SKN: మాట నిలబెట్టుకున్న నిర్మాత ఎస్‌కేఎన్.. పిఠాపురం మరియమ్మకు గిఫ్ట్‌గా ఆటో

ABN , Publish Date - Jul 11 , 2024 | 06:44 PM

మరోసారి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు నిర్మాత ఎస్‌కేఎన్. సోషల్ మీడియాలో ఎవరైనా ఆపదలో ఉండి సాయం అడిగినా, తను అభిమానించే వారి విషయంలో ఎవరైనా అభిమానం కనబరిచినా.. అలాంటి వారి విషయంలో ఎస్‌కేఎన్ ఎప్పుడూ తన గొప్పమనసును చాటుతుంటారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పిఠాపురంలో గెలిస్తే మరియమ్మకు తన డబ్బులతో ఆటో కొనిస్తానని అప్పుడు మాటిచ్చిన ఎస్‌కేఎన్.. ఇప్పుడా మాట నిలబెట్టుకున్నారు.

SKN Gifts Auto to Mariamma

మరోసారి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు నిర్మాత ఎస్‌కేఎన్ (Producer SKN). సోషల్ మీడియాలో ఎవరైనా ఆపదలో ఉండి సాయం అడిగినా, తను అభిమానించే వారి విషయంలో ఎవరైనా అభిమానం కనబరిచినా.. అలాంటి వారి విషయంలో ఎస్‌కేఎన్ ఎప్పుడూ తన గొప్పమనసును చాటుతుంటారు. అంతేకాదు, ఇతర ఛారిటీ యాక్టివిటీస్‌లో కూడా ముందుండి మంచి పేరు తెచ్చుకున్నారు యంగ్ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ ఎస్‌కేఎన్. తాజాగా ఆయన పిఠాపురంకు చెందిన మరియమ్మ అనే మహిళకు ఆటో కొని బహుమతిగా ఇచ్చారు. ఏపీలో ఎన్నికల సమయంలో పిఠాపురంకు చెందిన మరియమ్మ అనే మహిళ జనసేన అధినేత (Janasena Chief) పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) గెలిస్తే తన భర్త రిక్షా నడపగా వచ్చిన డబ్బులతో ఊరిలోని వారికి పార్టీ ఇస్తానని చెబుతూ.. సంతోషంగా డ్యాన్స్ చేస్తున్న వీడియో ఒకటి వైరల్ అయిన విషయం తెలిసిందే.


Mariyamma.jpg

ఆమె మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవడమే కాకుండా.. నిర్మాత ఎస్‌కేఎన్ దృష్టికి చేరాయి. ఆమె మాటలకు ఎంతో మురిసిపోయిన ఎస్‌కేఎన్.. ఆమె కోరుకున్నట్లు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Powerstar Pawan Kalyan) పిఠాపురం (Pithapuram)లో గెలిస్తే మరియమ్మ (Mariamma)కు తన డబ్బులతో ఆటో (Auto Gift) కొనిస్తానని అప్పుడే మాటిచ్చారు. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ గురువారం పిఠాపురం వెళ్లి మరియమ్మకు ఆటో కొని బహుమతిగా ఇచ్చారు. మరియమ్మకు ఎస్‌కేఎన్ ఆటో గిఫ్ట్‌గా ఇస్తున్న వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ వీడియోని జనసేన కార్యకర్తలు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు వైరల్ చేస్తున్నారు. మాట నిలబెట్టుకున్న మనసున్న నిర్మాత అంటూ.. పవర్ స్టార్ ఫ్యాన్స్‌తో పాటు నెటిజన్స్ ఎస్‌కేఎన్ సేవాగుణాన్ని ప్రశంసిస్తున్నారు.

Mariamma-Auto.jpg

కాగా, ఏపీ జరిగిన ఎన్నికలలో కూటమి విజయదుందుభి మోగించడమే కాకుండా.. పవన్ కళ్యాణ్ బంపర్ మెజారిటీతో గెలిచారు. ప్రస్తుతం ఆయన డిప్యూటీ సీఎంగానే కాకుండా మరో నాలుగు శాఖలకు మంత్రిగా బాధ్యతలను నిర్వహిస్తున్నారు.

Updated Date - Jul 11 , 2024 | 06:49 PM