Pawan Kalyan: సింగపూర్‌ అనా లెజినోవా గ్రాడ్యుయేషన్‌ వేడుకల్లో పవన్ కళ్యాణ్.. వీడియో వైరల్

ABN , Publish Date - Jul 20 , 2024 | 07:11 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సతీమణి అనా కొణిదెల సింగపూర్ యూనివర్సిటీ నుంచి మాస్టర్స్ డిగ్రీ పొందారు. అనా కొణిదెలకు ఇది రెండో మాస్టర్స్ డిగ్రీ. నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్‌లో వైభవంగా నిర్వహించిన స్నాతకోత్సవంలో ఆమె పట్టా స్వీకరించారు. ఈ వేడుకలకు పవన్ కళ్యాణ్ కూడా హాజరై, తన భార్యను అభినందించారు.

Anna Konidala and Pawan Kalyan

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సతీమణి అనా లెజినోవా (Anna Lezhneva) సింగపూర్ (Singapore) యూనివర్సిటీ నుంచి మాస్టర్స్ డిగ్రీ పొందారు. అనా కొణిదెలకు ఇది రెండో మాస్టర్స్ డిగ్రీ. నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్‌ (National University of Singapore)లో వైభవంగా నిర్వహించిన స్నాతకోత్సవంలో ఆమె పట్టా స్వీకరించారు. ఆగ్నేయాసియా దేశాల కళలు, సామాజిక విజ్ఞానం (ఆర్ట్స్ మరియు సోషల్ సైన్సెస్) లో ఆమె ఈ మాస్టర్స్ చేశారు. మాస్టర్స్ పట్టా పొందినందుకు సతీమణికి పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు.

Pawan-Kalyan.jpg

అనా కొణిదెల (Anna Konidala) రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్ స్టేట్ యూనివర్శిటీలో చదివారు. అక్కడ ఓరియంటల్ స్టడీస్‌లో హానర్స్ పట్టా పొందారు. ఆసియా దేశాల చరిత్ర, భాషలు, జీవన విధానంపై అధ్యయనానికిగాను తొలుత డిగ్రీ పొందారు. ఆ అధ్యయనంలో థాయిలాండ్ చరిత్ర ఒక ప్రత్యేక సబ్జెక్ట్‌గా ఉంది. సెయింట్ పీటర్స్‌బర్గ్ స్టేట్ యూనివర్శిటీలో ఉండగానే మూడు భాషలు కూడా నేర్చుకున్నారు. ఆ తర్వాత బ్యాంకాక్‌లోని చులాలాంగ్‌కార్న్ యూనివర్సిటీ నుంచి థాయ్ స్టడీస్‌లో అనా కొణిదెల మొదటి మాస్టర్స్ డిగ్రీ సాధించారు. (Anna lezhneva Got The Master Of Arts)


Anna-Konidala.jpg

సింగపూర్‌లో జరిగిన ఈ వేడుకలకు అనా కొణిదెలతో పాటు పవన్ కళ్యాణ్ కూడా హాజరయ్యారు. సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్, అనా లెజినోవా సింగపూర్ యూనివర్సిటీకి ఈ గౌరవం స్వీకరించేందుకు వెళుతున్న ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇటీవల అనా లెజినోవా సింగపూర్ ట్రిప్స్‌పై కొందరు కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. ఆ కామెంట్స్ చేసిన వారందరికీ.. ఈ మాస్టర్స్ డిగ్రీతో క్లారిటీ ఇచ్చారు పవన్ కళ్యాణ్ మరియు అనా.

Updated Date - Jul 20 , 2024 | 07:16 PM