హీరో నారా రోహిత్‌కు పితృవియోగం
ABN , Publish Date - Nov 16 , 2024 | 01:32 PM
హీరో నారా రోహిత్ తండ్రి, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడి సోదరుడైన నారా రామ్మూర్తి నాయుడు శనివారం గుండెపోటుతో మృతి చెందారు. కొన్నాళ్లుగా అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న ఆయనని ఒక వారం క్రితం హైదరాబాద్‌లోని AIG హాస్పిటల్లో చేర్చి చికిత్స అందిస్తున్నారు. శనివారం ఆయన పరిస్థితి విషమించడంతో పాటు సడెన్‌గా గుండెపోటు రావడంతో నారా రామ్మూర్తి నాయుడు మృతి చెందారు.
హీరో నారా రోహిత్ తండ్రి, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడి సోదరుడైన రామ్మూర్తి నాయుడు (72) శనివారం గుండెపోటుతో మృతి చెందారు. ఒక వారం క్రితం ఆయన ఆరోగ్య పరిస్థితి సరిగా లేకపోవడంతో హైదరాబాద్‌లోని AIG హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు. శనివారం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించినట్లుగా వార్తలు వచ్చిన కాసేపటికే రామ్మూర్తి నాయుడు గుండెపోటుతో మృతి చెందడం బాధాకరం. రామ్మూర్తి నాయుడు ఆరోగ్య పరిస్థితి విషమించిదని తెలిసిన మరు క్షణమే మంత్రి నారా లోకేష్ ఏపీ అసెంబ్లీ వదిలి హైదరాబాద్ AIG హాస్పిటల్‌కు చేరుకున్నారు. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తన పర్యటనను మధ్యలోనే ఆపేసి హైదరాబాద్‌కు బయలుదేరినట్లుగా తెలుస్తోంది.
రామ్మూర్తి నాయుడు విషయానికి వస్తే.. 1994 నుంచి 1999 వరకు చంద్రగిరి శాసనసభ నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ తరపున ఎమ్మెల్యేగా రామ్మూర్తి నాయుడు పనిచేశారు. ఆయన కుమారుడు నారా రోహిత్ నిశ్చితార్థం ఇటీవల ‘ప్రతినిధి 2’ హీరోయిన్ సిరిలెల్లాతో జరిగిన విషయం తెలిసిందే. వారి పెళ్లి కరెక్ట్‌గా నెలరోజులు ఉందనగా.. ఇప్పుడాయన తండ్రి రామ్మూర్తి నాయుడు మృతి చెందడం.. ఆ కుటుంబాన్ని తీవ్ర విషాదంలో ముంచెత్తింది. ప్రస్తుతం నారా, నందమూరి కుటుంబ సభ్యులు అంతా ఆస్పత్రికి చేరుకున్నారు. రామ్మూర్తి నాయుడు మృతిపై సినీ, రాజకీయ నాయకులంతా నివాళులు అర్పిస్తున్నారు. రేపు ఆయన స్వగ్రామం నారావారిపల్లెలో అంత్యక్రియలు జరగనున్నాయని కుటుంబ సభ్యులు తెలియజేశారు.
సంతాపం ప్రకటించిన నందమూరి రామకృష్ణ
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సోదరుడు రామ్మూర్తి నాయుడు ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మరణించారు. హైదరాబాద్‌లో గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో వెంటి లేటర్‌పై చికిత్స పొందుతూ రామ్మూర్తి నాయుడు మరణించారు. కాగా రామ్మూర్తి నాయుడి మరణంపై నందమూరి రామకృష్ణ సంతాపం ప్రకటించారు. వెంటనే ఆసుపత్రికి చేరుకున్న రామకృష్ణ... కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతి తెలిపారు.