NTR Jayanthi: సినీ రంగంలోనూ, రాజకీయ రంగంలోనూ ఎన్టీఆర్ శైలి అజరామరం

ABN , Publish Date - May 28 , 2024 | 02:48 PM

అటు సినీ రంగంలోనూ, ఇటు రాజకీయ రంగంలోనూ నందమూరి తారక రామారావు శైలి అజరామరం అని అన్నారు జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. మే 28, విశ్వవిఖ్యాత నటసౌర్వభౌమ నటరత్న నందమూరి తారక రామారావు 101వ జయంతిని పురస్కరించుకుని ఎన్టీఆర్‌ను స్మరించుకున్నారు పవన్ కళ్యాణ్. ఈ మేరకు ఆయన జనసేన పార్టీ తరపున ఓ లేఖను విడుదల చేశారు.

NTR Jayanthi: సినీ రంగంలోనూ, రాజకీయ రంగంలోనూ ఎన్టీఆర్ శైలి అజరామరం
Pawan Kalyan and NT Ramarao

అటు సినీ రంగంలోనూ, ఇటు రాజకీయ రంగంలోనూ నందమూరి తారక రామారావు (NT Rama Rao) శైలి అజరామరం అని అన్నారు జనసేన అధినేత (Janasena Chief), పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan). మే 28, విశ్వవిఖ్యాత నటసౌర్వభౌమ నటరత్న నందమూరి తారక రామారావు 101వ జయంతిని (NTR 101st Jayanthi) పురస్కరించుకుని ఎన్టీఆర్‌ను స్మరించుకున్నారు పవన్ కళ్యాణ్. ఈ మేరకు ఆయన జనసేన పార్టీ (Jana Sena Party) తరపున ఓ లేఖను విడుదల చేశారు. ఈ లేఖలో ఎన్టీఆర్ గురించి పవన్ కళ్యాణ్ ఏం చెప్పారంటే..

*NTR Jayanthi: ఎన్టీఆర్ ఘాట్ వద్ద తండ్రికి నివాళులు అర్పించిన బాలయ్య..


‘‘తెలుగు నుడికారానికి.. తెలుగు నేలకు.. తెలుగు జాతికి మరింత సొబగులు అద్దినవారిలో మనం ఎన్.టి.ఆర్‌గా పిలుచుకునే స్వర్గీయ నందమూరి తారక రామారావుగారు ఒకరని తెలుగువారు కించిత్ గర్వంగా చెప్పుకోవచ్చు. అటువంటి గొప్ప వ్యక్తి జయంతి సందర్భంగా అంజలి ఘటిస్తున్నాను. అటు సినీ రంగంలోనూ, ఇటు రాజకీయ రంగంలోనూ ఆయనదైన శైలి అజరామరం. రెవెన్యూ వ్యవస్థలో ఎన్.టి.ఆర్ గారు తీసుకువచ్చిన సంస్కరణలు, రెండు రూపాయలకే పేదలకు బియ్యం వంటి పథకాలు చిరస్థాయిగా నిలిచిపోయాయి. ఆయన జయంతిని పురస్కరించుకుని నా పక్షాన, జనసేన పార్టీ పక్షాన స్వర్గీయ ఎన్టీఆర్‌గారికి నివాళులు అర్పిస్తున్నాను..’’ అని ఈ లేఖలో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan About NT Ramarao) పేర్కొన్నారు.


Pawan-Kalyan-NTR.jpg

అంతకుముందు మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) కూడా ఎన్టీఆర్‌ను స్మరించుకుంటూ ఓ ట్వీట్ చేశారు. ‘‘కొందరి కీర్తి అజరామరం. తరతరాలు శాశ్వతం. భావితరాలకు ఆదర్శం. నందమూరి తారక రామారావు గారిని ఈ రోజు గుర్తుచేసుకుంటూ, వారు ప్రజా జీవితంలో చేసిన సేవలకు భారతరత్న పురస్కారం సముచిత గౌరవం అని భావిస్తున్నాను. తెలుగు వారి ఈ చిరకాల కోరికని కేంద్ర ప్రభుత్వం తప్పక మన్నిస్తుందని ఆశిస్తున్నాను..’’ అని చిరంజీవి తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

Read Latest Cinema News

Updated Date - May 28 , 2024 | 02:48 PM