Jayakrishna: త్వరలోనే ఘట్టమనేని వారసుడి అరంగేట్రం.. మహేష్ కొడుకు కాదండోయ్..!

ABN , Publish Date - Jul 18 , 2024 | 05:49 PM

ఘట్టమనేని అభిమానుల కోరిక తీర్చే క్రమంలో మహేష్ కుమారుడు కాదు కానీ.. ఆయన అన్న, దివంగత నటుడు, నిర్మాత అయిన రమేష్ బాబు కుమారుడు జయకృష్ణ హీరోగా అతి త్వరలో ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఈ విషయం స్వయంగా ఆయనే చెప్పారు. గురువారం జయకృష్ణ పుట్టినరోజు. ఆ బర్త్‌డే వేడుకలను అభిమానులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జయకృష్ణ తన అరంగేట్రానికి సంబంధించి మాట్లాడారు.

Super Star Krishna Grandson Jaya Krishna Birthday Celebrations

ఈ మధ్య సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా వారసుల గురించే వార్తలు. నటసింహం బాలయ్య కుమారుడు మోక్షజ్ఞ (Mokshagna), సూపర్ స్టార్ మహేష్ బాబు కుమారుడు గౌతమ్ (Gautham), పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కుమారుడు అకీరా నందన్‌ (Akira Nandan)ల అరంగేట్రం గురించే అంతా చర్చలు నడుస్తున్నాయి. ఈ వారసుల ఎంట్రీ కోసం అభిమానులు ఎంతగానో వేచి చూస్తున్నట్లుగా సోషల్ మీడియాలో పోస్ట్‌లు చేస్తున్నారు. అయితే వీరిలో మోక్షజ్ఞ ఎంట్రీకి సంబంధించి ఇటీవలే కొన్ని వార్తలు వైరల్ అయ్యాయి. త్వరలోనే మోక్షు అరంగేట్రం ఉండే అవకాశం ఉంది. అకీరా నందన్ గురించి కూడా వార్తలు వైరల్ అవుతున్నాయి కానీ.. ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఇక గౌతమ్ కృష్ణ మాత్రం ఇప్పుడప్పుడే ముఖానికి రంగేసే ఛాన్స్ లేదు. అసలు ఉంటుందో కూడా చెప్పలేం. ఎందుకంటే, ప్రస్తుతం గౌతమ్ హయ్యర్ స్టడీస్ నిమిత్తం ఫారెన్‌ వెళ్లారు. ఆయనకు అసలు యాక్టింగ్‌పై ఇంట్రస్ట్ ఉందో లేదో కూడా తెలియదు. అయితేనేం.. ఘట్టమనేని అభిమానుల కోరిక తీర్చే క్రమంలో మహేష్ కుమారుడు కాదు కానీ.. ఆయన అన్న, దివంగత నటుడు, నిర్మాత అయిన రమేష్ బాబు (Ramesh Babu) కుమారుడు జయకృష్ణ హీరోగా అతి త్వరలో ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఈ విషయం స్వయంగా ఆయనే చెప్పారు.

Also Read- Pushpa 2: సహనానికి పరీక్షా? నిర్మాతల పాలిట శాపమా?   

గురువారం పద్మాలయ స్టూడియోలో సూపర్ స్టార్ కృష్ణ (Super Star Krishna) ముద్దుల మనవడు, తెలుగు సినిమా రంగానికి హీరోగా పరిచయం కాబోతున్న మహేష్ బాబు బ్రదర్ రమేష్ బాబు (Mahesh Babu Brother Ramesh Babu) కుమారుడు జయకృష్ణ (Jayakrishna) పుట్టినరోజు వేడుకలు అభిమానుల సమక్షంలో గ్రాండ్‌గా జరిగాయి. ఈ కార్యక్రమంలో జయకృష్ణతో పాటు వాళ్ల మదర్ మృదుల పాల్గొన్నారు. ఆల్ ఇండియా కృష్ణా మహేష్ ప్రజా సేన జాతీయ అధ్యక్షుడు ఖాదర్ గోరి ఏర్పాటు చేసిన ఈ వేడుకలలో జయకృష్ణ భారీ కేకును కట్ చేశారు. అనంతరం జయకృష్ణను భారీ గజమాలతో ఖాదర్ గోరి అండ్ టీమ్ సన్మానించారు. ఈ సందర్భంగా ఖాదర్ గోరి మాట్లాడుతూ.. అభిమానులందరూ మీ రాక కొరకు ఎదురుచూస్తున్నారు. అభిమానులందరి తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని అన్నారు.


Jayakrishna-Birthday.jpg

అనంతరం జయకృష్ణ మాట్లాడుతూ.. త్వరలోనే నా సినిమా మొదలవుతుంది. నాకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన తాతగారి అభిమానులు, నాన్నగారి అభిమానులు, బాబాయ్‌గారి అభిమానులు అందరికీ ధన్యవాదాలని అన్నారు. జయకృష్ణ మదర్ మృదుల మాట్లాడుతూ.. జయకృష్ణను హీరోగా పరిచయం చేసే క్రమంలో కొన్ని కథలు విన్నాము. అందరం విని ఒక స్టోరీని ఓకే చేసిన తర్వాత మంచి బ్యానర్‌లో, మంచి సినిమాతోనే ప్రేక్షకుల ముందుకు జయకృష్ణ వస్తాడు. మీ అందరి సపోర్ట్ ఇలాగే ఉంటుందని భావిస్తున్నానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కృష్ణా మహేష్ ప్రజాసేన జాతీయ అధ్యక్షులు ఖాదర్ గోరి, మహేష్ కృష్ణ సేన అధ్యక్షులు మల్లేష్ మరియు శ్రీధర్, నల్గొండ నరసింహ, SAC వినోద్, కిరణ్, ఎక్స్ రోడ్ నుండి హరీష్ వసంత్ తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రస్తుతం జయకృష్ణ బర్త్‌డే వేడుకకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Read Latest Cinema News

Updated Date - Jul 18 , 2024 | 05:49 PM