‘స్వాగతమమ్మా కళామతల్లి’ షార్ట్ ఫిలిం.. దాసరికి అంకితం!

ABN , Publish Date - May 05 , 2024 | 06:38 PM

పలు భారీ బడ్జెట్ డబ్బింగ్ చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించడంతోపాటు, రియల్ స్టార్ శ్రీహరితో "శివకేశవ్" చిత్రాన్ని నిర్మించిన ప్రముఖ నిర్మాత సీతా రామ ఫిల్మ్స్ అధినేత బానూరు నాగరాజు (జడ్చర్ల) నటిస్తూ నిర్మించిన లఘు చిత్రం "స్వాగతమమ్మా కళామతల్లి.

‘స్వాగతమమ్మా కళామతల్లి’ షార్ట్ ఫిలిం.. దాసరికి అంకితం!
Swaagathamammaa Kalaamathalli

"శివకేశవ్" చిత్రాన్ని నిర్మించిన ప్రముఖ నిర్మాత సీతా రామ ఫిల్మ్స్ అధినేత బానూరు నాగరాజు (జడ్చర్ల) నటిస్తూ నిర్మించిన లఘు చిత్రం "స్వాగతమమ్మా కళామతల్లి (Swagatamamma Kalamatalli).

తాజాగా "వేయి శుభములు కలుగు నీకు" చిత్రంతో దర్శకుడిగా తన ప్రతిభను చాటుకున్న యువ దర్శకుడు రామ్ రాథోడ్ ఈ లఘు చిత్రానికి రచన, దర్శకత్వం వహించారు. అన్వర్ ఛాయాగ్రహణం అందించారు. దర్శక దిగ్గజం దర్శకరత్న డాక్టర్ దాసరి నారాయణరావు (DASARI NARAYANA RAO) స్పూర్తితో తెరకెక్కించిన ఈ షార్ట్ ఫిల్మ్ ను ఆయనకే అంకితమివ్వడం విశేషం.


WhatsApp Image 2024-05-05 at 6.22.23 PM.jpeg

ఇందుకుగాను ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిర్మాతల మండలి అధ్యక్షులు కె.ఎల్.దామోదర్ ప్రసాద్, ప్రధాన కార్యదర్శి టి.ప్రసన్న కుమార్, ప్రముఖ నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు, "మాతృదేవోభవ" దర్శకుడు అజయ్ కుమార్ పాల్గొని, దర్శకనిర్మాతలను అభినందించారు.

దాసరి (DASARI NARAYANA RAO) జయంతి సందర్భంగా "స్వాగతమమ్మా కళామతల్లి" లఘు చిత్రాన్ని విడుదల చేసి, దానిని దాసరికి అంకితమివ్వడం తమ అదృష్టంగా దర్శకనిర్మాతలు పేర్కొన్నారు. ఈ వేడుకలో లఘుచిత్ర ఛాయాగ్రాహకుడు అన్వర్, సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ ధీరజ అప్పాజీ పాల్గొన్నారు.

Updated Date - May 05 , 2024 | 06:38 PM