Prakash Raj: డిప్యూటీ సీఎంకి ప్రకాష్ రాజ్ సపోర్ట్.. ఇంత ధైర్యమా?

ABN , Publish Date - Oct 06 , 2024 | 11:04 AM

తాజాగా ఆయన డిప్యూటీ సీఎంతో దిగిన ఓ ఫోటోని 'X' ఖాతా ద్వారా షేర్ చేసి.. ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ పెట్టారు. దీంతో ప్రకాష్ రాజ్‌కి మరింత ట్రోలింగ్ సెగలు తాకుతున్నాయి. ఇంతకీ ప్రకాష్ రాజ్ ఏం పోస్ట్ చేశాడంటే..

prakash raj

విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్(Prakash Raj) తిరుపతి లడ్డు వివాదం( Tirupati Laddu controversy) నేపథ్యంలో ఆంద్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌(Pawan Kalyan)పై వరుస విమర్శలతో విరుచుకుపడిన విషయం విదితమే. ఏకంగా పవనే మొదటగా ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలకు రియాక్టైనా.. తర్వాత అభిమానులు రెచ్చిపోయి మరి ఆయనపై సోషల్ మీడియా సాక్షిగా ట్రోల్ చేసిన.. ఆయన మాత్రం జస్ట్ అస్కింగ్ అంటూ తగ్గటం లేదు. ఈ నేపథ్యంలో తాజాగా డిప్యూటీ సీఎంతో దిగిన ఓ ఫోటోని 'X' ఖాతా ద్వారా షేర్ చేసి.. ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ పెట్టారు. దీంతో ప్రకాష్ రాజ్‌కి మరింత ట్రోలింగ్ సెగలు తాకుతున్నాయి. ఇంతకీ ప్రకాష్ రాజ్ ఏం పోస్ట్ చేశాడంటే..


ఇటీవల ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుపతి వారాహి యాత్రలో తమిళనాడు రాష్ట్ర మంత్రి, నటుడు ఉదయనిధి స్టాలిన్‌( Udhayanidhi Stalin)పై రెచ్చిపోయి మరి వ్యాఖ్యలు చేశారు. గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలకు కౌంటర్‌గా పవన్ మాట్లాడుతూ.. "సనాతన ధర్మాన్ని ఎవరూ నిర్మూలించలేరు. అలా ఎవరైనా ప్రయత్నిస్తే వారే కొట్టుకుపోతారు. వ్యక్తులు ఉండొచ్చు పోవచ్చు కానీ.. సనాతన ధర్మం ఎప్పటికీ నిలిచిపోతుంది. సనాతన ధర్మం డెంగ్యూ, మలేరియా అని దానిని నిర్మూలిస్తామని కొందరు అంటున్నారు. ఇలాంటి వారిని ఏం చేయాలి. సనాతన ధర్మాన్ని ఎవరూ ఏమీ చేయలేరని.. చేయాలని ప్రయత్నిస్తే వారే కొట్టుకుపోతారంటూ" అంటూ పరోక్షంగా స్టాలిన్‌ని టార్గెట్ చేశాడు. ఈ నేపథ్యంలో నటుడు ప్రకాష్ రాజ్ తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్‌కి పరోక్షంగా మద్దుతు తెలుపుతూ 'X' ఖాతా ద్వారా అతనితో దిగిన ఫోటోని 'విత్ ఏ డిప్యూటీ సీఎం' అనే క్యాప్షన్ తో షేర్ చేశారు. దీంతో ఫ్యాన్స్ మరింత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


గతంలో ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దూమారం రేపిన విషయం తెలిసిందే. సాక్షాత్తు ప్రధాన మంత్రితో సహా దేశం మొత్తం ఆయన వ్యాఖ్యలపై మండిపడింది. ఈ నేపథ్యంలో పవన్ మరోసారి ఆయనకు కౌంటర్ ఇయ్యగా.. తమిళనాడు మీడియా ఉదయనిధిని ఈ వ్యాఖ్యలపై స్పందన అడిగింది. దీనికి ఆయన నవ్వుతూ 'వెయిట్ అండ్ సీ' అంటూ సమాధానం దాటవేశారు. ఇక మరో వైపు డీఎంకే(DMK) పార్టీ పవన్ వ్యాఖ్యలపై రెస్పాండ్ అయ్యింది. బీజేపీ, టీడీపీ, పవన్ కళ్యాణ్.. మతం, హిందూ దేవతలను తమ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని, వారే దేశానికి నిజమైన శతృవులు. పవన్ కళ్యాణ్.. డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. స్టాలిన్ అంటరానితనం, సామాజిక అస్పృశ్యత, కులవివక్షపై పోరాడుతున్నాడని మద్దతు పలికారు.

Also Read- Rajendra Prasad: పుత్రిక వియోగాన్ని తట్టుకొనే మనో ధైర్యం రాజేంద్రుడికి ఆ దేవుడు ఇవ్వాలి


Also Read- Pawan Kalyan: అప్పుడు తిట్టినా కేసు లేదు.. ఇప్పుడు ఒక్కమాటకే పోలీసు కేసు


-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Oct 06 , 2024 | 11:13 AM