Heroine: సినీ నటికి షాకిచ్చిన సైబర్ కేటుగాళ్లు.. ఇలా కూడా మోసపోతారా?
ABN , Publish Date - Dec 18 , 2024 | 08:09 AM
నగదు చెల్లింపుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని, సైబర్ మోసాలు పెరిగిపోయాయని, వాటి పట్ల అవగాహన పెంచుకోవాలని పోలీసులు ఎంతగా హెచ్చరిక చేసినా.. ఇంకా కొందరు సైబర్ కేటుగాళ్ల మాయలో పడుతూనే ఉన్నారు. దేశవ్యాప్తంగా సైబర్ నేరాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఇప్పుడో నటి సైబర్ కేటుగాళ్ల చేతుల్లో చిక్కుకుని వేల రూపాయలను పోగొట్టుకుంది. మ్యాటర్ ఏంటంటే..
అపరిచితుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్, మెసేజ్, మెయిల్స్‌కు స్పందించవద్దని పోలీసులు ఎంతగా చెప్పినా.. ఏదో ఒక చోట జనాలు సైబర్ కేటుగాళ్ల ఉచ్చులో పడుతూనే ఉన్నారు. ముఖ్యంగా నగదు చెల్లింపుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని, సైబర్ మోసాలు పెరిగిపోయాయని, వాటి పట్ల అవగాహన పెంచుకోవాలని ఎంతగా హెచ్చరిక చేసినా.. ఇంకా కొందరు సైబర్ కేటుగాళ్ల మాయలో పడుతూనే ఉన్నారు. దేశవ్యాప్తంగా సైబర్ నేరాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. కళ్లు మూసి తెరిచే లోపే బ్యాంకు ఖాతాల్లోని నగదును కేటుగాళ్లు ఇట్టే మాయం చేస్తున్నారు. లక్కీ డ్రాలు, బ్యాంక్ ఖాతా అప్డేట్, స్టాక్ మార్కెట్ పెట్టుబడులు, మీ పేరు మీద పార్శిల్ వచ్చిందంటూ అనేక రకాలుగా అమాయకులను బురిడీ కొట్టిస్తున్నారు. వారి చేతుల్లో మోసపోయి వేలు, లక్షలే కాదు ఒక్కోసారి కోట్ల రూపాయలు సైతం ప్రజలు పోగొట్టుకుంటున్నారు. అయితే ఇందులో సామాన్య ప్రజలే కాదు.. విద్యావంతులు, రాజకీయ నాయకులు, నటీనటులు, ప్రముఖులు సైతం ఉండటం విశేషం.
తాజాగా ఓ సినీనటిని సైబర్ కేటుగాళ్లు బురిడీ కొట్టించారు. ఇలా కూడా మోసం చేయవచ్చా? అనేలా హైదరాబాద్ నగరంలో ఓ ఘటన చోటు చేసుకుంది. ఓ సినీనటి నుండి వేల రూపాయలను సైబర్ కేటుగాళ్లు స్వాహా చేశారు. అప్రమత్తమైన బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో ఈ మోసం వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ కుందన్‌బాగ్ ప్రాంతంలో సినీ నటి మహిమ నివాసం ఉంటోంది. ఈమె మంచు విష్ణు హీరోగా నటించిన ‘మోసగాళ్లు’ సినిమాలో సెకండ్ హీరోయిన్‌గా చేశారు. అయితే ఈనెల 6వ తేదీన రంజన్ షాహీ అనే వ్యక్తి నుంచి మహిమకు ఫోన్ వచ్చింది. తాను ఓ సినీ నిర్మాతనంటూ అతను పరిచయం చేసుకున్నాడు. అనంతరం కాసేపటి తర్వాత రంజన్ షాహీ పేరు చెప్తూ అనిత అనే మహిళ మహిమకు ఫోన్ చేసింది. తాను సినీ అండ్ టీవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(సింటా)లో హెచ్‌ఆర్ డైరెక్టర్‌నంటూ పరిచయం చేసుకుంది.
Also Read-Allu Arjun: అల్లు అర్జున్ బెయిల్ రద్దు? పోలీసుల షాకింగ్ డెసిషన్..
మీరు రూ.50,500లు చెల్లిస్తే సింటాలో జీవితకాలం మెంబర్‌రిష్‌ను అందిస్తున్నామని మహిమకు అనిత చెప్పింది. తన వృత్తికి సంబంధించిన విషయం కావడంతో.. వెంటనే ఆమె మాటలు నమ్మిన మహిమ మూడు దఫాలుగా నగదు చెల్లించింది. అయినప్పటికీ అనిత ఇంకా నగదు ఇవ్వాలంటూ మరోసారి ఫోన్ చేయడంతో.. అనుమానం వచ్చిన మహిమ, వెంటనే సైబర్ హెల్ప్‌లైన్ నంబర్ 1930కు ఫోన్ చేసి విషయం చెప్పింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు మహిమ ఖాతా నుంచి రూ.20,200 సైబర్ కేటుగాళ్ల చేతుల్లోకి వెళ్లకుండా చర్యలు తీసుకోగలిగారు. నటి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చూశారుగా.. ఎలా బురిడీ కొట్టించారో.. అందుకే అంతా అప్రమత్తంగా ఉండండి. ఇలాంటి కాల్స్‌కి నిర్ణయం తీసుకునే ముందు ఒకటికి పది సార్లు ఆలోచించండి. ఆ రంగంలో ఎవరైనా తెలిసిన వారు ఉంటే.. కాల్ చేసి కనుక్కోండి. అంతేకానీ, అప్పటికప్పుడే టెంప్ట్ అయి.. లాస్ అవకండి.. అని పోలీసులు సూచనలిస్తున్నారు.