Sai Durgha Tej: విజయవాడకు సాయిదుర్గ తేజ్.. విషయం ఏంటంటే
ABN , Publish Date - Sep 11 , 2024 | 08:38 PM
సామాజిక సేవా కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందుండే ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ. ఆ విషయం అందరికీ తెలిసిందే. రీసెంట్‌గా సంభవించిన ఏపీ, తెలంగాణ వరదలకు ఎంతో మంది బాధితులుగా నిలిచారు. వారిని ఆదుకునేందుకు మెగా ఫ్యామిలీ నుంచి హీరోలంతా ముందుకు వచ్చి విరాళాలు అందించారు. సాయి దుర్గతేజ్ తను ప్రకటించిన విరాళాన్ని విజయవాడలో మంత్రి నారా లోకేష్‌కు అందించారు.
సామాజిక సేవా కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందుండే ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ. ఆ విషయం అందరికీ తెలిసిందే. రీసెంట్‌గా సంభవించిన ఏపీ, తెలంగాణ వరదలకు ఎంతో మంది బాధితులుగా నిలిచారు. వారిని ఆదుకునేందుకు మెగా ఫ్యామిలీ నుంచి హీరోలంతా ముందుకు వచ్చి విరాళాలు అందించారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, సాయి దుర్గతేజ్ (Sai Durgha Tej), వరుణ్ తేజ్, నిహారిక.. ఇలా అందరూ తమ వంతుగా సాయం ప్రకటించారు. తను ప్రకటించిన సాయాన్ని అందజేసేందుకు స్వయంగా సాయిదుర్గ తేజ్ విజయవాడకు వెళ్లారు. అక్కడ మినిస్టర్ నారా లోకేష్‌ని కలిసి.. సీఎం సహాయనిధికి ప్రకటించిన రూ. 10 లక్షల చెక్‌ను అందజేశారు. అలాగా సేవా సంస్థలకు ప్రకటించిన రూ. 5 లక్షల్లో అమ్మ అనాథశ్రమానికి 2 లక్షల రూపాయలు, ఇతర సేవా సంస్థలకు 3 లక్షల రూపాయల విరాళం అందించారు. తెలంగాణ రాష్ట్రానికి కూడా సాయిదుర్గ తేజ్ రూ. 10 లక్షల సాయం ప్రకటించిన విషయం తెలిసిందే.
Also Read-Malaika Arora Father: ఆత్మహత్య చేసుకున్న మలైకా తండ్రి అనిల్ అరోరా..
ఇక సాయిదుర్గ తేజ్ విజయవాడ పర్యటనలో భాగంగా.. మొదట శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శనం చేసుకుని ఆశీస్సులు అందుకున్నారు. ఆ తర్వాత అమ్మ అనాథాశ్రమానికి వెళ్లి అక్కడి వారి బాగోగులు అడిగి తెలుసుకున్నారు. అమ్మ ఆశ్రమానికి సొంత భవనం కట్టిస్తానని 2019లో తన పుట్టినరోజున మాటిచ్చిన సాయి దుర్గతేజ్... చెప్పినట్లుగానే 2021లో బిల్డింగ్ కట్టించి ఇచ్చారు. మూడేళ్ల పాటు అమ్మ అనాథాశ్రమాన్ని దత్తత తీసుకుని మొత్తం ఖర్చులన్నీ భరించారు. సాయి దుర్గతేజ్ మంచి మనసుకు ఆశ్రమవాసులతో పాటు ప్రజలందరి ప్రశంసలు దక్కాయి.
Also Read- Devara Trailer: దేవర.. మరో ఆచార్య! నెట్టింట రచ్చ రచ్చ
అమ్మ అనాథాశ్రమానికి విరాళం అందించిన అనంతరం ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ని కలిసి రూ. 10 లక్షల చెక్‌ని అందజేశారు. మేనమామ, ఏపీ డిఫ్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నుంచి సేవా గుణాన్ని పుణికిపుచ్చుకున్న సాయి దుర్గతేజ్ భవిష్యత్‌లోనూ తనకు వీలైనంతగా సేవా కార్యక్రమాలు చేస్తూ సమాజానికి తనవంతుగా అండగా నిలబడాలని భావిస్తున్నారు.
Read Latest Cinema News