అందుకే ఆ పెళ్లికి వెళ్లలేదు
ABN , Publish Date - Jul 16 , 2024 | 04:46 AM
అపర కుబేరుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ వివాహం రాధికతో జరిగిన సంగతి విదితమే. అంగరంగ వైభవంగా జరిగిన ఈ వివాహ వేడుకలకు...
అపర కుబేరుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ వివాహం రాధికతో జరిగిన సంగతి విదితమే. అంగరంగ వైభవంగా జరిగిన ఈ వివాహ వేడుకలకు భారతీయ చిత్ర పరిశ్రమలోని ప్రముఖులందరూ హాజరయ్యారు. ఆడారు, పాడారు. నూతన దంపతులకు ఆశీస్సులు అందజేశారు. అయితే ఈ పెళ్లికి వివిధ కారణాల వల్ల హాజరు కాని సినీ ప్రముఖులు కూడా ఉన్నారు. వారిలో హీరోయిన్ తాప్సీ ఒకరు. తను ఆ పెళ్లికి ఎందుకు వెళ్లలేదో ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆమె వెల్లడిస్తూ ఆసక్తికరమైన వాఖ్యలు కూడా చేసింది. ‘నాకు వాళ్లతో వ్యక్తిగత పరిచయం లేదు. నా ఉద్దేశంలో పెళ్లి అనేది అనుబంధాలతో కూడిన వేడుక. ఆతిధ్యం ఇచ్చే కుటుంబానికి, అతిథికి మధ్య ఏదో రకమైన అనుబంధం ఉండి తీరాలి. అటువంటి వివాహాలకే నేను హాజరవుతా.
తెలియని వారి ఇంట జరిగే పెళ్లికి వెళ్లి ఇబ్బంది పడలేను’ అని తాప్సీ చెప్పింది. ఏ విషయం గురించైనా నిర్మొహమాటంగా మాట్లాడడం మొదటినుంచీ తాప్సీకి అలవాటు. అందుకే అంబానీ ఇంట పెళ్లి గురించి కామెంట్ చేయడానికి ఆమె వెనుకాడలేదు.