Sai Durgha Tej: టిఎఫ్‌జెఏ ద్వారా నటి పావలా శ్యామలకు సాయి దుర్గ తేజ్ ఆర్థిక సాయం

ABN , Publish Date - Jul 26 , 2024 | 06:34 PM

మెగా సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్ తన గొప్ప మనసుని మరోసారి చాటుకున్నారు. సాయం విషయంలో మామయ్యల మార్గాన్ని ఫాలో అయ్యే తేజ్.. తాజాగా ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్‌కు విరాళం అందించడమే కాకుండా.. ఆ సంస్థ ద్వారా దీనస్థితిలో ఉన్న నటి పావలా శ్యామలకు ఆర్థిక సాయాన్ని అందించారు. గతంలో ఇచ్చిన మాటకు కట్టుబడి పావలా శ్యామలకు ఆ ఆర్థిక సాయం టిఎఫ్‌జెఏ ద్వారా అందేలా చేశారు.

Pavala Shyamala and Sai Durgha Tej

మెగా సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్ (Mega Supreme Hero Sai Durgha Tej) తన గొప్ప మనసుని మరోసారి చాటుకున్నారు. సాయం విషయంలో మామయ్యల మార్గాన్ని ఫాలో అయ్యే తేజ్.. తాజాగా తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్‌ (TFJA)కు విరాళం అందించడమే కాకుండా.. ఆ సంస్థ ద్వారా దీనస్థితిలో ఉన్న నటి పావలా శ్యామల (Pavala Shyamala)కు ఆర్థిక సాయాన్ని అందించారు. గతంలో ఇచ్చిన మాటకు కట్టుబడి పావలా శ్యామలకు ఆ ఆర్థిక సాయం టిఎఫ్‌జెఏ ద్వారా అందేలా చేశారు. ఈ క్రమంలో తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ మెంబర్స్ కలిసి వెళ్లి ఆమెకు లక్ష రూపాయల ఆర్థిక సాయాన్ని అందించారు.

Also Read- Raayan Review: రాయన్  రివ్యూ.. ధనుష్ 50వ చిత్రం ఎలా ఉందంటే.. 


సాయి దుర్గ తేజ్ (Sai Durgha Tej) ఇచ్చిన మాటను గుర్తు పెట్టుకుని ఇలా ఆర్థిక సాయాన్ని అందించడంతో నటి పావలా శ్యామల ఎమోషనల్ అయ్యారు. తన ధీనస్థితి గురించి చెబుతూ కన్నీరు మున్నీరయ్యారు. ఇలాంటి పరిస్థితుల్లో సాయి దుర్గ తేజ్ తనను గుర్తు పెట్టుకుని మరీ సాయం చేయడం గొప్ప విషయమని ఎమోషనల్ అయ్యారు. ఇక సాయి దుర్గ తేజ్‌తో వీడియో కాల్‌లో నటి పావలా శ్యామల మాట్లాడుతూ కన్నీరు పెట్టుకున్నారు. ఇచ్చిన మాట గుర్తు పెట్టుకుని మరీ సాయం చేసిన తేజ్‌కు ఆమె ధన్యవాదాలు తెలిపారు.


TFJA-Members.jpg

వీడియో కాల్‌లో మాట్లాడుతూ.. ఆమెకు అన్ని విధాల అండగా ఉంటామని సాయి దుర్గ తేజ్ భరోసానిచ్చారు. అందరూ సాయం చేస్తారని, తోడుగా ఉంటారని హామీ ఇచ్చారు. ‘యాక్సిడెంట్ జరిగినప్పుడు.. మీరు బాగుండాలని, ఏమీ కాకూడదని ఆ దేవుడిని ప్రార్థించానంటూ నటి పావలా శ్యామల చెబుతూ కన్నీరు పెట్టుకున్నారు. ఆమె ప్రేమకు, మాటలకు సాయి దుర్గ తేజ్ ఎమోషనల్ అయ్యారు. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) చేసిన ఆర్థిక సాయాన్ని కూడా నటి పావలా శ్యామల గుర్తు చేసుకున్నారు.

Read Latest Cinema News

Updated Date - Jul 26 , 2024 | 06:34 PM