార్ అల్లు అర్జుణ్ సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో శుక్రవారం అరెస్టై, శనివారం ఉదయం మధ్యంతర బెయిల్‌తో విడుదలయ్యారు. అల్లు అర్జున్‌ను నాంపల్లి 9వ చీఫ్‌ మెట్రో పాలిటన్‌ మేజిస్ట్రేట్‌ ఆదేశం మేరకు 14 రోజుల పాటు జ్యుడీషియల్‌ రిమాండ్‌లో ఉంచేందుకు చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఈలోగా హైకోర్టు ఆయనకు నాలుగు వారాల పాటు మధ్యంతర బెయిలు మంజూరు చేసింది. కాపీ అందిన వెంటనే విడుదల చేయాలని కూడా ఆదేశించారు. దాంతో అల్లు అర్జున్‌ విడుదల ఖాయమని అంతా భావించారు. జైలుకు వెళ్లిన అల్లు అర్జున్‌ బెయిల్‌ పత్రాల కోసం రిసెప్షన్‌లో వేచి ఉన్నారు. అయితే, రాత్రి పదిన్నర గంటల వరకు హైకోర్టు బెయిల్‌ పత్రాలు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ కాకపోవడం, ఇతర కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఆలస్యం జరగడంతో శుక్రవారం రాత్రంతా అల్లు అర్జున్‌ జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. దాంతో జైలు అధికారులు ఆయన్ను అండర్‌ ట్రైల్‌ ఖైదీగా(ఖైదీ నంబర్‌ 7697) మంజీరా బ్యారక్‌లో ఉంచారు.

Also Read- Allu Arjun: అల్లు అర్జున్ ఇంటికి క్యూ కడుతోన్న సినీ ప్రముఖులు



Allu-Arjun.jpg

అల్లు అర్జున్ ఒక్క రాత్రి జైలు జీవితం:

బెయిల్ పత్రాల ఆలస్యంతో అల్లు అర్జున్ మొహంలో అసహనం పెరిగిపోయింది. ఖైదీలందర్నీ బ్యారక్‌లలోకి పంపినట్లుగా ధ్రువీకరించుకున్నాకే చివరగా అల్లు అర్జున్‌ను బ్యారక్‌కు తరలించారు. తనను ముగ్గురు ఖైదీలు ఉండే బ్యారక్‌లో ఉంచారు. అందులో ఆయనతో మరో ఇద్దరు విచారణలో ఉన్న ఖైదీలు ఉన్నారు. రిసెప్షన్‌ నుంచి అల్లు అర్జున్‌ను బ్యారక్‌కు తరలిస్తున్నపుడు ఇతర బ్యారక్‌లలో ఉన్న ఖైదీలు పుష్ప... పుష్ప... అంటూ అరుస్తూ ఉన్నారు. జైల్లో అర్జున్‌కు భోజనం ఆఫర్‌ చేసినా తినలేదు. 14 రోజుల రిమాండ్‌ విధించినపుడు న్యాయాధికారి ఆయనను ప్రత్యేక ఖైదీగా పరిగణించాలని ఆదేశించారు. అయితే, ఆ సౌకర్యాలు జైల్లోకి వచ్చిన మర్నాడు మాత్రమే అందుతాయి. తొలిరోజు రాత్రి అర్జున్‌ సాధారణ ఖైదీల లాగే నేల మీద పడుకోవాలి. ఆయనకు కొత్త రగ్గు, కొత్త దుప్పటి ఇచ్చారు. వాటిని నేల మీద పరుచుకొని పడుకోవాల్సి ఉంటుంది. పదిన్నర తర్వాత తక్షణమే విడుదల చేయాలని బెయిలు ఉత్తర్వులు అందినప్పటికీ అధికారులు నిబంధనల ప్రకారం ఉదయమే విడుదల చేయాలని నిర్ణయించారు. బెయిలు కార్యక్రమం రాత్రే ముగిసిపోయినందున శనివారం ఉదయం అల్లు అర్జున్‌ని విడుదల చేశారు.

Also Read-Allu Arjun Released: అల్లు అర్జున్ విడుదల.. వెంటనే ఇంటికి వెళ్లలేదు

Also Read-రేలంగి వివాహ ఆహ్వాన పత్రిక: 91 సంవత్సరాల క్రితపు శుభలేఖను చూశారా..

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Dec 14 , 2024 | 12:25 PM