Nandamuri Ramakrishna: ఇక లేవండి, సమయం ఆసన్నమైంది

ABN , Publish Date - May 11 , 2024 | 06:10 PM

ఒక రాజధాని లేని, రక్షణ లేని, భవిష్యత్తు లేని, అభివృద్ధి లేని, కుటుంబ వ్యవస్థ లేని రాష్ట్రంగా మిగిలిపోయింది ఆంధ్రప్రదేశ్. నెంబర్ లేని రాష్ట్రంగా ముద్ర వేసి, ఆఖరికి చిప్ప కూడా లేకుండా వైసీపీ జగన్ ప్రభుత్వం చేసింది.. ఇక లేవండి, సమయం ఆసన్నమైంది అంటూ పిలుపునిచ్చారు నందమూరి రామకృష్ణ.

Nandamuri Ramakrishna: ఇక లేవండి, సమయం ఆసన్నమైంది
Nandamuri Ramakrishna

ఒక రాజధాని లేని, రక్షణ లేని, భవిష్యత్తు లేని, అభివృద్ధి లేని, కుటుంబ వ్యవస్థ లేని రాష్ట్రంగా మిగిలిపోయింది ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh). నెంబర్ లేని రాష్ట్రంగా ముద్ర వేసి, ఆఖరికి చిప్ప కూడా లేకుండా వైసీపీ జగన్ ప్రభుత్వం చేసింది.. ఇక లేవండి, సమయం ఆసన్నమైంది అంటూ పిలుపునిచ్చారు నందమూరి రామకృష్ణ (Nandamuri Ramakrishna). మే 13న జరిగే ఎన్నికలు మాములువి కావని, ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కుని వినియోగించుకుని తెలుగుదేశం (TDP) అలాగే కూటమి (Kutami) అభ్యర్థులను గెలిపించాలని ఆయన కోరుతూ.. తాజాగా ఆయన ఓ వీడియో సందేశం విడుదల చేశారు. ఇందులో..

*AP Elections 2024: పవన్ కళ్యాణ్‌కు పెరుగుతున్న మద్దతు.. సోషల్ మీడియాలో సెలబ్రిటీల ట్వీట్స్


‘‘యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి మా హృదయ పూర్వక నమస్కారాలు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐదేళ్ల రాక్షస, వైసీపీ (YCP) పరిపాలన చూశాం. అక్కడ ప్రజలు అందరూ ఎంత భయంతో జీవిస్తున్నారో కూడా మనం చూశాం. ఒక రాజధాని లేని, రక్షణ లేని, భవిష్యత్తు లేని, అభివృద్ధి లేని, కుటుంబ వ్యవస్థ లేని రాష్ట్రంగా మిగిలిపోయింది. నెంబర్ లేని రాష్ట్రంగా ముద్ర వేసి, ఆఖరికి చిప్ప కూడా లేకుండా వైసీపీ జగన్ ప్రభుత్వం చేసింది. ఇక లేవండి, సమయం ఆసన్నమైంది. ఈ మే 13న మన ఆంధ్ర‌ప్రదేశ్‌ (Andhra Pradesh)లో అతి కీలకమైన ఎన్నికలు జరుగుతున్నాయి. అందరికీ యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి, యువతీయవకులకు నా విజ్ఞప్తి, రాష్ట్ర భవిష్యత్తు కోసం, మీ భావితరాల భవిష్యత్తు కోసం మంచి చేసే ప్రభుత్వాన్ని మీరు ఎన్నుకోండి. మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకుని రాష్ట్రాన్ని మంచి బాటలో పెట్టాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. రేపు జరిగే ఎన్నికల్లో కూటమిని గెలిపిస్తారని ఆశిస్తున్నాను. మన అభివృద్ధి ప్రధాత చంద్రబాబు (Chandrababu)ని ముఖ్యమంత్రి (CM)ని చేసి మళ్ళీ ఏపీని దేశంలో ప్రధమ స్థానంలో పెట్టాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం బడుగు బలహీన వర్గాల వారికోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం ముందుకు నడుస్తుంది. ఇది మీ పార్టీ, ఇక లేవండి సమయం ఆసన్నమైంది. రండి కదలి రండి, మీ విలువైన ఓట్లు తెలుగుదేశం అలాగే కూటమి అభ్యర్థులకు వేసి గెలిపించాలని పిలుపునిస్తున్నాను.

- మీ తెలుగు సైనికుడు’’ అంటూ నందమూరి రామకృష్ణ చెప్పుకొచ్చారు.

Read Latest Cinema News

Updated Date - May 11 , 2024 | 06:16 PM