Nagma Birthday Special: 90స్ స్టార్ హీరోయిన్.. నగ్మా బర్త్ డే స్పెషల్

ABN , Publish Date - Dec 25 , 2024 | 08:08 PM

Nagma Birthday Special: నగ్మా.. సౌతిండియాలో స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన తార. నేడు తన 50వ పుట్టినరోజుని జరుపుకుంటుంది. నేపథ్యంలో ఆమె కెరీర్, లైఫ్‌పై చిత్రజ్యోతి స్పెషల్ ఆర్టికల్

Nagma Birthday Special

నందితా అరవింద్ మొరార్జీ అలియాస్ నగ్మా 90వ దశకంలో ఓ వెలుగు వెలిగిన సౌతిండియన్ లేడీ సూపర్ స్టార్. తన పీక్ డేస్‌లో సౌత్‌లోనే టాప్ రెమ్యునరేషన్ తీసుకొనే హీరోయిన్‌గా ఎదిగిందంటే ఆమె క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలలో ఈమెతో సినిమాలు చేయడానికి ఎందరో స్టార్ డైరెక్టర్లు క్యూ కట్టేవారు. అలాంటి నగ్మా జీవితంలో ఎన్నో వివాదాస్పద అంశాలు, కష్టాలు కూడా ఉన్నాయి.

పర్సనల్ లైఫ్

నగ్మా తల్లి సీమా తన మొదటి భర్తతో విడాకులు తీసుకొని చందర్ సాధన అనే సినీ నిర్మాతను పెళ్లి చేసుకుంది. నగ్మా మొదటి భర్తకు జన్మించింది. ఇక రెండవ భర్తకి ప్రముఖ హీరోయిన్లు జ్యోతిక, రోషిని జన్మించారు.


WhatsApp Image 2024-12-25 at 19.52.46.jpeg


డెబ్యూ & ఫేమ్

నగ్మా.. సల్మాన్ ఖాన్ 'భాగీ' మూవీతో బాలీవుడ్ లో డెబ్యూ చేసింది. కానీ.. ఆ సినిమా నిరాశపరిచింది. నెక్స్ట్ ఇయర్ సుమన్ పెద్దింటి అల్లుడు సినిమాతో తెలుగులో డెబ్యూ చేసింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ హిట్ తర్వాత ఆమె కెరీర్ లో వెనక్కి తిరగకుండా ముందుకు దూసుకుపోయారు. నాగార్జున 'కిల్లర్' మూవీ ఆమెకి మరింత గుర్తింపు తీసుకొచ్చింది. ఇక చిరంజీవితో నటించిన 'ఘరానా మొగుడు' సినిమా కెరీర్ లోనే పెద్ద మైలురాయిగా నిలిచింది. అనంతరం వారసుడు, అల్లరి అల్లుడు, రిక్షావోడు, భాషా, కాదలన్, భరత సింహం, సరదా బుల్లోడు వంటి చిత్రాలతో స్టార్ హీరోయిన్‌గా ఏకచక్రాధిపత్యం వహించారు.

WhatsApp Image 2024-12-25 at 19.54.08.jpeg

స్టార్‌లతో లవ్

నగ్మా ఇండియన్ క్రికెట్ సెన్సేషన్ సౌరవ్ గంగూలీతో ప్రేమాయణం నడిపింది. వీరిద్దరూ శ్రీ కాళహస్తిలో పూజలు కూడా నిర్వహించారు. ఏమైందో ఏమో కానీ తర్వాత వీరి రిలేషన్షిప్‌కి బ్రేక్ పడింది. ఆ తరవాత తమిళ్ స్టార్ హీరో శరత్ కుమార్‌తో ప్రేమలో పడి విఫలమైంది.


WhatsApp Image 2024-12-25 at 19.52.03.jpeg

భోజ్‌పురి మూవీస్ & మోర్ లవ్

అనంతరం సౌత్ లో అవకాశాలు తగ్గడంతో ఆమె భోజ్‌పురి సినిమాల్లో నటించింది. ప్రముఖ నటుడు రవికిషన్‌తో వరుస సినిమాలు చేసింది. ఆయనతో ప్రేమలో కూడా పడింది. కానీ.. అప్పటికే ఆయనకు పెళ్లి కావడంతో ఇది కూడా బెడిసికొట్టింది. తెలుగులో ఆమె చివరిగా జూనియర్ ఎన్టీఆర్ అల్లరి రాముడు సినిమాలో కనిపించింది.

పాలిటిక్స్

తర్వాత నగ్మా సినిమాలకి గుడ్ బై చెప్పి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. మొదట భారతీయ జనతాపార్టీలో చేరిన తర్వాత కాంగ్రెస్ గూటిలోకి షిఫ్ట్ అయ్యింది. మీరట్ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఘోర పరాజయం పొందింది. ప్రస్తుతం పార్టీకి సేవలు అందిస్తుంది.

Updated Date - Dec 25 , 2024 | 08:08 PM