Harsha Sai: అసలెవరీ హర్షసాయి.. మరో మెగాస్టార్ అంటూ బిల్డప్ ఇచ్చిన వారంతా ఏమయ్యారు

ABN , Publish Date - Sep 25 , 2024 | 10:37 PM

యూట్యూబర్ హర్షసాయి వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. హర్షసాయి ప్రేమ, పెళ్లి పేరుతో లొంగదీసుకుని, డబ్బు కాజేశాడని ఓ యువతి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది. దీంతో ఈ విషయం సెన్సేషన్‌గా మారింది. ఇప్పుడు ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు బయటకు వస్తున్నాయి. అసలు విషయం ఏమిటంటే..

Harsha Sai Youtuber

యూట్యూబర్ హర్షసాయి వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. హర్షసాయి ప్రేమ, పెళ్లి పేరుతో లొంగదీసుకుని, డబ్బు కాజేశాడని ఓ యువతి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది. దీంతో ఈ విషయం సెన్సేషన్‌గా మారింది. మంగళవారం హర్షసాయిపై యువతి పోలీస్ కంప్లైంట్ ఇవ్వగా.. బుధవారం మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. బాధిత యువతి, హర్షసాయి కాల్స్‌కి సంబంధించిన ఆడియో రికార్డ్స్ లీక్ అయ్యాయి. ఈ ఆడియో రికార్డ్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. కొన్ని రికార్డ్స్‌లో హర్షసాయి, యువతి చాలా క్లోజ్‌గా మాట్లాడుకోగా.. మరికొన్ని ఆడియోల్లో ఇద్దరి మధ్య ఘర్షణ జరిగినట్లుగా తెలుస్తుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

Also Read- Devara: వార్స్ వద్దు.. ‘దేవర’ అభిమానులకు నిర్మాత నాగవంశీ రిక్వెస్ట్


తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి హర్షసాయి మోసం చేశాడంటూ సదరు యువతి అడ్వకేట్‌తో కలిసి నార్సింగి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు యూట్యూబర్‌ హర్షసాయిపై కేసు నమోదు చేశారు. బాధితురాలి నుంచి నార్సింగి పోలీసులు కొన్ని ఆధారాలను సేకరించారు. మరికొన్ని ఆధారాలను సమర్పించాలని బాధితురాలిని పోలీసులు కోరారు. హర్షసాయి నుంచి, అతని ఫాలోయర్స్ నుంచి ప్రాణహాని ఉందంటూ బాధితురాలు పోలీసులకు చెప్పింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి తన వద్ద నుంచి రూ. 2 కోట్లు తీసుకున్నాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. ఈ విషయం తెలిసి పరారైన హర్షసాయి.. సోషల్ మీడియా వేదికగా బుధవారం ఓ మెసేజ్ విడుదల చేశారు. ‘‘నేను ఏంటో మీకు తెలుసు, నిజం తొందర్లోనే బయట పడుతుంది. ఇవన్నీ నిరాధార ఆరోపణలు, కేవలం డబ్బు కోసమే చేస్తున్నారు. ఇకపై నా అడ్వకేట్ తాటికొండ చిరంజీవి విజయవాడ నుండి దీనిపై స్పందిస్తారు’’ అని పోస్ట్ చేశాడు హర్షసాయి.


అసలెవరీ హర్షసాయి..

యూట్యూబ్ ద్వారా ఫేమస్ అయిన ఓ యూట్యూబర్ హర్షసాయి. ఆయన వీడియోలు నచ్చి, అతనితో సినిమా తీయడానికి సిద్ధమైంది సదరు యువతి. తను నిర్మాతగా.. హర్షసాయి కథ, దర్శకత్వంతో పాటు హీరోగా నటిస్తూ ‘మెగా’ అనే టైటిల్‌తో ఓ సినిమాను చాలా గ్రాండ్‌గా ప్రారంభించారు. ఈ సినిమా ప్రారంభం తర్వాత హర్షసాయి వీడియోలు బాగా వైరల్ అయ్యాయి. పనిగట్టుకుని మరీ ఈ సినిమా పీఆర్వోలు హర్షసాయితో ఇంటర్వ్యూలు ఇప్పించారు. టాలీవుడ్‌కి మరో మెగాస్టార్ వచ్చాడనేంతగా అతనిని లేపే ప్రయత్నం చేశారు. హర్షసాయి కూడా తన చుట్టూ జనం చేరడంతో.. ప్రపంచంలో తనంత గొప్పవాడు, తెలివిగలవాడు లేడనేలా, సినిమా ప్రారంభం నుంచే తనొక స్టార్ హీరోని అనే విధంగా యాటిట్యూడ్‌ ప్రదర్శిస్తూ.. కొన్నాళ్ల పాటు వార్తలలో హాట్ టాపిక్‌గా నిలిచాడు.

Also Read- Urmila Matondkar: తనకంటే 10 ఏళ్ల చిన్నవాడితో పెళ్లి.. 8 ఏళ్లకే విడాకులు



అసలెందుకిలా..

‘మెగా’ అనే టైటిల్‌తో సినిమా ప్రారంభం అయిన తర్వాత.. ఇప్పుడు కేసు పెట్టిన యువతి అప్పట్లో హర్షసాయిపై ప్రశంసల వర్షం కురిపించింది. తనలాంటి వ్యక్తి భూమి మీద అరుదుగా ఉంటాడనేలా ఆకాశానికి ఎత్తేసింది. కట్ చేస్తే.. ఇప్పుడా సినిమా ఏమయిందో తెలియదు కానీ.. తనని మోసం చేశాడంటూ హర్షసాయిపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎక్కడో యూట్యూబ్‌లో వీడియోలను చేసుకునే వాడిని తీసుకొచ్చి.. అతనితో సినిమా చేయాలని సంకల్పించిన యువతి.. ఇప్పుడిలా పోలీస్ స్టేషన్‌ మెట్లు ఎక్కి.. పెళ్లి పేరుతో మోసం చేశాడని చెప్పడం విడ్డూరం. ఈ వ్యవహారంలో మీటూలు, హేమలు ఎలా స్పందిస్తాయో మరి. ఇందులో ఎవరిది తప్పు? నాలుగు వీడియోలతో కాస్త ఫేమస్ అయిపోగానే.. అతడిని హీరోని చేసి సినిమా చేయాలనుకోవడం ఏంటి? సినిమా షూటింగ్ కూడా ప్రారంభం కాకముందే అతడితో ఇంటర్వ్యూలు పెట్టించడం, మరో మెగాస్టార్ అంటూ ప్రచారాలు చేయడం, మళ్లీ ఇప్పుడు మోసం చేశాడంటూ పోలీసులను ఆశ్రయించడం. చూద్దాం.. ఫైనల్‌గా ఈ వ్యవహారంలో ఎన్నెన్ని ట్విస్ట్‌లు బయటికి వస్తాయో..

Also Read- Prakash Raj: ‘జస్ట్ ఆస్కింగ్’ అంటూ మరోసారి పవన్‌ కళ్యాణ్‌కు కౌంటర్

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Sep 25 , 2024 | 10:37 PM