కాశీ యాత్రలో రేణు దేశాయ్, అకీరా, ఆద్య.. సింప్లిసిటీకి కేరాఫ్ అడ్రస్

ABN , Publish Date - Dec 31 , 2024 | 11:18 PM

ఏపీ డిప్యూటీ సీఏం పవన్ కళ్యాణ్ బిడ్డలు అనగానే అంతా వాళ్లకేంటి రాయల్, లగ్జరీ లైఫ్‌ని ఎంజాయ్ చేస్తూ ఉంటారని అనుకుంటూ ఉంటారు. కానీ, అలాంటి రాయల్ లైఫ్‌కి దూరంగా అకీరా, ఆద్యలను పెంచుతుంది రేణు దేశాయ్. అందుకు సాక్ష్యం వారి కాశీ యాత్రే. ఈ యాత్రలో వారు ఎంత సింప్లిసిటీగా ఉన్నారో.. సోషల్ మీడియాలో వారి ఫొటోలు, వీడియోలను చూస్తుంటేనే తెలుస్తుంది. విషయంలోకి వస్తే..

Renu Desai, Akira Nandan and Aadya at Kashi

ఏపీలో జరిగిన ఎన్నికలలో పవన్ కళ్యాణ్ విజయం సాధించడం, ఆ తర్వాత డిప్యూటీ సీఎంగా పదవిని చేపట్టడం, అన్నయ్య చిరంజీవి ఇంటికి వెళ్లి ఆశీర్వచనాలు తీసుకోవడం, పాలన పరంగా తన మార్క్‌ను అడుగడుగునా ప్రదర్శిస్తూ వస్తుండటం.. ఇలా నిత్యం ఆయన వార్తలలో ఉంటూనే ఉన్నారు. ఎన్నికలలో గెలిచినప్పటి నుంచి ప్రతి రోజూ అభిమానులకు ఏదో ఒక హై ఇస్తూనే ఉన్నారు. అయితే తన తండ్రి ఏపీ డిప్యూటీ సీఎం అయినప్పటికీ.. అకీరా నందన్, ఆద్యలని పవన్ మాజీ భార్య రేణు దేశాయ్ మాత్రం సింప్లిసిటీకి కేరాఫ్ అడ్రస్ అన్నట్లుగా పెంచుతోంది.

Also Read- Prabhas: తెలంగాణ ప్రభుత్వానికి రెబల్ స్టార్ ప్రభాస్ సపోర్ట్


ప్రధాని మోడీని కలవడానికి ఢిల్లీ వెళ్లినప్పుడు అకీరా తన వెంట ఉంటే.. ఆ తర్వాత కొన్ని ఈవెంట్లలో ఆద్య పవన్ వెంటే ఉంది. అలా ఇద్దరినీ ఇటు పవన్ కళ్యాణ్ కూడా కంటికి రెప్పలా తన బిడ్డల్ని చూసుకుంటాడనే విషయాన్ని ఆ సమయంలో పవన్ కళ్యాణ్ తెలియజేశారు. మరోవైపు రేణు దేశాయ్ కూడా సోషల్ మీడియా వేదికగా యాక్టివ్‌గా ఉండటమే కాకుండా.. జంతువుల సంరక్షణ, రైతుల సంరక్షణ కోసం తన వంతు ప్రయత్నాలు చేస్తూనే ఉంది. అలాగే తన బిడ్డలని మంచి మార్గంలో నడిపిస్తూ.. తండ్రికి తగ్గ బిడ్డలు అనేలా మాట్లాడుకునేలా చేస్తుంది.

Also Read-Dil Raju: సీఎంతో సినీ ప్రముఖుల భేటీపై కేటీఆర్ కామెంట్స్‌కు దిల్ రాజు స్పందనిదే..


తాజాగా రేణు దేశాయ్, అకీరా నందర్, ఆద్య.. కాశీ యాత్రకు వెళ్లారు. ఈ విషయం రేణు దేశాయ్ తన ఇన్‌స్టా వేదికగా తెలియజేసింది. అయితే ఈ కాశీ యాత్రలో వారు ఎంత సింప్లిసిటీగా గడుపుతున్నారో తెలుపుతూ రేణు దేశాయ్ కొన్ని ఫొటోలను షేర్ చేసింది. ఆటోలో ఆద్య, అకీరా వెళుతున్న వీడియోలను షేర్ చేసింది. అలాగే కాషాయి వస్త్రం ధరించి కాశీ వీధుల్లో అకీరా తిరుగుతున్న ఫొటోలను షేర్ చేసింది. వాస్తవానికి వారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బిడ్డలని తెలిస్తే.. వారికి అక్కడ సకల మర్యాదలు అందుతాయి. కానీ, ఇద్దరు బిడ్డల్ని రేణు దేశాయ్ ఆధ్యాత్మికతకు దగ్గర చేస్తూ.. రాయల్ లైఫ్‌కు అలవాటు పడకుండా చేస్తోంది. అందుకే కాశీలో వారంతా నార్మల్ పర్సన్స్‌గానే తిరుగుతున్నారు. వారిని అలా చూసిన అభిమానులైతే.. రేణు దేశాయ్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రస్తుతం కాశీ యాత్రలో ఉన్న వీరి ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Aslo Read-Game Changer: డిప్యూటీ సీఎం డేట్ ఇస్తే.. హిస్టరీ రిపీట్ అవుద్ది..

Also Read-Yearender 2024 ఆర్టికల్స్..

Also Read-Devi Sri Prasad: 'దమ్ముంటే పట్టుకోరా షెకావత్' వెనుక ఏం జరిగిందంటే..

Also Read-Tollywood: అల్లు అర్జున్ ఎఫెక్ట్.. ‘మా’ మంచు విష్ణు అలెర్ట్

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Dec 31 , 2024 | 11:46 PM