Siddharth and Aditi Rao Hydari: రహస్యంగా వివాహం.. ఎక్కడంటే?

ABN , Publish Date - Mar 27 , 2024 | 01:22 PM

గత కొన్ని రోజులుగా కోలీవుడ్ హీరో సిద్దార్థ్, బ్యూటీఫుల్ హీరోయిన్ అదితి రావు హైదరీల రిలేషన్‌పై వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ మధ్య చాలా సందర్భాల్లో వీరిద్దరూ కలిసి కనిపించారు. ‘మహాసముద్రం’ సినిమాకు కలిసి పనిచేసిన ఈ ఇద్దరూ.. అప్పటి నుండి చాలా సన్నిహితంగా ఉంటూ వస్తున్నారు. బుధవారం ఉదయం వీరిద్దరూ రహస్యంగా వివాహం చేసుకున్నట్లుగా వార్తలు వైరల్ అవుతున్నాయి.

Siddharth and Aditi Rao Hydari: రహస్యంగా వివాహం.. ఎక్కడంటే?
Aditi Rao Hydari and Siddharth

గత కొన్ని రోజులుగా కోలీవుడ్ హీరో సిద్దార్థ్ (Siddharth), బ్యూటీఫుల్ హీరోయిన్ అదితి రావు హైదరీ (Aditi Rao Hydari)ల రిలేషన్‌పై వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ మధ్య చాలా సందర్భాల్లో వీరిద్దరూ కలిసి కనిపించారు. ‘మహాసముద్రం’ సినిమాకు కలిసి పనిచేసిన ఈ ఇద్దరూ.. అప్పటి నుండి చాలా సన్నిహితంగా ఉంటూ వస్తున్నారు. ఆ మధ్య హీరో శర్వానంద్ వివాహ వేడుకకు ఇద్దరూ కలిసి వెళ్లడం కూడా వీరి రిలేషన్‌పై వార్తలు వైరల్ అయ్యేలా చేసింది. ఇప్పుడీ రిలేషన్‌ని వారు ఇంకాస్త ముందుకు తీసుకువెళ్లినట్లుగా తెలుస్తోంది. సిద్దార్థ్, అదితి రావు హైదరి రహస్యంగా పెళ్లి చేసుకున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. (Siddharth and Aditi Rao Hydari Secretly Married)

Siddharth-and-aditi.jpg

వీరి రహస్య వివాహానికి సంబంధించి ప్రస్తుతం వార్తలు వైరల్ అవుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలోని వనపర్తి జిల్లా శ్రీరంగపురం (Srirangapuram) మండలం శ్రీరంగపురం గ్రామంలోని ప్రసిద్ధి చెందిన శ్రీ రంగనాయక స్వామి ఆలయంలో సిద్దార్థ్, అదితి రావు (Siddharth and Aditi Rao Hydari)లు బుధవారం ఉదయం రహస్యంగా పెళ్లి చేసుకున్నట్లుగా తెలుస్తోంది. రహస్యంగా జరిగిన ఈ పెళ్లి తంతు కార్యక్రమానికి మీడియాతో పాటు ఆలయ సిబ్బంది‌ని కూడా టెంపుల్‌లోకి రానివ్వలేదనేలా వార్తలు వినబడుతున్నాయి. ఈ పెళ్లికి వీరిద్దరికీ చాలా దగ్గరైన వారు మాత్రమే హాజరైనట్లుగా సమాచారం. వనపర్తి (Wanaparthy) సంస్థానాధీశుల వారసుల్లో నటి అదితి రావు హైదరి కూడా ఒకరు. దీంతో పురోహితుల సమక్షంలో పూర్తి ఆంక్షలతో సిద్దార్థ్, అదితిల వివాహం జరిగిందనేలా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వివాహానికి సంబంధించి సిద్దార్థ్, అదితిల నుంచి ఇంత వరకు ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు.


aditi.jpg

కాగా.. సిద్దార్థ్, అదితిరావు హైదరి.. వీరిద్దరికీ ఇది రెండో పెళ్లి (Second Marriage) కావడం విశేషం. 2003లో మేఘన (Meghana)ను సిద్ధార్థ్‌ వివాహం చేసుకున్నారు. వీరికి ఓ కుమారుడు కూడా ఉన్నాడు. అనంతరం ఇద్దరి మధ్య అభిప్రాయభేదాలు తలెత్తడంతో.. విడిపోయారు. ఆ తర్వాత సిద్ధార్థ్‌ విషయంలో మళ్లీ పెళ్లి అంటూ ఇద్దరు ముగ్గురు హీరోయిన్ల పేర్లు వినిపించాయి. చివరకు అదితిరావు హైదరిని ఇలా రహస్యంగా వివాహం చేసుకుని.. మళ్లీ వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. అదితి రావు కూడా 2002లో లాయర్, యాక్టర్ అయిన సత్యదీప్ మిశ్రా (Satyadeep Mishra)ను వివాహం చేసుకుని.. ఆ తర్వాత విడాకులు తీసుకుంది.


ఇవి కూడా చదవండి:

====================

*Klin Kaara: మెగా ప్రిన్సెస్ క్లీంకార ఫేస్ రివీలైందోచ్..

********************

*Vishva Karthikeya: ఈ సినిమాలో పిల్లల్ని ఎలా పెంచకూడదో చూపించాం..

************************

*Prithviraj Sukumaran: ‘సలార్’కు పూర్తి భిన్నమైన పాత్ర చేశా..

********************************

Updated Date - Mar 27 , 2024 | 01:23 PM