Pushpa 2 Collections: ఆల్ టైమ్ రికార్డ్ ఎలానో చెబుతారా? పబ్లిసిటీ లెక్కలొద్దు.. ఒరిజినల్ కలెక్షన్స్ చెప్పండి

ABN , Publish Date - Dec 06 , 2024 | 10:15 PM

‘పుష్ప 2’ మేకర్స్ తాజాగా డే 1 కలెక్షన్ అంటూ ఓ పోస్టర్‌ని విడుదల చేసి.. ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఆల్ టైమ్ రికార్డ్ అంటూ ప్రకటించారు. అయితే సినిమా రెండు రోజుల నుండి థియేటర్లలో ఆడుతుంటే.. ఒక్క రోజు లెక్కలు అంటారేంటి? అని నెటిజన్లు కొందరు మూవీ టీమ్‌పై మండిపడుతున్నారు. అసలు విషయంలోకి వస్తే..

Allu Arjun

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2 ది రూల్’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 5న విడుదలైంది. అయితే అధికారిక విడుదల తేదీ కంటే ముందే అంటే డిసెంబర్ 4వ తేదీ రాత్రి 9 గంటల నుండే షోలు మొదలయ్యాయి. అనగా.. పుష్ప2 చిత్రం డిసెంబర్ 4వ తేదీనే థియేటర్లలో విడుదలైంది. ‘పుష్ప 2’ మేకర్స్ తాజాగా డే 1 కలెక్షన్స్ అంటూ మొదటి రోజు రూ. 294 కోట్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్టినట్లుగా చెబుతూ.. ‘ఇండియన్ సినిమా హిస్టరీలోనే హయ్యస్ట్ కలెక్షన్స్’ రాబట్టిన చిత్రంగా పోస్టర్‌పై ప్రకటించారు. డిసెంబర్ 4, 5వ తేదీలు కలిపి ఒక్క రోజు ఎలా అవుతుంది? డిసెంబర్ 4న ప్రదర్శితమైన షోల కలెక్షన్స్ కూడా కలిపి ‘డే 1 ఆల్ టైమ్ రికార్డ్’ అని ఎలా ప్రకటిస్తారు? ఇవి ఒకరోజు లెక్కలా? రెండు రోజుల లెక్కలా? అనేది ఆ లెక్కల మాస్టారే క్లారిటీ ఇవ్వాలి.

Also Read- Allu Arjun: రేవతి మృతిపై స్పందించిన అల్లు అర్జున్.. ఏమన్నారంటే


ఇక కలెక్షన్ల విషయానికి వస్తే.. ఏపీ, తెలంగాణల తర్వాత తెలుగు సినిమాలకు ఎక్కువగా కలెక్షన్స్ వచ్చేది కర్ణాటకలో. అక్కడసలు బెనిఫిట్ షోలకు అనుమతి లేదంటూ జీవో వచ్చింది. మరోవైపు మలయాళంలో ఈ సినిమా పరిస్థితి ఎలా ఉందో బుక్ మై షో చూస్తే తెలిసిపోతుంది. గో గ్రీన్ అన్నట్లుగా మొత్తం గ్రీనే చూపిస్తున్నాయి. ఇప్పుడు హిందీ బెల్ట్‌లో రూ. 72 కోట్లు వచ్చినట్లుగా చెబుతున్నారు. నైజాంలో రూ. 30 కోట్లతో సరికొత్త రికార్డ్ అని చెప్పేశారు. అంటే నైజాం, హిందీ బెల్ట్ కలిపితే ఈ సినిమా రూ. 100 కోట్లు రాబట్టినట్లు. ఏపీ, కేరళ, కర్ణాటక, తమిళనాడు, రెస్టాప్ ఇండియా, ఓవర్సీస్ కలిపి సుమారు రూ. 194 కోట్లు వచ్చినట్లు. ఓవర్సీస్ పరంగా ప్రీ సేల్స్ లోనే ఈ సినిమా రూ. 100 కోట్లు వచ్చినట్లుగా మేకర్స్ ప్రకటించారు. ఇదంతా చూస్తుంటే ఇంతకు ముందు ఓ నిర్మాత చెప్పినట్లుగా పబ్లిసిటీ కోసమే ఇలా పోస్టర్ రిలీజ్ చేసినట్లుగా అర్థమవుతుంది. ఈ పోస్టర్ చూసిన వారంతా.. పబ్లిసిటీ లెక్కలు మాకొద్దు.. ఒరిజినల్ కలెక్షన్స్ చెప్పండి అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తుండటం విశేషం.


Pushpa-Raj.jpg

ఎంత పబ్లిసిటీ కోసం అయితే మాత్రం ప్రతిసారి ఇలా ఇష్టం వచ్చినట్లుగా ఫిగర్స్ వేసి ఫ్యాన్స్ మధ్య గొడవలు పెట్టాలని చూడటం ఏంటో ఆ మేకర్స్‌కే తెలియాలి. అసలు ఇన్ని కోట్లు కలెక్ట్ చేసిందని అంటున్నారు.. డే 1 ఆల్ టైమ్ రికార్డ్ అంటున్నారు కదా.. అసలీ సినిమా ఎన్ని థియేటర్లలో విడుదలైంది. టిక్కెట్ల రేట్లు ఎంత అనేది కూడా చెప్పగలరా..! అప్పుడు ఇతర సినిమాలతో పోల్చుకుని, రికార్డ్‌ అని ప్రకటించాలి. అదేం లేకుండా ఇష్టం వచ్చినట్లుగా ఒక ఫిగర్ దించేసి.. మా సినిమా అంత చేసింది, ఇంత చేసింది. ఇండియన్ సినిమాలోనే హిస్టరీ క్రియేట్ చేసిందని ఎలా ప్రకటిస్తారు? మళ్లీ ఇన్‌‌కమ్ టాక్స్ వాళ్లు దాడి చేస్తేనేమో.. అబ్బే అదేం లేదు.. పబ్లిసిటీ కోసమే అంటూ నాటకాలాడుతుంటారంటూ మేకర్స్‌పై విమర్శకులు సైతం మండిపడుతున్నారు.

Also Read-Game Changer: గేమ్ ఛేంజర్‌కి దెబ్బేసిన 'పుష్ప 2'

Also Read-SoChay Wedding: ఘనంగా నాగ చైతన్య, శోభితల వివాహం.. కింగ్ నాగ్ స్పందనిదే..

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Dec 06 , 2024 | 10:15 PM