Sandhya Theatre Tragedy: రేవతి మృతిలో మా ప్రమేయం లేదు.. థియేటర్ మాదే కానీ..

ABN , Publish Date - Dec 11 , 2024 | 09:15 AM

థియేటర్‌ తమదే అయినప్పటికీ ప్రీమియర్‌ షోతో తమకు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు సంధ్య థియేటర్ ఓనర్ రేణుకాదేవి. రేవతి మృతిలో మా ప్రమేయం లేదని చెబుతూ.. తమపై నమోదు చేసిన కేసు కొట్టేయాలని కోరారు. అసలు విషయం ఏమిటంటే..

Pushpa 2 Premiere at Sandhya Theater

పుష్ప- 2 ప్రీమియర్‌ షోలో రేవతి అనే మహిళ మృతికి, తమకు ఎలాంటి సంబంధం లేదని సంధ్య థియేటర్‌ యజమానులు తెలిపారు. అందువల్ల తమపై పోలీసులు పెట్టిన కేసును కొట్టేయాలని కోరుతూ యజమానురాలు రేణుకాదేవి, ఇతరులతో పాటు సంధ్య సినీ ఎంటర్‌ప్రైజ్‌ సంస్థ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈనెల 5వ తేదీన పుష్ప-2 ప్రీమియర్‌ షోకు టికెట్లు కొనుక్కొని వెళ్లిన రేవతి అనే మహిళ తొక్కిసలాటలో మృతిచెందగా ఆమె కుమారుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై రేవతి భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు చిక్కడపల్లి పోలీసులు సంధ్య థియేటర్‌ యాజమాన్యం, సినీహీరో అల్లు అర్జున్‌ సహా పలువురిపై కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసును కొట్టివేయాలని థియేటర్ యజమానులు కోరారు.

Also Read- Google Search Trends 2024: వ్యక్తుల జాబితాలో టాప్ 5లో పవన్‌ కళ్యాణ్‌.. ‘యే పవన్ నహీ ఆంధీ హై’

థియేటర్‌ తమదే అయినప్పటికీ ప్రీమియర్‌ షోతో తమకు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. ఆ షోను డిస్ట్రిబ్యూటర్లు నిర్వహించారని, ప్రీమియర్‌ షో, బెనిఫిట్‌ షోలకు అనుమతిస్తూ ప్రభుత్వం మెమో సైతం జారీ చేసిందని తెలిపారు. థియేటర్‌ మైత్రీ డిస్ట్రిబ్యూటర్‌ ఆధీనంలో ఉందని తెలిపారు. అయినప్పటికీ తమ బాధ్యతగా తాము బందోబస్తు కల్పించాలని, జనాలను అదుపు చేయాలని పోలీసులకు వినతి పత్రం సమర్పించామని తెలిపారు. కొంతమంది పోలీసులు బందోబస్తుకు వచ్చినప్పటికీ విపరీతమైన తోపులాట వల్ల ప్రమాదం జరిగినట్లు పేర్కొన్నారు.


Pushpa.jpg

ఈ ప్రమాదంతో తమకు ఎలాంటి సంబంధం లేకపోయినప్పటికీ హత్య చేయాలనే ఉద్దేశంతో దాడి చేశారంటూ వంటి తీవ్రమైన సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేయడం అన్యాయమని పేర్కొన్నారు. సినీ హీరో సెక్యూరిటీ సిబ్బంది వల్ల ఘటన జరిగినట్లు ఫిర్యాదుదారు పేర్కొన్నారే తప్ప తమపై ఎలాంటి ఆరోపణ లేదని తెలిపారు. అందువల్ల కేసు కొట్టేయాలని కోరారు. మరోవైపు ఈ ఘటనపై చిత్ర దర్శకుడు, హీరో స్పందిస్తూ.. రేవతి కుటుంబానికి అండగా ఉంటామని ప్రకటించిన విషయం తెలిసిందే.

Also Read-Manchu Family Dispute: తలకు గాయం.. హాస్పిటల్‌లో మోహన్ బాబు

Also Read-మనోజ్.. మీ అమ్మ హాస్పిటల్ పాలైందిరా: మోహన్ బాబు వాయిస్ మెసేజ్ వైరల్

Also Read-రేలంగి వివాహ ఆహ్వాన పత్రిక: 91 సంవత్సరాల క్రితపు శుభలేఖను చూశారా..

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Dec 11 , 2024 | 09:15 AM