Thaman: 'ఫస్ట్ లవ్' అల్బ‌మ్‌.. సినిమా చూసిన ఎక్స్ పీరియన్స్ ఇచ్చింది

ABN , Publish Date - Aug 05 , 2024 | 06:38 PM

దీపు జాను, వైశాలిరాజ్ లీడ్ రోల్స్ న‌టించిన‌ బ్యూటీఫుల్ మ్యాజికల్ ఆల్బం ఫస్ట్ లవ్. తాజాగా సెన్సేషనల్ కంపోజర్ ఎస్ఎస్ తమన్ ఫస్ట్ లవ్ సాంగ్ ని గ్రాండ్ గా లాంచ్ చేశారు.

first love

దీపు జాను (Deepu Janu), వైశాలిరాజ్ (Vaishali Raj) లీడ్ రోల్స్ లో బాలరాజు ఎం డైరెక్ట్ చేసి బ్యూటీఫుల్ మ్యాజికల్ ఆల్బం ఫస్ట్ లవ్ (First Love). న‌టి వైశాలిరాజ్ స్వ‌యంగా నిర్మించిన ఈ ఆల్బం టీజర్ హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. తాజాగా సెన్సేషనల్ కంపోజర్ ఎస్ఎస్ తమన్ (Thaman S) ఫస్ట్ లవ్ సాంగ్ ని గ్రాండ్ గా లాంచ్ చేశారు.

GSIPjReXgAEc58Y.jpeg

ఈ సంద‌ర్భంగా తమన్ మాట్లాడుతూ.. ఈ ఈవెంట్ కి రావడం చాలా ఆనందంగా ఉంది. ఫస్ట్ లవ్ (First Love) మ్యూజిక్ వీడియో చాలా బ్యూటీఫుల్ గా ఉంది. పాట‌లో ఒక అద్భుతమైన కథ చూపించారు. మంచి సినిమా చూసిన ఫీలింగ్ కలిగింది. కెమెరామెన్ చాలా అద్భుతమైన విజువల్స్, మధు పొన్నాస్ బ్యూటీ ఫుల్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చేశారు. ఆల్బం చాలా బావుంది. వైశాలీ, ఖుషి సినిమాలు గుర్తుకు వచ్చాయి. కొత్త వారు చేసిన ఈ మంచి ప్రయత్నానికి సిద్ శ్రీరామ్ సపోర్ట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఆల్బం పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నా' అన్నారు.


న‌టి, ప్రొడ్యూసర్ వైశాలిరాజ్ (Vaishali Raj) మాట్లాడుతూ.. మా స్పెషల్ గెస్ట్ తమన్ (Thaman) గారికి థాంక్ యు సో మచ్. ఆయన చాలా బిజీగా ఉండి కూడా మమ్మలి సపోర్ట్ చేయడానికి రావడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. వారికి మనస్పూర్తిగా కృతజ్ఞతలు. మేము చాలా కష్టపడి ప్రేమతో ఈ పాట చేశాం. డైరెక్టర్ గారికి థాంక్ యూ. సిద్ శ్రీరామ్ గారికి బిగ్ థాంక్స్. ప్రతి టెక్నిషియన్స్ కే థాంక్ యూ. మా సాంగ్ ఇంత అద్భుతంగా రావడానికి సాగర్ గారు చాలా సపోర్ట్ చేశారు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ తో షేర్ చేయండి అని' అన్నారు.

GTBmeOfXAAAgewt.jpeg

దీపు జాను, డైరెక్టర్ బాలరాజులు మాట్లాడుతూ.. మా స్పెషల్ గెస్ట్ తమన్ గారికి థాంక్ యూ సో మచ్. ఆయన ఈ వేడుకకు వచ్చి మా పాట‌ను పెద్దది చేశారు. అందరూ సెలబ్రేట్ చేసుకునే చాలా స్పెషల్ ఆల్బం ఇది. డైరెక్టర్, ప్రొడ్యూసర్ గారికి థాంక్ యూ వెరీ మచ్. ఈ సాంగ్ క్రెడిట్ అంతా డైరెక్టర్ గారికే దక్కుతుంది. మధు, సంజీవ్ కి థాంక్ యు. ఈ సాంగ్ అందరికీ నచ్చుతుందని, వైరల్ అవుతుందనే నమ్మకం ఉంది అన్నారు.

Updated Date - Aug 05 , 2024 | 06:38 PM