Kaloji: ‘కాళోజీ’పై నాటకం.. టీమ్‌పై అభినందనల వర్షం

ABN , Publish Date - Sep 10 , 2024 | 03:48 PM

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం తెలంగాణ భాష దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. అందులో భాగంగా తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో ఉత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రదర్శించిన ‘బతుకంతా దేశానిది’ నాటకం చూపురులను బాగా ఆకర్షించింది.

Bathukantha Deshanidhi Stage Play

‘పుట్టుక నీది, చావు నీది.. బతుకంతా దేశానిది’ అంటూ తెలంగాణ ఉద్యమమే ఊపిరిగా జీవించిన ప్రజాకవి కాళోజీ (Praja Kavi Kaloji) 110వ జన్మదినాన్ని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం తెలంగాణ భాష దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. అందులో భాగంగా తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో ఉత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి జూపల్లి కృష్ణారావు ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాలను తిలకించి.. కాళోజీ సేవలను స్మరించుకున్నారు. ఈ వేడుకలో తెలంగాణ ఎథ్నిక్ థియేటర్ ఆర్ట్స్ సొసైటీ (TETA) బృందం ప్రదర్శించిన ‘బతుకంతా దేశానిది’ (Bathukantha Deshanidhi) నాటకం ప్రేక్షకులను అలరించింది.

Also Read- Tollywood:  ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్ యూనియన్ లో గొడవేంటి ...

‘బతుకంతా దేశానిది’ నాటకం విషయానికి వస్తే.. జి. శివరామ్ రెడ్డి దర్శకత్వంలో రూపుదిద్దకున్న ఈ నాటకం చూపరులను ఆద్యంతం కట్టిపడేయడమే కాకుండా.. క్లాప్స్‌తో రవీంద్రభారతి హోరెత్తిలా చేసింది. కాళోజీ జీవితంలోని ముఖ్య ఘట్టాలను కథాంశంగా తీసుకుని నాటకాన్ని మలిచిన తీరుకు ప్రశంసలు కురిశాయి. నటీనటుల హావభావాలు, తెలంగాణ యాసలో చెప్పే డైలాగ్స్, సంగీతం, లైటింగ్ అన్నీ కూడా ఈ నాటకాన్ని హైలెట్ చేశాయి. కాళోజీగా నటించిన శివరామ్ రెడ్డి నటనకు కరతాళ ధ్వనులు మోగాయి. నిజంగా కాళోజీయే దిగి వచ్చాడా? అనేలా ప్రశంసలు కురిశాయి.


Stage-Play-Kaloji.jpg

ఈ కార్యక్రమానికి అతిథులుగా హాజరైన తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ నాటకబృందాన్ని అభినందించారు. యువతరం నాటకాల వైపు అడుగువేయాలని, నాటకరంగాన్ని బతికించాలని ఈ సందర్భంగా కోరారు. ప్రముఖ ఆర్టిస్ట్ మైమ్ మధు, డైరెక్టర్ అజిత్ నాగ్, రంగస్థల దర్శకుడు మోహన్ సేనాపతి, మేచినేని శ్రీనివాసరావు, ఉస్తాద్ ఒగ్గు రవి, డా. ఖాజా పాషా, డ్రీమ్ కాస్ట్యూమ్ కిరణ్, మేకప్ మెన్ మల్లాది గోపాలకృష్ణ. TETA బృందాన్ని కొనియాడారు. ఈ నాటకంలో భాగమైన వారంతా.. ఇలాంటి వేదికపై నాటకం ప్రదర్శించినందుకు సంతోషం వ్యక్తం చేశారు. ఈ అవకాశం కల్పించిన తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

Read Latest Cinema News

Updated Date - Sep 10 , 2024 | 03:48 PM