Comedy Show: తెలుగులో తిరుగులేని టాప్ కామెడీ షో ఇదే..

ABN , Publish Date - Sep 27 , 2024 | 09:22 PM

వెండితెరపై హీరోలకు ఎలాంటి స్టార్ ఇమేజ్ ఉంటుందో తెలియంది కాదు. అయితే హీరోలతో పాటు ఎంటర్‌టైన్ చేయడంలో కమెడియన్స్ సైతం ప్రధాన పాత్ర పోషిస్తారనేది సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. అయితే వెండితెరకు ప్రస్తుత కాలంలో ఎందరో కమెడియన్స్‌ని అందించిన కామెడీ షో గా ఇప్పుడు తెలుగు బుల్లితెరకు చెందిన ఓ షో రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది. ఆ షో ఏదంటే..

Jabardasth Comedians

తెలుగు బుల్లితెరపై సెన్సేషన్ క్రియేట్ చేసిన కామెడీ షో అనగానే గుర్తొచ్చే పేరు ‘జబర్దస్త్’. ప్ర‌తివారం ప్ర‌తిభావంతులైన కమెడియ‌న్స్‌తో న‌వ్వుల‌ను పంచుతూ ‘జబర్దస్త్’‌గా ప్రేక్ష‌కుల‌ను అలరిస్తూ వస్తోన్న షో ఇది. 2013లో ప్రారంభమైన ఈ షో నిర్విరామంగా ఇప్ప‌టి వ‌ర‌కు 600కు పైగా ఎపిసోడ్స్‌తో ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తూ త‌న‌దైన గుర్తింపును సంపాదించుకుంది. ఇన్నేళ్లు అయిన‌ప్ప‌టికీ ‘జబర్దస్త్’ తాజా కంటెంట్‌తో క్రియేటివ్‌గా మెప్పిస్తూ ఇంకా నెంబ‌ర్ వ‌న్ కామెడీ షోగా నవ్వుల పువ్వుల‌ను పూయిస్తుండటం విశేషం.

Also Read- Devara Review: ‘దేవర’ మూవీ రివ్యూ

‘జబర్దస్త్’లో పాల్గొన్న క‌మెడియ‌న్స్ హీరోలుగా, స‌క్సెస్‌ఫుల్ ద‌ర్శ‌కులుగానూ ఇప్పుడు రాణిస్తుండ‌టం విశేషం. సుడిగాలి సుధీర్‌, గెట‌ప్ శ్రీను, ష‌క‌ల‌క శంక‌ర్ వంటివారు ‘సాఫ్ట్ వేర్‌ సుధీర్‌, 3 మంకీస్‌, గాలోడు, రాజు యాద‌వ్‌, ధ‌ర్మ‌స్థ‌లి’ వంటి చిత్రాల్లో న‌టించిన సంగ‌తి తెలిసిందే. ‘బ‌లగం’ వంటి సెన్సేష‌నల్ బ్లాక్ బ‌స్ట‌ర్‌తో వేణు ఎల్దండి వంటి వారు త‌మ ప్ర‌తిభ‌ను నిరూపించుకున్నారు. ధ‌నాధ‌న్ ధ‌న‌రాజ్‌వంటివారు ‘రామం రాఘ‌వం’ చిత్రంతో ద‌ర్శ‌కుడిగా మారిన సంగ‌తి విదితమే. ఇలా ‘బ‌జ‌ర్ద‌స్త్’ ఎంట‌ర్‌టైన్‌మెంట్ రంగంలో త‌న మార్క్‌ను క్రియేట్ చేసి ప్ర‌భావాన్ని చూపుతోంది.

Also Read- Jr NTR: థ్యాంక్స్ శివ.. ఉద్వేగానికి గురైన తారక్


Rashmi.jpg

అలాగే ‘జబర్దస్త్’ (Jabardasth)తో గుర్తింపు తెచ్చుకున్న హైపర్ ఆది.. వెండితెరపై ఇప్పుడు టాప్ కమెడియన్‌గానూ దూసుకెళుతున్నాడు. ముఖ్యంగా హీరోల పక్కన ఫ్రెండ్ క్యారెక్టర్స్‌కి బెస్ట్ ఆప్షన్‌గా మారాడు. ఇంకా ఎందరో ఈ ప్రోగ్రామ్‌లోని కమెడియన్స్ వెండితెరపై సందడి చేస్తూనే ఉన్నారు. ఎంతోమంది టాలెంట్‌కి సరైన వేదికగా నిలిచిన జబర్ధస్త్‌కి ప్రత్యేక అభిమానులు ఉన్నారంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు. అందుకే ఈ షో.. తెలుగులో తిరుగులేని టాప్ కామెడీ షో‌గా రికార్డ్‌లను క్రియేట్ చేస్తోంది.

Jabardasth-Logo.jpg

Also Read- Jani Master Case: షాకింగ్ ట్విస్ట్.. విచారణలో జానీ మాస్టర్ ఏం చెప్పారంటే..

Also Read- Harsha Sai: అసలెవరీ హర్షసాయి.. మరో మెగాస్టార్ అంటూ బిల్డప్ ఇచ్చిన వారంతా ఏమయ్యారు

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Sep 27 , 2024 | 09:22 PM