Bigg Boss 8: ‘బిగ్ బాస్ సీజన్ 8’ విన్నర్ నిఖిల్

ABN , Publish Date - Dec 15 , 2024 | 10:42 PM

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 షో 105 రోజుల జర్నీకి ముగింపు పడింది. ఆదివారం జరిగిన గ్రాండ్ ఫినాలే ఈవెంట్‌లో నిఖిల్ విన్నర్‌గా నిలవగా, గౌతమ్ రన్నర్‌గా వెనుదిరిగాడు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ చేతుల మీదగా విన్నర్ అయిన నిఖిల్ బిగ్ బాస్ సీజన్ 8 ట్రోఫీని అందుకున్నారు.

Nikhil Bigg Boss 8 Telugu winner

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 విన్నర్‌గా నిఖిల్ నిలిచాడు. ఉత్కంఠ భరితంగా సాగిన ఈ గ్రాండ్ ఫినాలేలో నిఖిల్ విన్నర్‌గా నిలవగా, రన్నర్‌గా గౌతమ్ రెండో స్థానం సొంతం చేసుకున్నాడు. నాగార్జున విన్నర్‌ని అనౌన్స్ చేశారు. విన్నర్ అయిన నిఖిల్‌, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ చేతుల మీదుగా బిగ్ బాస్ సీజన్ 8 ట్రోఫీని అందుకున్నారు. ట్రోఫీతో పాటు రూ. 55 లక్షల క్యాష్ ప్రైజ్, మారుతి సుజుకీ కారుని నిఖిల్ గెలుచుకున్నారు.

ఆదివారం జరిగిన బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే వేడుకను మేకర్స్ గ్రాండ్‌గా నిర్వహించారు. హౌస్‌లో ఉన్న టాప్ 5 కంటెస్టెంట్స్‌లో టాప్ 5 కంటెస్టెంట్‌గా అవినాష్ ఎలిమినేట్ కాగా, అతడిని కన్నడ స్టార్ ఉపేంద్ర హౌస్ నుండి బయటకు తీసుకువచ్చారు. టాప్ 4గా ప్రేరణ బిగ్ బాస్ హౌస్ నుండి వెనుదిరిగారు. ఆమెను ప్రగ్యా జైస్వాల్ హౌస్ నుండి బయటకు తీసుకువచ్చారు. ఇక టాప్ 3లో ఉన్న ముగ్గురు కంటెస్టెంట్స్‌కి నాగార్జున కొంత అమౌంట్‌తో సూట్ కేస్ ఆఫర్ చేయగా ముగ్గురూ రిజిక్ట్ చేశారు. అనంతరం కాపేపటికే నబీల్ ఎలిమినేట్ అయ్యాడు. నబీల్‌ను విజయ్ సేతుపతి హౌస్ నుండి బయటకు తీసుకువచ్చారు.


Nag-Ram-charan.jpg

అనంతరం సూట్ కేస్ తీసుకుని నాగ్ హౌస్‌లోకి వెళ్లి, ఇద్దరు కంటెస్టెంట్‌కు మరోసారి ఆఫర్ చేశారు. అందులో ప్రైజ్ మనీ మొత్తం కూడా ఉండొచ్చని చెప్పినా.. వద్దని అన్నారు. ఆ సూట్ కేస్ తీసుకుంటే ప్రేక్షకులు తనపై చూపిన ప్రేమను మోసం చేసినట్లు అవుతుందని నిఖిల్ చెప్పాడు. అనంతరం రామ్ చరణ్ స్టేజ్ మీదకు వచ్చి కాసేపు గేమ్ చేంజర్ ముచ్చట్లను చెప్పారు. తర్వాత ఇద్దరి చేతులు (నిఖిల్, గౌతమ్) పట్టుకుని ఫైనల్‌గా నిఖిల్ చేతిని పైకిత్తి.. ఆయన విన్నర్ అయినట్లుగా నాగార్జున ప్రకటించారు. ఆ తర్వాత పెద్దగా హడావుడి ఏమీ లేకుండానే షో ని ముగించారు.

Also Read-Chiru - Bunny: మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో అల్లు అర్జున్.. పిక్ వైరల్.. ఇక ఫుల్‌స్టాప్ పెట్టినట్టేనా!

Also Read-Bunny-Balayya: బన్నీకి బాలయ్య ఫోన్..

Also Read-రేలంగి వివాహ ఆహ్వాన పత్రిక: 91 సంవత్సరాల క్రితపు శుభలేఖను చూశారా..


-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Dec 15 , 2024 | 10:59 PM