మహా బలాలకే మహాబలమే పవన్ కళ్యాణ్ ‘వారాహీ’ యాత్ర

ABN , Publish Date - Jun 30 , 2024 | 01:04 AM

‘వారాహి’ అనగానే తెలుగు చలన చిత్ర పరిశ్రమలో మొట్టమొదట గుర్తుకొచ్చేది ప్రముఖ నిర్మాత సాయి కొర్రపాటి అధినేతగా కలిగిన ‘వారాహి చలన చిత్రం’ సంస్థ. రెండేళ్లనాడు ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ వారాహి మాత గురించి మాట్లాడిన యూట్యూబ్ వీడియో సైతం జన సైనికుల్లో కొందరు తమ వాట్సప్ గ్రూపులలో వైరల్ చేస్తుండగా.. ఇప్పడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా వారాహి దీక్షలో పాలనా వ్యవహారాలను చూడటం, కొండగట్టు అంజన్నను దర్శించుకుని మొక్కులు చెల్లించుకోవడం విశేషంగా ఆకర్షించింది.

మహా బలాలకే మహాబలమే పవన్ కళ్యాణ్ ‘వారాహీ’ యాత్ర

*రాజమౌళి, కొర్రపాటి, పురాణపండ ల వెనుక ఉన్నది వారాహి అనుగ్రహమే!

‘వారాహి’ అనగానే తెలుగు చలన చిత్ర పరిశ్రమలో మొట్టమొదట గుర్తుకొచ్చేది ప్రముఖ నిర్మాత సాయి కొర్రపాటి అధినేతగా కలిగిన ‘వారాహి చలన చిత్రం’ సంస్థ. ‘వారాహి చలన చిత్రం’ అనగానే కన్నుల ముందు జాతీయ స్థాయిలో అవార్డుల పంట దక్కించుకున్న ‘ఈగ’ సినిమా గుర్తుకొస్తుంది. విజువలైజేషన్ ప్రమాణాలతో ఫాంటసీ యాక్షన్ చిత్రంగా ‘ఈగ’ సినిమాను అంతర్జాతీయ స్థాయిలో దృశ్య మాధ్యమంగా వారాహి చలన చిత్రం బ్యానర్ పై చూపించిన ఘనత ఎస్.ఎస్. రాజమౌళిదే. రాజమౌళి, కొర్రపాటి, పురాణపండల వెనుక ఉన్నది వారాహి అనుగ్రహమే!

‘ఈగ’ నుండి మొదలైన రాజమౌళి, సాయి కొర్రపాటిల స్నేహబంధం ఇటీవల సాయి కొర్రపాటి సుమారు ఇరవై ఐదు కోట్ల రూపాయల వ్యయంతో కర్ణాటక బళ్లారిలో అసాధారణ రీతిలో అరుదైన కృష్ణ శిలతో నిర్మించిన ‘శ్రీ అమృతేశ్వర ఆలయం’ ప్రారంభోత్సవ వేడుకలో శిఖర ప్రతిష్టకు తన సతీమణి రమా రాజమౌళితో హాజరవ్వడం, స్వయంగా ఆలయ గోపుర కలశాన్ని సాయితో కలిసి రాజమౌళి ప్రతిష్టించడం.. వాళ్ళిద్దరి స్నేహానికి వారాహి చలన చిత్రం హేతువైందనే చెప్పాలి. కొర్రపాటి సాయి నిర్మించే ప్రతీ సినిమాకి సుముహూర్తంలో రాజమౌళి దంపతులు మొదట కొబ్బరికాయ కొట్టాల్సిందేనని తెలుగు తమిళ కన్నడ చిత్ర పరిశ్రమలలో ఎనభై శాతం వర్గాలకు ఎరుకే.

Rajamouli.jpg

వారాహి చలన చిత్రం బ్యానర్‌పై బోయపాటి శ్రీను దర్శకత్వంలో సాయి కొర్రపాటి నిర్మించిన నందమూరి బాలకృష్ణ ‘లెజండ్’ ఇప్పటికీ ఒక మెరుపే. అలా వారాహి చలన చిత్రం సినీ ప్రయాణంలో ‘మనమంతా’ వంటి ఉన్నత విలువలున్న చిత్రంతో పాటు అనేక చిన్న చిత్రాలు నిర్మాణం.. వీటిలో కొన్ని హిట్లూ , కొన్ని ఫట్లు వారాహి చలన చిత్రంకి కూడా తప్పలేదు. సుమారు ఏడెనిమిదేళ్ళ వెనుక సాయి కొర్రపాటి వారాహి చలన చిత్రం సమర్పణలో ప్రచురించిన కొన్ని అపురూప గ్రంధాలు తెలుగు రాష్ట్రాలలో అత్యుత్తమంగా సంచలనం సృష్టించాయి.

బహుశా తెలుగు చలన చిత్ర రంగంలో ఎవరూ ఇలా ప్రాచీన వైభవాన్ని ఆధునిక హంగులతో భారీ గ్రంధాలను ప్రచురించలేదనే చెప్పాలి. ఎంతో అంకిత భావంతో, దైవీయ స్పృహతో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ద్వారా వందలాది మందికి రెండు మూడు రకాల అద్భుత గ్రంధాలను పంచిన ఘనత కూడా వారాహి చలన చిత్రందే. అనేక మంది నిర్మాతలకి, దర్శకులకి మాత్రమే కాకుండా సాంకేతిక నిపుణులకు సైతం ఈ అద్భుత గ్రంధాలను వారి ఇళ్లకు చేర్చి సాయి కొర్రపాటి ఎందరి అభినందనలో అందుకున్నారు కూడా. ఈ గ్రంధాలు కూడా మామూలు స్థాయిలో లేవు. నాణ్యతా ప్రమాణాల ముద్రణతో, అతి అరుదైన చిత్రాలతో, మేలిమి విలువల జపాన్ ఆర్ట్ పేపర్‌పై ముద్రించి, ఆత్మాన్వేషణల, సత్యాన్వేషణల అంశాలతో పాటు కొన్ని స్తోత్రాలు, కొన్ని రసభరితమైన రమణీయ కథలతో ఒక బాక్స్‌లో పెట్టి మరీ సమర్పించింది వారాహి సంస్థ.

ఈ గ్రంథ వైభవాల వెనుక ఉన్న సమర్ధవంతమైన శ్రమ, పరిశ్రమ, అసాధారణ ప్రతిభ, ప్రత్యక్షరంలో నిండిన దైవబలమే ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్. ఇటీవల సాయి కొర్రపాటి శ్రీ అమృతేశ్వరాలయాన్ని అత్యద్భుతంగా నిర్మించడంలో సాయిలో సంకల్ప బలానికి బీజం పురాణపండ శ్రీనివాసే అని తెలుగు మీడియా కోడై కూసింది కూడా. కపటాలకూ, కల్మషాలకూ, స్వార్ధాలకూ దూరంగా ఉండే కవిత్వ సాహిత్య ఆధ్యాత్మికతల కలబోతే పురాణపండ శ్రీనివాస్ అని తెలుగు రాష్ట్రాలలో వందల కొలదీ ఆలయాల, వేద పాఠశాలల, మతాల, పీఠాల ప్రముఖులందరికీ ఎరుకే! శ్రీనివాస్ కృషివల్లనే నిలువుటద్దాల్లాంటి అందమైన గ్రంధాలను కొర్రపాటి సాయి తన వారాహి సంస్థ ద్వారా అందించారనేది నిర్వివాదాంశం.

హనుమంతుని విరాట్ స్వరూపంతో పురాణపండ రచనా సంకలనంగా అందించిన వేల వెలుగుల ఆంజనేయగ్రంథమొకటి ‘నేనున్నాను’ పేరుతో వారాహి చలన చిత్రం చరిత్రలో మైలురాయిగా నిలిచిపోయిందనే చెప్పాలి. ఎన్నో ఆధ్యాత్మిక పరిశీలనలతో, సుమారు ఐదువందల హనుమంతుని వివిధ చిత్రాలతో, ఎంతో ఔన్నత్యమైన అంశాలతో పురాణపండ శ్రీనివాస్ అపురూప శోభతో అందించిన ఈ మహా గ్రంధాన్ని న్యూ ఢిల్లీలో భారతదేశ హోమ్ శాఖా మంత్రి అమిత్ షా ఆవిష్కరించి రచయిత పురాణపండ, సమర్పకులు సాయి కొర్రపాటిని అభినందనలు వర్షించడం కూడా వారాహి చలన చిత్రానికి భగవత్కటాక్షముగా దక్కిన ఘనతనే చెప్పాలి. ఈ హనుమాన్ గ్రాండ్ బుక్ గురించి మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, ఎం ఎం కీరవాణి , జూనియర్ ఎన్ఠీఆర్‌ల ప్రశంసలు గురించి కూడా సినీ వర్గాలు చెబుతున్నాయి.


Rajamouli-sai-and-srinivas.jpg

ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఇటీవల జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన ప్రచారం మొదలుపెట్టేముందు తానెక్కబోతున్న వాహనానికి కొండగట్టులో ‘వారాహి’ అనే పేరు పెట్టడం అప్పుడే సంచలనం సృష్టించింది. ఎండనకా , వాననకా ఆ ‘వారాహి’ లోనే ఎక్కువ శాతం ప్రయాణించి ప్రచారం చేసి, స్వచ్ఛమైన హృదయంతో కోట్లమంది మనసుల్ని, ఓట్లను గెలిచి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కావడంతో ‘వారాహి’ పేరు జన సామాన్యంలోకి కూడా వెళ్లి పవన్ కళ్యాణ్ కఠోర శ్రమ, పట్టుదల, అహోరాత్రళ్ళు ప్రజల గురించి పడ్డ తపన.. ఇప్పటి ఘన విజయం వారాహిమాత అనుగ్రహమేనన్న నమ్మకం జనంలో, నేతల్లో బలపడిందనడంలో సందేహాలనవసరం. రెండేళ్లనాడు ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ వారాహి మాత గురించి మాట్లాడిన యు ట్యూబ్ వీడియో సైతం జన సైనికుల్లో కొందరు తమ వాట్సప్ గ్రూపులలో వైరల్ చేస్తున్నారు కూడా. ఇప్పడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా వారాహి దీక్షలో పాలనా వ్యవహారాలను చూడటం, కొండగట్టు అంజన్నను దర్శించుకుని మొక్కులు చెల్లించుకోవడం విశేషంగా ఆకర్షించింది.

ఈ సందర్భంలో వారాహి అమ్మవారనగానే తెలుగు చలన చిత్ర సీమలో వారాహి చలన చిత్ర విశేషాల, వైభవాల వెనుక ఉన్న వారాహి అమ్మవారి కారుణ్యాన్ని ఒకసారి మొన్న మొన్నటి ఫిలిం నగర్ సినీ ప్రముఖుల ఒక సమావేశంలో వారాహి అంశాలు ఒక్క సారిగా తెరపైకి రావడంతో వారాహి చలన చిత్ర ఘనతల వెనుక ఖచ్చితంగా వారాహి అమ్మవారి ప్రార్ధన చేసే సాయి కొర్రపాటి సంస్థలు మీడియావారికి గుర్తొచ్చాయనేది నిర్వివాదాంశం.

వారాహి చలన చిత్రమే మహామహుడైన సృజనాత్మక సెల్యులాయిడ్ మేధావి, విఖ్యాత దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళిని, పరమ పవిత్ర కార్యాల నిర్మాణాత్మక కార్యశీలి, ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ వంటి ప్రతిభలను సాయి కొర్రపాటికి కాలం కలిపి చరిత్ర సిగలో ఉన్నతంగా నిలబెట్టిందనేది ఫిలిం నగర్ సాక్షిగా సత్యం. అదే నిజం.

Updated Date - Jun 30 , 2024 | 01:14 AM