Samantha: పోరాటానికి సిద్ధమవుతోన్న సమంత..

ABN , Publish Date - Aug 30 , 2024 | 09:33 PM

మలయాళ చిత్రపరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను వెలికితేవడంలో హేమ కమిటీ పనితీరు అద్భుతంగా ఉందని టాలీవుడ్‌ కథానాయిక సమంత ప్రశంసించారు. అలాగే ఈ కమిటీ ఏర్పాటుకు కారణమైన డబ్ల్యూసీసీ (ఉమెన్‌ ఇన్‌ సినిమా కలెక్టివ్‌) సంస్థనూ ఆమె అభినందించారు. ఈ కమిటీ ఆధ్వర్యంలో 2019లో సృష్టించబడిన టాలీవుడ్ సపోర్ట్ గ్రూప్ అయిన ది వాయిస్ ఆఫ్ ఉమెన్‌‌ కూడా నడవాలని ఆమె కోరారు.

Samantha Heroine

మలయాళ చిత్రపరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను వెలికితేవడంలో హేమ కమిటీ (Hema Committee) పనితీరు అద్భుతంగా ఉందని టాలీవుడ్‌ హీరోయిన్ సమంత (Samantha) ప్రశంసించారు. అలాగే ఈ కమిటీ ఏర్పాటుకు కారణమైన డబ్ల్యూసీసీ (ఉమెన్‌ ఇన్‌ సినిమా కలెక్టివ్‌) సంస్థనూ ఆమె అభినందించారు. ఆ సంస్థ సభ్యుల కష్టం వల్లే ఈ రోజు మహిళల సమస్యలు చర్చనీయాంశంగా మారాయని చెప్పారు. సినీ పరిశ్రమలో మహిళల సంరక్షణ కోసం ఆ సంస్థ అవిశ్రాంతంగా పాటుపడుతోందని అభినందించారు. ‘డబ్ల్యూసీసీ (WCC) గురించి నాకు చాలా కాలంగా తెలుసు. ప్రభుత్వం హేమ కమిటీ ఏర్పాటు చేయడానికి ఆ సంస్థ తీసుకొన్న చొరవే కారణం. వారి పోరాటానికి నా కృతజ్ఞతలు’ అని తెలిపిన సమంత.. తాజాగా టాలీవుడ్‌లోనూ కదలిక తెచ్చే ప్రయత్నం చేస్తోంది. అంటే ఒక రకంగా పోరాటానికి సిద్ధమవుతోందని చెప్పుకోవచ్చు.

Also Read- Saripodhaa Sanivaaram: ‘సరిపోదా శనివారం’ మూవీ రివ్యూ

అన్ని సినీ ఇండస్ట్రీలలో ఇప్పుడు హేమ కమిటీ గురించే మాట్లాడుకుంటున్నారు. కానీ టాలీవుడ్‌ (Tollywood)కు సంబంధించి ఏ ఒక్కరూ ఇంత వరకు బయటికి రాలేదు. అలాంటి వారందరి తరపున సమంత నిలబడాలని చూస్తుందేమో తెలియదు కానీ.. తాజాగా ఆమె ఇన్‌స్టా వేదికగా చేసిన పోస్ట్ మాత్రం వైరల్ అవుతోంది. టాలీవుడ్‌ మహిళల తరపున ఆమె హేమ కమిటీ నివేదికను స్వాగతిస్తున్నట్లుగా పేర్కొంటూ.. తెలంగాణ ప్రభుత్వానికి (Telangana Government) కూడా ఓ విన్నపాన్ని విన్నవించుకుంది.


Samantha.jpg

‘‘తెలుగు చిత్ర పరిశ్రమలోని మహిళలమైన మేము హేమ కమిటీ నివేదికను స్వాగతిస్తున్నాము. దీనికి మార్గం వేసిన కేరళ డబ్ల్యూసీసీ (ఉమెన్‌ ఇన్‌ సినిమా కలెక్టివ్‌) యొక్క నిరంతర ప్రయత్నాలను అభినందిస్తున్నాము. అలాగే తెలుగు చిత్ర పరిశ్రమలోని మహిళల కోసం 2019లో సృష్టించబడిన సపోర్ట్ గ్రూప్ అయిన ది వాయిస్ ఆఫ్ ఉమెన్‌‌ కూడా ఉమెన్‌ ఇన్‌ సినిమా కలెక్టివ్‌ గ్రూప్‌ స్ఫూర్తిగా తీసుకోవాలి.‌ తెలుగు చిత్ర పరిశ్రమలో మహిళలకు సురక్షితమైన పని వాతావరణాన్ని నెలకొల్పడానికి రూపొందించిన సబ్ కమిటీ నివేదికను ప్రచురించాలని ఇందుమూలంగా మేము తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతున్నాము..’’ అని సమంత (Samantha Insta Post) ఒక అడుగు ముందుకేసింది. మరి ఈ విషయంపై తెలంగాణ ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి..

Read Latest Cinema News

Updated Date - Aug 30 , 2024 | 09:33 PM