Bangalore Rave Party: బెంగుళూరు రేవ్ పార్టీ కేస్‌లో కీలక పరిణామం.. హేమకు షాక్

ABN , Publish Date - Sep 12 , 2024 | 09:48 AM

కొన్ని రోజుల క్రితం బెంగుళూరు రేవ్ పార్టీ అంటూ ఓ రేంజ్‌లో హడావుడి జరిగిన విషయం తెలిసిందే. ఇందులో నటి హేమతో పాటు మరికొంత మంది డ్రగ్స్ సేవించినట్లుగా వార్తలు వైరల్ అయ్యాయి. అయితే హేమ మాత్రం ఈ రేవ్ పార్టీ విషయంలో తనకేం తెలియదని, తను డ్రగ్స్ సేవించలేదంటూ మీడియా ముందుకు వచ్చి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ క్రమంలో బెంగుళూరు రేవ్ పార్టీ కేస్‌లో కీలక పరిణామం చోటు చేసుకుంది.

Actress Hema

కొన్ని రోజుల క్రితం బెంగుళూరు రేవ్ పార్టీ అంటూ ఓ రేంజ్‌లో హడావుడి జరిగిన విషయం తెలిసిందే. ఇందులో నటి హేమతో పాటు మరికొంత మంది డ్రగ్స్ సేవించినట్లుగా వార్తలు వైరల్ అయ్యాయి. అయితే హేమ మాత్రం ఈ రేవ్ పార్టీ విషయంలో తనకేం తెలియదని, తను డ్రగ్స్ సేవించలేదంటూ మీడియా ముందుకు వచ్చి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ క్రమంలో బెంగుళూరు రేవ్ పార్టీ (Bangalore Rave Party) కేస్‌లో కీలక పరిణామం చోటు చేసుకుంది. బెంగుళూరు పోలీసులు రేవ్ పార్టీ కేస్‌లో ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. మొత్తం 88 మందిని నిందితులుగా పేర్కొన్నారు. ఈ కేసుపై 1086 పేజీల ఛార్జ్ షీట్ దాఖలైంది. ఇందులో హేమకు షాకిచ్చారు. నటి హేమ (Actress Hema) పార్టీ‌లో పాల్గొని డ్రగ్స్ సేవించినట్టు ఛార్జ్ షీట్‌లో పోలీసులు పేర్కొన్నారు. పార్టీలో MDMA డ్రగ్‌ను హేమ సేవించినట్టు ఆధారాలు చూపిస్తూ.. మెడికల్ రిపోర్ట్స్‌ను ఛార్జ్ షీట్‌కు జోడించారు.

Also Read- Tammareddy Bharadwaja: తప్పు చేశానని ప్రూవ్ చేస్తే దేనికైనా రెడీ..


Actress-Hema.jpg

హేమతో పాటు పార్టీకి వెళ్లిన 79 మందిని నిందితులుగా ఈ ఛార్జ్ షీట్‌లో పోలీసులు పేర్కొన్నారు. పార్టీ నిర్వహించిన 9 మందిపై ఇతర సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. NDPS సెక్షన్ 27 కింద హేమను నిందితురాలిగా పేర్కొన్నారు. హేమతో పాటు హాజరైన మరో యాక్టర్‌కు డ్రగ్స్ నెగిటివ్ వచ్చినట్లుగా తెలిపారు. ప్రస్తుతం సమసిపోయిందనుకుంటున్న హేమ వ్యవహారం మళ్లీ మొదటికి వచ్చింది.

ఆమె కొన్ని రిపోర్ట్స్ పట్టుకుని.. నేను డ్రగ్స్ సేవించలేదంటూ ఇటీవల హడావుడి చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆమెపై ఉన్న నిషేధాన్ని కూడా ‘మా’ ఎత్తివేసింది. అలాగే మీడియా ముందుకు వచ్చి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను కలవడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లుగా కూడా ఇటీవల ఆమె చెప్పుకొచ్చింది. ఇప్పుడు చూస్తే.. కేసు మళ్లీ మొదటికి వచ్చింది. మరి ఇప్పుడు హేమ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాల్సి ఉంది...

Also Read-Malaika Arora Father: ఆత్మహత్య చేసుకున్న మలైకా తండ్రి అనిల్ అరోరా..

Read Latest Cinema News

Updated Date - Sep 12 , 2024 | 10:37 AM