Sandhya Theatre Stampede: శ్రీ‌తేజ్‌ను పరామర్శించిన సుకుమార్.. ఏమన్నారంటే

ABN , Publish Date - Dec 19 , 2024 | 04:27 PM

సంధ్య ధియేట‌ర్ ద‌గ్గ‌ర జ‌రిగిన తొక్కిస‌లాట‌లో గాయ‌ప‌డి చికిత్స పొందుతున్న శ్రీ‌తేజ్‌ని గురువారం దర్శకుడు సుకుమార్ పరామర్శించారు. అనంతరం ఆయన ఏమన్నారంటే..

Director Sukumar

సంధ్య ధియేట‌ర్ ద‌గ్గ‌ర జ‌రిగిన తొక్కిస‌లాట‌లో గాయ‌ప‌డి చికిత్స పొందుతున్న శ్రీ‌తేజ్‌ని ‘పుష్ప 2’ చిత్ర దర్శకుడు సుకుమార్ గురువారం ప‌రామ‌ర్శించారు. భ‌విష్య‌త్తులో శ్రీ‌తేజ్‌కు ఎలాంటి అవ‌స‌రం వ‌చ్చినా తాను సపోర్ట్‌గా ఉంటానని భ‌రోసా ఇచ్చారు. ఇంతకు ముందు సుకుమార్ సతీమణి తబిత.. రెండు సార్లు శ్రీతేజ్ కుటుంబాన్ని కలిసి, ధైర్యం చెప్పినట్లుగా తెలుస్తోంది. అలాగే సుకుమార్ తన తరపున శ్రీతేజ్ కుటుంబానికి రూ. 5 లక్షలు అందించినట్లుగా సమాచారం. తెల్లవారితే పుష్ప-2 సినిమా విడుదలవుతుందనగా.. డిసెంబర్ 4వ తేదీ రాత్రి హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్‌లో ప్రీమియర్‌ షో వేయడం, ఆ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో దిల్‌సుఖ్ నగర్‌కు చెందిన రేవతి(35) మృతి చెందడం, ఆమె కుమారుడు శ్రీతేజ్‌ (13) అపస్మారక స్థితికి చేరుకొని చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే.

Also Read- Mohan Babu: మోహన్ బాబుకి షాకిచ్చిన హైకోర్టు


అపస్మారక స్థితిలో ఉన్న శ్రీతేజ్‌ని పరామర్శించడానికి బుధవారం అల్లు అరవింద్ పోలీసుల, ప్రభుత్వ అనుమతి తీసుకుని హాస్పిటల్‌కు వెళ్లిన విషయం తెలిసిందే. శ్రీతేజ్‌ని చూసిన అనంతరం అల్లు అరవింద్ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘హాస్పిటల్‌లో ఉన్న శ్రీతేజ్‌ను ఐసీయూలో చూశాను. డాక్టర్లందరితోనూ మాట్లాడాను. అబ్బాయి రోజు రోజుకి రికవరీ అవుతున్నాడని చెప్పారు. గత 14 రోజుల్లో.. లాస్ట్‌ 10 డేస్‌ల్లో రికవరీ బాగా కనిపిస్తుందని అన్నారు. కానీ, కోలుకోవడానికి చాలా సమయం పడుతుందని చెప్పారు. అయితే శ్రీతేజ్‌ కోలుకోవడానికి ఏం చేయడానికైనా మేము సిద్ధంగా ఉన్నాం. ప్రభుత్వం కూడా శ్రీతేజ్ ఆరోగ్యంపై దృష్టి పెట్టి.. అతడిని మాములు స్థితికి తీసుకురావాలని ఎంతో శ్రమిస్తోంది. అందుకు ప్రభుత్వానికి, పోలీసులకు నా కృతజ్ఞతలు..’’ అని తెలిపారు.


Sandhya-Theater.jpg

అందుకే అల్లు అర్జున్ హాస్పిటల్‌కు రాలేదు..

అందరూ అల్లు అర్జున్ ఎందుకు హాస్పిటల్‌కు రాలేదని అడుగుతున్నారు. వాస్తవానికి ఘటన జరిగిన మరుసటి రోజు ఉదయమే అర్జున్‌ హస్పిటల్‌కు వెళదామనుకున్నాడు. కానీ హాస్పిటల్ అధికారులు నిన్నే కదా ఈ సంఘటన జరిగింది. మీరు హాస్పిటల్‌కు వచ్చే కార్యక్రమం వాయిదా వేసుకోమని అన్నారు. మాకు కరెక్టే కదా అని అనిపించింది. అందుకే రాలేదు. ప్రస్తుతం ఈ ఘటనపై అర్జున్‌పై కేసు నడుస్తుంది. ఆ కేసులో లీగల్‌ టీమ్‌ హెడ్‌ నిరంజన్‌ రెడ్డి హాస్పిటల్‌కు వెళ్లకూడదు.. వారిని కలవకూడదు అని స్ట్రాంగ్‌గా చెప్పారు. దీంతో బన్నీ బాధపడుతూ.. నేను చూడలేకపోయాను.. మీరైనా వెళ్లండి.. అని చెబితే.. తెలంగాణ ప్రభుత్వం పర్మిషన్‌ తీసుకుని బాలుడిని పరామర్శించడానికి వచ్చానని తెలిపారు.. అల్లు అరవింద్.

Also Read-Malaika Arora: ‘ఇన్నర్ SRK’ని దింపిన మలైకా.. ఐకానిక్ రైలు సీన్‌తో రీల్

Also Read-Rewind 2024: ఈ ఏడాది అగ్ర హీరోల మెరుపులు ఏమాత్రం..

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Dec 19 , 2024 | 04:27 PM