Natti Kumar: ఏపీ అభివృద్ధిని జగన్ తట్టుకోలేకపోతున్నాడు.. ఈసారి ఆ 11 కూడా రావు
ABN , Publish Date - Jul 24 , 2024 | 03:56 PM
ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు వై నాట్ 175 అంటూ డప్పులు కొట్టిన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి 11 సీట్లు మాత్రమే వచ్చాయి. కనీసం సభలో 10 శాతం సీట్లు వస్తేనే ప్రతిపక్ష హోదా దక్కుతుందన్న విషయం ఆయనకు తెలియదా! దాని గురించి ఎందుకు పనికట్టుకుని రాద్ధాంతం చేస్తున్నారో ప్రతీఒక్కరూ ఆలోచించాలని సీనియర్ సినీ నిర్మాత నట్టి కుమార్ వ్యాఖ్యానించారు.
ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు వై నాట్ 175 అంటూ డప్పులు కొట్టిన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy)కి 11 సీట్లు మాత్రమే వచ్చాయి. కనీసం సభలో 10 శాతం సీట్లు వస్తేనే ప్రతిపక్ష హోదా దక్కుతుందన్న విషయం ఆయనకు తెలియదా! దాని గురించి ఎందుకు పనికట్టుకుని రాద్ధాంతం చేస్తున్నారో ప్రతీఒక్కరూ ఆలోచించాలని సీనియర్ సినీ నిర్మాత నట్టి కుమార్ (Natti Kumar) వ్యాఖ్యానించారు. ఈ మేరకు బుధవారం నట్టి కుమార్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ ప్రకటనలో..
Also Read- Anasuya: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంతో డ్యాన్స్ నెంబర్ చేశా..
‘‘ప్రతిపక్ష హోదా అనేది ఒకరు ఇస్తే మరొకరు తీసుకునేది కాదు, ప్రజలు ఓట్లు వేస్తే.. సీట్ల రూపంలో అది రావాలి, ఎవరంటే వారు డిమాండ్ చేసి తీసుకునేది కాదు. జగన్‌కు దానిపై అవగాహన లేకుండా ఉండదు. కానీ 50 రోజులు కూడా నిండీ నిండని కూటమి ప్రభుత్వంపై ఏదో ఒక రూపంలో అభాండాలు వేసి, పబ్బం గడుపుకోవాలని జగన్ చూస్తున్నారు. కానీ ప్రజలు చైతన్యవంతులు. వారు ఆయన చేసిన అరాచకాలను చూసి, భరించి, తట్టుకోలేక ఆయనకు ఓట్లు వేయలేదు. ఇప్పటికి కూడా జగన్ ఆ విషయాలను గుర్తించకుండా అభాండాలు వేసే పనిలో పడిపోయారు. ఇది ఆయనకే నష్టం చేకూరుస్తుంది. ప్రతిపక్ష హోదాపై ఏపీ హైకోర్టులో ఆయన పిటిషన్ దాఖలు చేయడం అనేది ఆయన ఇష్టం కావచ్చునేమో కానీ ఆ హోదాకు నిబంధనలు ఉన్నాయన్న సంగతిని ఆయన పట్టించుకోకపోవడం విడ్డురంగా ఉంది. తన అరాచక పాలనలో ఎలాంటి అభివృద్ధి పనులు చేయకుండా ఐదేళ్లు గడిపేసిన జగన్‌కు ఇప్పుడు పనిచేసే ప్రజా ప్రభుత్వం వచ్చిందని, కంటగింపుగా ఉంది. (Natti Kumar Comments on YS Jagan)
సీఎం చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu), డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan), ఇతర మంత్రులు నిత్యం ప్రజాసేవలో, సంక్షేమాభివృద్ధిలో తరించడాన్ని జగన్ తొలిదశలోనే చూసి, ఓర్చుకోలేకపోతున్నాడు. వారి ఐదేళ్ల పాలనలో ఏపీ అభివృద్ధిని చూస్తే, జగన్ తట్టుకోలేడు. ఇప్పుడొచ్చిన ఆ 11 సీట్లు కూడా ఆయనకు రావు అన్నది ఖాయం. ఇప్పటికైనా జగన్ వాస్తవాలను గ్రహించి, ప్రతిపక్ష హోదా గురించి కాకుండా శాసనసభా పక్ష నేతగా అసెంబ్లీకి హాజరై హుందాగా వ్యవహరిస్తేనే రాజకీయాలలో ఆయనకు ఆ పాటి మనుగడైనా ఉంటుంది’’ అని నట్టి కుమార్ (Producer Natti Kumar) హితవు పలికారు.
Read Latest Cinema News