TG Vishwa Prasad: టీజీ విశ్వ ప్రసాద్‌కు అమెరికాలో జనసైనికులు ఘనస్వాగతం

ABN , Publish Date - Jul 12 , 2024 | 07:50 PM

ప్రస్తుతం టాలీవుడ్‌లో అగ్ర నిర్మాణ సంస్థగా దూసుకుపోతున్న పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్‌కు పవర్ స్టార్, జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్‌తో ఉన్న అనుబంధం అందరికీ తెలిసిందే. సినిమాల పరంగానే కాకుండా, వ్యక్తిగతంగానూ పవన్ కళ్యాణ్‌తో టీజీ విశ్వ ప్రసాద్‌కు మంచి సాన్నిహిత్య బంధం ఉంది. తాజాగా అమెరికా వెళ్లిన ఆయనకు జనసైనికులు ఘనస్వాగతం పలికారు.

Producer TG Vishwa Prasad Gets A Warm Welcome at Seattle

ప్రస్తుతం టాలీవుడ్‌లో అగ్ర నిర్మాణ సంస్థగా దూసుకుపోతున్న పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్‌ (Producer TG Vishwa Prasad)కు పవర్ స్టార్, జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి (AP Deputy CM) అయిన పవన్ కళ్యాణ్‌ (Pawan Kalyan)తో ఉన్న అనుబంధం అందరికీ తెలిసిందే. సినిమాల పరంగానే కాకుండా, వ్యక్తిగతంగానూ పవన్ కళ్యాణ్‌తో టీజీ విశ్వ ప్రసాద్‌కు మంచి సాన్నిహిత్య బంధం ఉంది. ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్‌కు మద్దతునిచ్చిన పరిశ్రమలోని వ్యక్తులలో మొదటి వ్యక్తి ఆయనే అని చెప్పొచ్చు. ఇంతకుముందెన్నడూ లేని విధంగా NDA కూటమి విజయాన్ని పురస్కరించుకుని సంబరాలు జరిపిన మొదటి వ్యక్తి కూడా ఆయనే. ప్రస్తుతం విభిన్న తరహా చిత్రాలను రూపొందిస్తూ టాలీవుడ్ మాత్రమే కాకుండా.. ఇతర సినీ ఇండస్ట్రీలలో కూడా తనదైన ముద్ర ప్రదర్శిస్తోన్న విజనరీ నిర్మాత‌ టీజీ విశ్వ ప్రసాద్‌‌కు తాజాగా అమెరికాలో ఘనస్వాగతం లభించింది.

Also Read- Tollywood Hero: ఈ ఫొటోలో ఉన్నది ఎవరో గుర్తు పట్టారా? టాలీవుడ్‌లోని ఓ యంగ్ హీరో?

2018లో జనసేన పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన దగ్గరనుంచి, జనసేన ప్రవాస గర్జన సందర్భంగా పవన్ కళ్యాణ్‌తో పాటు టీజీ విశ్వ ప్రసాద్ 2024 ఎన్నికల్లో పార్టీ విజయంలో కీలకపాత్ర పోషించారు. కాగా, ఎన్నికల ఫలితాల తర్వాత తొలిసారిగా అమెరికాలోని సియాటిల్‌కు వెళ్లిన టీజీ విశ్వప్రసాద్‌కు విమానాశ్రయంలో జనసేన మద్దతుదారులు ఘనస్వాగతం పలికారు. సియాటిల్‌ (Seattle)లోని శ్రీదేవి ఫంక్షన్‌ హాల్‌లో జనసైనికులు ఆయనను ఘనంగా సత్కరించారు.


TG-Vishwa-Prasad-2.jpg

ఈ సందర్భంగా టీజీ విశ్వ ప్రసాద్‌ (TG Vishwa Prasad) మాట్లాడుతూ.. ‘పటిష్టమైన సమన్వయం వల్లే కూటమి ఎన్నికల్లో విజయం సాధించింది. తెలుగుదేశం, జనసేన మద్దతుదారులు ఒకే స్ఫూర్తితో, ఆత్మీయతతో కలిసి పనిచేయాలి’ అని అన్నారు. సియాటిల్ జనసేన మద్దతుదారులు సుంకరి శ్రీరామ్, శ్రీకాంత్ మొగరాల, సుహాగ్ గండికోట, వినోద్ పర్ణ, రామ్ కొట్టి.. తెలుగుదేశం మద్దతుదారులు మనోజ్ లింగ, రామకృష్ణ, టిజి విశ్వప్రసాద్‌ను ఘనంగా సత్కరించారు.

Read Latest Cinema News

Pawan-Kalyan-Producer.jpg

Updated Date - Jul 12 , 2024 | 07:50 PM