గాఢ రసభక్తితో పురాణపండ ‘ఉగ్రం ... వీరం’! పొన్నాల సమర్పణలో కేసీఆర్‌చే ఆవిష్కరణ

ABN , Publish Date - May 15 , 2024 | 09:55 AM

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో హీరో హీరోయిన్లతో పాటు, దర్శక నిర్మాతలకు, రచయితలకు, సాంకేతిక వర్గాలతో పాటు తెలుగు రాష్ట్రాలలో ఇరవై ఐదు పీఠాలకు, పన్నెండు మఠాలకు, మూడు వందల ధార్మిక మండళ్లకు, సుమారు వంద పత్రికల, ఛానెళ్ల, సోషల్ మీడియా ప్రతినిధులకు, రెండు రాష్ట్రాల న్యాయమూర్తులకు, న్యాయవాదులకు ఈ పురాణపండ శ్రీనివాస్ ‘ఉగ్రం.. వీరం’ ఉత్తమ గ్రంధాన్ని పొన్నాల లక్ష్మయ్య ఉచితంగా అందించనున్నారు.

గాఢ రసభక్తితో పురాణపండ ‘ఉగ్రం ... వీరం’! పొన్నాల సమర్పణలో కేసీఆర్‌చే ఆవిష్కరణ
Puranapanda Srinivas

తిరుమల సహా అహోబిలం నుండి యాదాద్రి వరకూ విస్తరించిన శ్రీ వేంకటేశ్వర, నారసింహ శ్రీ వైష్ణవ సంబంధితమైన సుమారు వెయ్యి ఆలయాలకు తెలంగాణ రాష్ట్ర బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పూర్వ ఐ.టి శాఖామంత్రి పొన్నాల లక్ష్మయ్య (Ponnala Lakshmaiah) ఒక అపురూపమైన శ్రీలక్ష్మీ నారసింహస్వామి మంత్ర పేటికను ఉచితంగా సమర్పించనున్నారు. భక్తి లక్షణకారులు మాట్లాడుకునే మధుర భక్తీ, ముగ్ధభక్తీ, వీరభక్తీ, గాఢ రసభక్తీ నిండిన ఈ అద్భుతమైన గ్రంథ సంపద పేరు ‘ఉగ్రం.. వీరం’ (Ugram Veeram).

సుమారు వందపేజీలతో అఖండ భక్తి చైతన్యాన్ని విరజిమ్ముతున్న మంత్ర బలాల దివ్యగ్రంధాన్ని ప్రముఖ రచయిత, శ్రీశైల దేవస్థానం పూర్వ ప్రత్యేక సలహాదారులు పురాణపండ శ్రీనివాస్ (Puranapanda Srinivas) మహాద్భుతంగా, పరమాద్భుతంగా, అత్యంత ఆకర్షణీయంగా, పరమ పవిత్రంగా అందించడం విశేషంగా చెప్పి తీరాలి.

Ugram-Veeram.jpg

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో (Tollywood) హీరో హీరోయిన్లతో పాటు, దర్శక నిర్మాతలకు, రచయితలకు, సాంకేతిక వర్గాలతో పాటు తెలుగు రాష్ట్రాలలో ఇరవై ఐదు పీఠాలకు, పన్నెండు మఠాలకు, మూడు వందల ధార్మిక మండళ్లకు, సుమారు వంద పత్రికల, ఛానెళ్ల, సోషల్ మీడియా ప్రతినిధులకు, రెండు రాష్ట్రాల న్యాయమూర్తులకు, న్యాయవాదులకు పొన్నాల లక్ష్మయ్య ఈ చక్కని ఉత్తమ గ్రంధాన్ని ఉచితంగా అందించనున్నట్లు సమాచారం.

మానవ సమూహాలమధ్య వొత్తిళ్ళు, సంఘర్షణలు ఎక్కువై మానసిక శాంతిని కోల్పోతున్న వర్తమాన కాలానికి పురాణపండ శ్రీనివాస్ చేస్తున్న జీవన సార్ధకతల అపురూప గ్రంధాలు కల్యాణప్రదమైన మహత్కార్యాలుగా దర్శనమిస్తున్నాయని, ఈ నారసింహుని గ్రంధం అందంలో ప్రహ్లాదుని జయగాథ పరమ ఉత్తేజ భరితంగా సాగిందని.... శ్రీనివాస్‌ని ప్రసింసిస్తూ.. గతంలో చండీయాగంతో ఈ దేశాన్నే ఆకర్షించిన కల్వకుంట్ల చంద్ర శేఖర రావు (KCR) వంటి రాజకీయ యోధుని క్షేమం కోరుతూ పొన్నాల లక్ష్మయ్య ఈ బలమైన గ్రంధాన్ని ఇంత అందంగా ముద్రించి ఉచితంగా సమర్పించడంతో పొన్నాల చరిత్ర కెక్కినట్లేనని తెలంగాణ పండిత శ్రేణులు సైతం అభినందలని వర్షిస్తున్నాయి.

Ponnala.jpg

రాజకీయాలకతీతంగా అన్ని పార్టీల ప్రముఖులకూ సైతం ఈ పురాణపండ నృసింహుణ్ణి అందించాలనే పొన్నాల లక్ష్మయ్య మహా సంకల్పంలా ఇంత వరకూ ఏ రాజకీయ నాయకులూ ఈ ఆచరణాత్మక సంకల్పం చెయ్యలేదని తెలంగాణా భవన్‌కు చెందిన బీఆర్ఎస్ శ్రేణులు బాహాటంగా పొన్నాల, పురాణపండపై ప్రశంసలు వర్షించడం గమనార్హం.

ఇంతటి మహోజ్వల మంత్ర వైభవాన్ని ఆవిష్కరిస్తున్న యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి విశేష భక్తులు, తెలంగాణా పూర్వ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ జాతీయ అధ్యక్షులు కేసిఆర్‌కి దైవబలం పుష్కలంగా ఉందని జ్యోతిష పండితులు పదే పదే పేర్కొనడం గమనార్హం. ఏదేమైనా ‘శ్రీనివాస్ చెయ్యి పడ్డ ప్రతీ బుక్కూ హిట్టే... సగటు తెలుగు భక్త పాఠకుడికి ఆయన తేనె తుట్టే’.... అంటూ రసజ్ఞులు అభినందనల చందనాలు వర్షిస్తున్నారు.

KCR-Photo.jpg

విఖ్యాత ఆధ్యాత్మిక పారమార్ధిక ప్రచురణల సంస్థ ‘జ్ఞాన మహా యజ్ఞ కేంద్రం’ ఈ దివ్య మంత్ర గుచ్చాన్ని మనోహరంగా నాణ్యతా ప్రమాణాలతో ముద్రించడం పాఠకుల్ని మనస్సుకు హత్తుకునేలా ఉందని తిరుమల తిరుపతి దేవస్థానం అన్నమాచార్య ప్రాజెక్ట్ డైరెక్టర్, విఖ్యాత సంస్కృత ప్రవచన కర్త ఆకెళ్ళ విభీషణ శర్మ పేర్కొనడం మరింత సౌందర్యాన్ని సంతరించుకుందని ప్రచురణకర్తలు సంతోషించడం మరొక మెలి మలుపుగా చెప్పక తప్పదు.

Updated Date - May 15 , 2024 | 08:30 PM