Sree Amrutheshwara Temple: శ్రీ అమృతేశ్వరుని చెంత రాజమౌళి దంపతులు
ABN , Publish Date - Mar 07 , 2024 | 07:15 PM
సాయి కొర్రపాటి ఈ మహా శివాలయం నిర్మించడానికి స్ఫూర్తికారకుడైన పురాణపండ శ్రీనివాస్, సాయి కొర్రపాటి సినీ రంగంలోకి అడుగు పెట్టడానికి కారకుడైన రాజమౌళిలకు శ్రీ అమృతేశ్వర ఆలయ కమిటీ కృతజ్ఞతలు తెలిపింది. ఆలయమంతా సుమారు వందమంది వేదపండితులతో వేద గానం, వేద విహితమైన కర్మలు అత్యద్భుతంగా సాగడంతో భక్త జనకోటి పరవశించిపోయారు.
బళ్లారి: కర్ణాటక చరిత్రలో ఒక మహోజ్వల ఘట్టానికి తెరలేచింది. ఇరవై ఐదు కోట్ల రూపాయల వ్యయంతో హిమాలయ పర్వతశ్రేణుల అనుగ్రహంగా అతి అరుదైన స్వచ్ఛ స్ఫటిక లింగం కృష్ణ శిలా శిఖరంగా భాసిస్తున్న అమృతేశ్వర మహాలయంలో కొలువుతీరి రుద్రనమక చమక మంత్రం శక్తులతో అర్చనాభిషేకాలందుకుంటోంది. ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ వారాహి చలన చిత్రం అధినేత సాయి కొర్రపాటి (#SaiKorrapati) సంవత్సర కాల దివారాత్రుల భక్తి శ్రమల ఫలితంగా రూపు దిద్దుకున్న శ్రీ అమృతేశ్వర ఆలయం.. శ్రీ సచ్చిదానంద భారతీ మహారాజ్ వారి శిష్య బృంద వేద మంత్ర ధ్వనుల మధ్య దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి (#SSRajamouli) దంపతుల పూజతో వేలకొలది భక్తుల హర్ష ధ్వానాలమధ్య అత్యంత వైభవోపేతంగా ప్రారంభమైంది.
ముఖ్య అతిధిగా పాల్గొన్న ‘కెజియఫ్’ చిత్ర ఫేమ్, రాకింగ్ స్టార్ యశ్ (Yash) తన సొంత ఖర్చుతో ఆలయంపై పదిహేను నిమిషాలపాటు పూలవాన కురిపించి, అనంతరం అమృతేశ్వరుని దర్శనం చేసుకున్నారు. ఆలయంలో నందీశ్వరుని చెంత ప్రముఖ రచయిత, శ్రీశైల దేవస్థానం పూర్వసలహాదారులు పురాణపండ శ్రీనివాస్ (#PuranapandaSrinivas) అపూర్వ పవిత్ర పరమ శైవ గ్రంధం ‘అమృత వర్షిణి’ని రాజమౌళి ఆవిష్కరించి పండిత, అర్చక, సినీ ప్రముఖులకు అందజేశారు. ఆలయ ప్రాంగణంలో ప్రశాంత వాతావరణంలో పురాణపండ శ్రీనివాస్ మౌనంగా శివ పారాయణం చేసుకున్నారని ఆలయ వర్గాలు చెప్పాయి. (#SreeAmrutheshwaraTemple)
ఈ కార్యక్రమంలో రాజమౌళి కుమారుడు కార్తికేయ, కీరవాణి కుమారుడు కాలభైరవ, ప్రముఖ జానపద గాయని మంగ్లీ తదితరులు పాల్గొన్నారు. సాయి కొర్రపాటి ఈ మహా శివాలయం నిర్మించడానికి స్ఫూర్తికారకుడైన పురాణపండ శ్రీనివాస్, సాయి కొర్రపాటి సినీ రంగంలోకి అడుగు పెట్టడానికి కారకుడైన రాజమౌళిలకు శ్రీ అమృతేశ్వర ఆలయ కమిటీ కృతజ్ఞతలు తెలిపింది. ఆలయమంతా సుమారు వందమంది వేదపండితులతో వేద గానం, వేద విహితమైన కర్మలు అత్యద్భుతంగా సాగడంతో భక్త జనకోటి పరవశించిపోయారు. జనం పోటెత్తడంతో పోలీస్‌లు రంగప్రవేశం చేసి కట్టడి చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. భారతదేశ చరిత్రలో ఈ శివాలయం చరిత్ర సృష్టిస్తుందని.. కర్నాటక రాజకీయ, సాంస్కృతిక, పండిత సమాజంలో చర్చలు జరుగుతుండటం విశేషం.
ఇవి కూడా చదవండి:
====================
*Allu Arjun and Sneha Reddy: 13వ పెళ్లి రోజు.. ఐకాన్ స్టార్ ఎమోషనల్ పోస్ట్
****************************
*Devara: తంగం.. జాన్వీ కపూర్ బర్త్‌డే స్పెషల్ పోస్టర్ వైరల్
**************************