సిద్ధార్ద్, అదితి రావ్ హైదరి మళ్లీ పెళ్లి.. ఇదేం ట్విస్ట్! ఫొటోలు వైరల్

ABN , Publish Date - Nov 27 , 2024 | 06:42 PM

సిద్ధార్ద్, అదితి రావ్ హైదరి మళ్లీ పెళ్లి చేసుకున్నారు. ఇదేం ట్విస్ట్.. రీసెంట్‌గానేగా వారు పెళ్లి చేసుకుంది. చూస్తుంటే.. పవిత్ర, నరేష్‌లను మించిపోయేలా ఉన్నారుగా.. అనేలా తాజాగా సిద్ధార్థ్, అదితి రావ్ హైదరి షేర్ చేసిన ఫొటోలను చూసిన వారంతా అనుకుంటున్నారు. అసలు విషయం ఏమిటంటే..

Siddharth and Aditi Rao Marriage

సిద్ధార్ద్, అదితి రావ్ హైదరి మళ్లీ పెళ్లి చేసుకున్నారు. ఇదేంటి వీళ్లు మొన్నేగా పెళ్లి చేసుకున్నారు. మళ్లీ పెళ్లి చేసుకోవడం ఏంటి? వాళ్లు ఏమైనా పవిత్ర, నరేష్‌లు కాదు కదా.. మళ్లీ మళ్లీ పెళ్లి చేసుకోవడానికి అని అనుకుంటున్నారు కదా. ఏమో, ఎవరి ఆనందం వారిది. మళ్లీ పెళ్లి చేసుకుంది వారిద్దరే (సిద్ధార్ద్, అదితి రావ్ హైదరి) కాబట్టి అంతగా డౌటనుమానాలకు తావివ్వాల్సిన అవసరం లేదు. ఇక విషయంలోకి వస్తే..

Also Read-Akkineni Family: ఒకవైపు నాగచైతన్య పెళ్లి.. మరో వైపు అఖిల్ నిశ్చితార్థం

హీరో సిద్ధార్ద్, హీరోయిన్ అదితి రావ్ హైదరి ఇటీవల తెలంగాణలోని వనపర్తి జిల్లా శ్రీరంగాపురంలోని 400 ఏళ్ల పురాతన రంగనాథస్వామి ఆలయంలో కుటుంబ సభ్యుల సమక్షంలో గ్రాండ్‌గా వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. వీరి పెళ్లికి కుటుంబ సభ్యులతో పాటు అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. వనపర్తి సంస్థానాధీశుల వారసులలో ఒకరైన నటి అదితి రావు హైదరి.. ఆ సంస్థానానికి చెందిన 400 ఏళ్ల పురాతన రంగనాథస్వామి ఆలయంలో వివాహం చేసుకున్నారు. అక్కడి పురోహితులు దగ్గరుండి మరి ఈ పెళ్లి జ‌రిపించారు. వీరి వివాహ వేడుక‌కు సంబంధించిన ఫొటోలను అప్పట్లో వీరిరువురు సోష‌ల్ మీడియా వేదిక‌గా షేర్ చేయగా అందరూ ఈ నూతన జంటకు శుభాకాంక్షలు తెలిపారు.


Siddharth-and-Aditi.jpg

ఇప్పుడు మరోసారి వారిద్దరూ పెళ్లి చేసుకుని వార్తలలో నిలిచారు. ఈ విషయం వారు షేర్ చేసిన ఫొటోలను చూస్తే తెలుస్తోంది. అప్పుడు పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్న ఈ జంట.. ఇప్పుడు మాత్రం వారికి నచ్చినట్లుగా ఫొటోలు దిగుతూ.. రాజస్థాన్‌లోని ఓ రిసార్ట్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నట్లుగా ఈ ఫొటోలను చూస్తుంటే అర్థమవుతోంది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. మళ్లీ పెళ్లి చేసుకోవడం ఏంటి? ఇంకా ఎన్ని సార్లు ఇలా చేసుకుంటారని కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తుంటే.. మరికొందరు మాత్రం జంట చూడచక్కగా ఉందంటూ విశెస్ చెబుతున్నారు.

Also Read-Pawan Kalyan: రామ్ గోపాల్ వర్మ అరెస్ట్‌కై.. నేను చేయాల్సింది చేస్తా..

Also Read-Samantha Fire: విడాకులు తీసుకుంటే.. ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారా..

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Nov 27 , 2024 | 06:42 PM